Geoffrey Hinton Nobel Prize : మెషిన్ లెర్నింగ్‌లో ఆవిష్కరణలు.. ఏఐ గాడ్ ఫాదర్ జియోఫ్రీ ఇ.హింటన్‌కు ఫిజిక్స్‌లో నోబెల్ పురస్కారం..!

Geoffrey Hinton Nobel Prize : ఆర్టిఫిషియల్‌ న్యూరల్ నెట్‌వర్క్‌ల టెక్నాలజీతో మెషిన్ లెర్నింగ్‌‌లో అద్భుతమైన ఆవిష్కరణలు చేసినందుకు ఏఐ గాడ్ ఫాదర్‌గా పేరొందిన జియోఫ్రీ ఇ.హింటన్‌‌కు 2024 నోబెల్ పురస్కారం దక్కింది.

Godfather of AI Geoffrey Hinton gets Physics Nobel Prize

Geoffrey Hinton Nobel Prize : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రదానం ప్రక్రియ కొనసాగుతోంది. పలు రంగాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించిన ఎందరో ప్రముఖులకు ఈ నోబెల్ బహుమతులను ప్రదానం చేశారు. తాజాగా భౌతిక శాస్త్రంలో విశేష కృషిని అందించిన వారికి ఈ ఏడాదిలో ఇద్దరికి నోబెల్ పురస్కారం లభించింది.

అందులో ఒకరు ఏఐ గాడ్ ఫాదర్‌గా పేరొందిన జియోఫ్రీ ఇ.హింటన్‌ కాగా, మరొకరు జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌.. వీరిద్దరికి 2024 నోబెల్ పురస్కారం దక్కింది. ఆర్టిఫిషియల్‌ న్యూరల్ నెట్‌వర్క్‌ల టెక్నాలజీతో మెషిన్ లెర్నింగ్‌‌లో అద్భుతమైన ఆవిష్కరణలు చేసినందుకు వీరిద్దరూ ఈ నోబెల్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. స్వీడన్ రాజధాని అయిన స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఈ పురస్కారాలను ప్రకటించారు. గత ఏడాదిలో ఫిజిక్స్‌లో ముగ్గురికి ఈ నోబెల్ పురస్కారం దక్కింది.

Read Also : Dark Chocolate Benefits : ప్రతిరోజూ కొద్దిగా డార్క్ చాక్లెట్ తింటే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

ఫిజిక్స్‌‌లో నోబెల్ బహుమతి :
ఏఐ గాడ్‌ఫాదర్ అనగానే అందరికి ముందుగా గుర్తుచ్చేది పేరు జియోఫ్రీ ఇ.హింటన్.. ఎందుకంటే.. ఈయన “ఆర్టిఫిషియల్‌ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్‌కు పునాది వేసినవారిలో ఒకరు. ఏఐ పరిశోధనను వెలుగులోకి తెచ్చింది ఈయనే. ఆయన ఆవిష్కరణలకు గానూ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్చే భౌతిక శాస్త్రంలో 2024 నోబెల్ బహుమతిని అందించింది. జాన్ హాప్‌ఫీల్డ్, జెఫ్రీ ఇ.హింటన్ భౌతిక శాస్త్రంలో టూల్స్ ఉపయోగించి నేటి పవర్‌ఫుల్ మెషీన్ లెర్నింగ్‌కు పునాది వేశారు. ఆర్టిఫిషియల్‌ న్యూరల్ నెట్‌వర్క్‌ల ఆధారంగా మెషిన్ లెర్నింగ్ ప్రస్తుతం సైన్స్, ఇంజనీరింగ్, రోజువారీ జీవితంలో విప్లవాత్మక మార్పులు చేస్తోందని నోబెల్ ప్రైజ్ ప్రకటన పేర్కొంది.

“జాన్ హాప్‌ఫీల్డ్ డేటాలో ఇమేజ్‌లు, ఇతర రకాల ప్యాట్రన్స్ స్టోర్ చేయడం, తిరిగి నిర్మించగల అనుబంధ మెమరీని సృష్టించారు. జాఫ్రీ హింటన్ ఆటోనమస్ డేటాలోని ఫీచర్లను కనుగొనగల ఒక మెథడ్ కనుగొన్నారు. ఫొటోలలో నిర్దిష్ట అంశాలను గుర్తించడం వంటి పనులను ఇది నిర్వహించగలదు”అని నివేదిక తెలిపింది. నోబెల్ అవార్డు పొందిన సందర్భంగా హింటన్ విలేకరుల సమావేశంలో సరదాగా మాట్లాడుతూ.. “నేను కాలిఫోర్నియాలో వేగవంతమైన ఇంటర్నెట్ లేదా ఫోన్ కనెక్షన్ లేని హోటల్‌లో ఉన్నాను. నేను ఈ రోజు ఎంఆర్ఐ స్కాన్ చేయబోతున్నాను. నేను దాన్ని క్యాన్సిల్ చేయాలి” అన చమత్కరించారు.

2023లో గూగుల్ నుంచి నిష్ర్కమణ :
టెక్ ప్రపంచంలో ఏఐ ప్రమాదాల గురించి తరచుగా మాట్లాడే హింటన్ ఒక ప్రముఖ వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. 2013, 2023 మధ్య, హింటన్ గూగుల్ (గూగుల్ బ్రెయిన్)లో పనిచేశారు. అదే సమయంలో టొరంటో యూనివర్శిలో కూడా బోధించారు. ఆ యూనివర్శిటీలోనే ఓపెన్ఏఐ సహ-వ్యవస్థాపకురాలు, మాజీ ప్రధాన శాస్త్రవేత్త అయిన ఇలియా సట్స్‌కేవర్ మెషిన్ లెర్నింగ్ విద్యార్థి, జియోఫ్రీ హింటన్‌తో కలిసి పనిచేశారు. మెటాలో వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఏఐ సైంటెస్ట్ యాన్ లెకున్ కూడా హింటన్ విద్యార్థులలో ఒకరు. 2023లో జెఫ్రీ హింటన్ గూగుల్ నుంచి నిష్క్రమించారు. తప్పుడు సమాచారం, ఏఐతో జాబ్ మార్కెట్‌పై ప్రభావం, రియల్ డిజిటల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎదురయ్యే “అస్తిత్వ ముప్పు” గురించి ఎన్నోసార్లు హెచ్చరించారు.

న్యూరల్ నెట్‌వర్క్ సృష్టికర్తగా :
జియోఫ్రీ హింటన్ ఒక దశాబ్దానికి పైగా గూగుల్ కంపెనీలో పనిచేశారు. ఆర్టిఫిషియల్‌ అభివృద్ధికి గణనీయంగా సేవలందించారు. ఇద్దరు విద్యార్థులతో కలిసి ఆయన చాట్‌జీపీటీ, బింగ్, బార్డ్ వంటి ఏఐ మోడల్‌లకు పునాది వేసి తద్వారా న్యూరల్ నెట్‌వర్క్‌ను సృష్టించారు. అయినప్పటికీ, ఏఐతో రాబోయే ముప్పు గురించి కూడా హింటన్ ఆందోళన చెందారు. అంతేకాదు.. ఏఐతో ఎదురయ్యే ముప్పుపై అవగాహన పెంచేందుకు 2023లో గూగుల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాది అక్టోబరులో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జెఫ్రీ హింటన్ ఏఐతో మానవుల మనుగడ గురించి అనేక అంశాలపై చర్చించారు. మానవ మేధస్సును అధిగమించగలదని కూడా ఆయన హెచ్చరించారు.

Read Also : Apple iPhone SE 4 : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. ఐఫోన్ SE 4 వచ్చేది ఎప్పుడంటే? ఏయే అప్‌గ్రేడ్స్ ఉండొచ్చుంటే?