Google 25th Birthday _ How it all began and 10 fascinating facts you need to know
Google 25th Birthday : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజమైన గూగుల్ (Google) సెప్టెంబర్ 27న 25వ వార్షికోత్సవం (Google 25th Anniversary) జరుపుకుంటోంది. వాస్తవానికి 1998, సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని స్థాపించారు. అప్పట్లో కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివే సెర్గీ బ్రిన్ (Sergey Brin), లారీ పేజ్ (Larry Page) అనే అమెరికన్ సైంటిస్టులు గూగుల్‌ను స్థాపించారు.
అప్పటినుంచి గూగుల్ యూట్యూబ్ (Youtube) నుంచి ఆండ్రాయిడ్ (Android), జీమెయిల్ (Gmail), గూగుల్ సెర్చ్ (Google Search) వరకు ప్రపంచవ్యాప్తంగా వందలాది సర్వీస్‌లను అందిస్తోంది. గూగుల్ అనేది అందరికి బాగా అలవాటైపోయింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైంది. గూగుల్ 25 ఏళ్లు (సెప్టెంబర్ 27) పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక డూడుల్ (Google Special Doodle) పెట్టుకుంది. గూగుల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ చరిత్రకు సంబంధించి 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అధికారికంగా గూగుల్ ప్రారంభమైంది అప్పుడే :
గూగుల్ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. సెర్గీ బ్రిన్, లారీ పేజ్ మొదటిసారి జనవరి 1997లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో కలుసుకున్నారు. ఈ సమావేశం సమయానికి సెర్గీ బ్రిన్ అదే యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థిగా ఉన్నారు. ఉన్నత చదువుల కోసం స్టాన్‌ఫోర్డ్ వెళ్లేందుకు సిద్ధమైన లారీ పేజ్.. తనను క్యాంపస్‌కు తీసుకెళ్లమని సెర్గీ బ్రిన్‌ని అడిగారు.
Google 25th birthday celebrations
ఒక ఏడాది తర్వాత, ఇద్దరూ కలిసి సెర్చ్ ఇంజన్‌ని అభివృద్ధి చేసేందుకు తమ డార్మిటరీ రూంలో కలిసి పనిచేయడం ప్రారంభించారు. మొదటి మోడల్ విజయవంతంగా క్రియేట్ చేయడంతో సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఆగష్టు 1998లో, సన్ మైక్రోసిస్టమ్స్ సహ-వ్యవస్థాపకుడు ఆండీ బెచ్టోల్‌షీమ్, సెర్గీ బ్రిన్, లారీ పేజ్‌లకు లక్షల డాలర్ల చెక్కును అందించారు. అప్పుడే గూగుల్ పేరంట్ కంపెనీ ఆల్ఫాబెట్ ఇంక్ (Google Inc.) అధికారికంగా ప్రారంభమైంది.
గూగుల్ మొదటి ఆఫీసు అక్కడే.. :
ఈ కీలక పెట్టుబడితో కొత్తగా టీమ్ ఏర్పడింది. ఆ తర్వాత గూగుల్ కంపెనీ మొదటి కార్యాలయానికి తరలివెళ్లింది. కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ శివారులోని గ్యారేజీలోనే గూగుల్ మొదటి ఆఫీసుగా మారింది. ఆ తరువాతి సంవత్సరాల్లో, గూగుల్ వేగవంతమైన వృద్ధిని సాధించింది. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో ‘గూగుల్‌ప్లెక్స్’గా ప్రసిద్ధి చెందిన ప్రస్తుత ప్రధాన కార్యాలయానికి మారింది. అలా గూగుల్ 25ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనిపై గూగుల్ ఒక బ్లాగ్ పోస్టులో.. ఇద్దరు కంప్యూటర్ శాస్త్రవేత్తల మధ్య జరిగిన ఒక సమావేశం.. ఇంటర్‌నెట్ గమనాన్ని మిలియన్ల మంది జీవితాలను మార్చిందని తెలిపింది.
గూగుల్ ప్రతిరోజు, ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ భాషలలో గూగుల్ బిలియన్ల కొద్దీ శోధనలు జరుగుతున్నాయి. గూగుల్ ప్రారంభ రోజుల నుంచి చాలా మారినప్పటికీ మొదటి సర్వర్ నుంచి టాయ్ బ్లాక్‌లతో నిర్మించిన క్యాబినెట్‌లోనే కొనసాగుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 20 కన్నా ఎక్కువ డేటా సెంటర్లలో సర్వర్‌లకు, ప్రపంచ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం అలాగే కొనసాగిస్తోంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 24/7 ఇంటర్నెట్ లభ్యతను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్‌లను నిర్వహిస్తోంది.
విశేషమేమిటంటే.. గూగుల్ సెర్చ్ ఇండెక్స్ (Google Search Index) వందల కోట్ల ఆన్‌లైన్ పేజీలను విస్తరించింది. అది క్రమంగా 10కోట్ల (100,000,000) గిగాబైట్‌ల కన్నా ఎక్కువ పరిమాణాన్ని మించిపోయింది. మొదటి సెర్చ్ ఇంజిన్ ప్రోటోటైప్‌గా మొదలైన గూగుల్ గణనీయమైన తన పరిధిని మరింత విస్తరించింది. గూగుల్ 25ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా 10 ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Google 25th Birthday Sundar Pichai
గూగుల్ తల్లి జర్నీలో 10 ఆసక్తికరమైన అంశాలివే :
1. గూగుల్ నివేదిక ప్రకారం.. సెర్గీ బ్రిన్, లారీ పేజ్ మధ్య మొదటి సమావేశంతో గూగుల్ ప్రారంభానికి పునాది ఏర్పడింది.
2. వరల్డ్ వైడ్ వెబ్‌లోని వ్యక్తిగత వెబ్ పేజీల ప్రాముఖ్యతను అంచనా వేయడానికి సెర్చ్ ఇంజిన్ ప్రారంభంలో లింక్‌లను విశ్లేషించడంపై ఆధారపడింది. వెబ్‌సైట్ ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ‘బ్యాక్ లింక్‌లను’ మూల్యాంకనం చేయడంపై దృష్టి పెట్టింది. దానికి మొదట (BackRub) అని పేరు పెట్టారు. ఆ తర్వాత గూగుల్ (Google)గా పేరు మార్చింది.
3. గూగుల్ పేరు ప్రారంభంలో గూగోల్ (Googol) నుంచి వచ్చింది. Googol అంటే.. 1 తర్వాత 100 జీరోలు అనమాట..
4. ICANN ప్రకారం.. డొమైన్ పేర్లను రిజిస్టర్ చేయడానికి బాధ్యత వహించే సంస్థ.. (Google.com) సెప్టెంబర్ 15, 1997న రిజిస్టర్ అయింది. కానీ, Google, సెప్టెంబర్ 1998 వరకు దాని వెబ్‌సైట్‌ను ప్రారంభించలేదు.
5. 1998లో గూగుల్ మొదటి కార్యాలయం కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లో ఉన్న గ్యారేజ్ నుంచి ప్రారంభమైంది. ఎంప్లాయ్ నెం. 16 సుసాన్ వోజ్కికీ.. ఆమె తర్వాత గూగుల్ ఆధ్వర్యంలోని అధికారిక ఆన్‌లైన్ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన (YouTube)కు సీఈఓగా నియమితులయ్యారు.
6. గూగుల్ యోష్కా (Yoshka)ను మొదటి కంపెనీ డాగ్ (Dog)గా పరిచయం చేసింది. ఆఫీస్ మౌంటెన్ వ్యూ లొకేషన్‌కు మారినప్పుడు గూగుల్ క్యాంపస్‌ని సందర్శించిన మొదటి కుక్క ఇదే.. అయితే, ఈ కుక్క పేరు యోష్కా కాగా.. 2011లో కన్నుమూసింది. కానీ, దాని గుర్తుగా ఇప్పటికీ అదే పేరు కొనసాగుతుంది. డిసెంబర్ 2011లో, గూగుల్ మౌంటైన్ వ్యూ క్యాంపస్‌లో ఒక వేడుక జరిగింది. 43 బిల్డింగ్‌లో పేరులేని ఫేఫ్‌ను కుక్క గౌరవార్థంగా యోష్కాస్ కేఫ్ (Yoshka’s Cafe) అని పిలుస్తారు.
7. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ తన ఆఫీసుల్లో కలర్‌ఫుల్ వాతావరణం కలిగి ఉంటుంది. అదే సంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తోంది.
8. 2006లో, డిక్షనరీలో ‘Google’ అనే పదం క్రియగా మారింది. మెరియం-వెబ్‌స్టర్ డిక్షనరీలో ‘Google Word’ అనే పదాన్ని చేర్చారు. ‘వరల్డ్ వైడ్ వెబ్‌లో (ఎవరైనా లేదా ఏదైనా) గురించిన సమాచారాన్ని పొందడానికి (Google Search Engine) ఉపయోగించారు.
9. ఫిబ్రవరి 25, 2009న, గూగుల్ తన మొదటి ట్వీట్‌ను పంపింది. అది బైనరీ కోడ్‌లో రాసి ఉంది. ఆ పదాన్ని ఆంగ్లంలోకి ట్రాన్సులేట్ చేయగా.. ‘నేను అదృష్టవంతుడిని’ (I’m feeling lucky) అనే మెసేజ్ అందించింది.
10. టెక్నాలజీ రంగంలో వృత్తిని కొనసాగించేందుకు వారిని ప్రోత్సహించే ప్రయత్నంలో గూగుల్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేస్తుంది.