Google Track Users Location : అయ్య బాబోయ్.. గూగుల్ ఎంత పనిచేసింది.. యూజర్ల లొకేషన్‌ను సీక్రెట్‌గా ట్రాక్ చేస్తుందట.. రూ. 7వేల కోట్ల జరిమానా!

Google Track Users Location : కాలిఫోర్నియా అటార్నీ జనరల్ దాఖలు చేసిన దావా ప్రకారం.. గూగుల్ యూజర్ల ‘లొకేషన్ హిస్టరీ’ సెట్టింగ్‌ను ఆఫ్ చేసిన తర్వాత కూడా గూగుల్ వారి లొకేషన్ ట్రాక్ చేస్తుందని తేలడంతో వేల కోట్ల జరిమానా చెల్లించనుంది.

Google Track Users Location : అయ్య బాబోయ్.. గూగుల్ ఎంత పనిచేసింది.. యూజర్ల లొకేషన్‌ను సీక్రెట్‌గా ట్రాక్ చేస్తుందట.. రూ. 7వేల కోట్ల జరిమానా!

Google continued to track users location without their consent, now has to pay Rs 7000 crore fine

Google Track Users Location : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) ఎల్లప్పుడూ లొకేషన్ యాక్సెస్ ద్వారా యూజర్లను ట్రాక్ చేస్తుంటుంది. అందులో ప్రధానంగా గూగుల్ మ్యాప్‌(Google Maps)లు, లోకేషన్-ఆధారిత సర్వీసుల కచ్చితత్వాన్ని మెరుగుపరచడం, కొత్త ప్రొడక్టుల ఫీచర్‌లను అభివృద్ధి చేయడం లేదా సంబంధిత యాడ్స్ చూపించడం వంటివి ఉంటాయి. మీరు కొనుగోలు చేయాలనుకునే ప్రొడక్టు గురించి నిమిషాల్లో అనేక యాడ్స్ డిస్‌ప్లే చేస్తుంది.

ఇంటర్నెట్ అంతటా వివిధ కారణాల వల్ల గూగుల్ తన యూజర్లను ట్రాక్ చేస్తుంది. అయితే, యూజర్లు ట్రాకింగ్‌ను నిలిపివేస్తే లొకేషన్‌ను ట్రాక్ చేయదని గూగుల్ ఎల్లప్పుడూ స్పష్టం చేసింది. అయితే, ఇది అలా కాదని తెలుస్తోంది. గూగుల్ వ్యతిరేకంగా ఇటీవల దాఖలు చేసిన దావాలో యూజర్ల లొకేషన్ డేటా, ఎలా? ఎప్పుడు ట్రాక్ చేస్తుంది? స్టోరేజీ అవుతుందని కంపెనీ యూజర్లను తప్పుదారి పట్టించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. సెటిల్‌మెంట్‌లో భాగంగా.. గూగుల్ 93 మిలియన్ డాలర్లు చెల్లించనుంది. అంటే.. దాదాపు రూ. 7వేలు కోట్లు అని ది గార్డియన్ నివేదించింది.

సొంత లాభం కోసమే ట్రాకింగ్.. అటార్నీ జనరల్ దావా :
కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా (Rob Bonta) దాఖలు చేసిన దావా ప్రకారం.. యూజర్ల లొకేషన్ డేటాపై ఎక్కువ కంట్రోల్ కలిగి ఉన్నారని తప్పుడు అభిప్రాయాన్ని అందించడం ద్వారా కంపెనీ యూజర్లను మోసం చేసిందని ఆరోపించింది. గూగుల్ యూజర్లకు.. యూజర్ యాక్టివిటీ ఆప్షన్ స్టాప్ చేస్తే.. ఇకపై వారి లొకేషన్ ట్రాక్ చేయదని తెలిపింది. కానీ, దీనికి విరుద్ధంగా సొంత వాణిజ్య లాభం కోసం యూజర్ల కదలికలను ట్రాక్ చేయడం కొనసాగిస్తుందని బొంటా గార్డియన్‌కు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఆమోదయోగ్యం కాదని, గూగుల్ దీనికి సమాధానం చెప్పాల్సిందిగా పేర్కొన్నారు.

Read Also : iPhone 15 Series Low Price : ఐఫోన్ 15 సిరీస్ కావాలా? తక్కువ ధరకే కొత్త ఐఫోన్లను అందిస్తున్న దేశాలివే.. ఏ దేశంలో ధర ఎంత? ఇప్పుడే తెప్పించుకోండి..!

యూజర్లను తప్పుదారి పట్టించిందని ఆరోపణలు :
నివేదిక ప్రకారం.. గూగుల్ యూజర్ లొకేషన్ డేటాను ఎలా మేనేజ్ చేస్తుంది? అటార్నీ జనరల్ కార్యాలయం ఎలా నిర్వహించింది అనేదానిపై ఆరోపణలు వచ్చాయి. గూగుల్ యూజర్ల ‘లొకేషన్ హిస్టరీ’ని నిలిపివేయడానికి యూజర్లను అనుమతించిందని, వారు అలా చేస్తే కంపెనీ వారి ఆచూకీని ట్రాక్ చేయదని హామీ ఇచ్చింది. అయినప్పటికీ, అటార్నీ జనరల్ ప్రకారం.. గూగుల్ ఇప్పటికీ ఆటోమాటిక్‌గా యూజర్ ‘వెబ్ యాప్ యాక్టివిటీ” ట్రాకర్ వంటి ఇతర సోర్సెస్ నుంచి ఈ డేటాను సేకరించి సేవ్ చేసింది. అదనంగా, టెక్ దిగ్గజం లొకేషన్-టార్గెటెడ్ యాడ్స్ నివారించే సామర్థ్యాన్ని గురించి యూజర్లను తప్పుదారి పట్టించిందని ఆరోపించింది.

Google continued to track users location without their consent, now has to pay Rs 7000 crore fine

Google continued to track users location without their consent, now has to pay Rs 7000 crore fine

గూగుల్ ఆరోపణలను అంగీకరించనప్పటికీ.. కంపెనీ దాన్ని పరిష్కరించేందుకు అంగీకరించింది. ఇందుకుగానూ, 93 మిలియన్ డాలర్ల చెల్లించడంతో పాటు అనేక అదనపు బాధ్యతలను చేపట్టింది. ఈ కమిట్‌మెంట్‌లలో దాని లొకేషన్ ట్రాకింగ్ ప్రాక్టీసులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, టార్గెట్ చేసిన యాడ్ ప్రొఫైల్‌లను రూపొందించడానికి లొకేషన్ డేటాను ఉపయోగించే ముందు యూజర్లకు ముందస్తు నోటిఫికేషన్‌లు పంపడం, ఏదైనా ప్రైవసీకి సంబంధిత మార్పులను అమలు చేయడానికి ముందు గూగుల్ ఇంటర్నల్ ప్రైవసీ వర్కింగ్ గ్రూప్ నుంచి ఆమోదం పొందడం వంటివి ఉన్నాయి.

గూగుల్ మాత్రమే కాదు.. మెటాపై కూడా ఆరోపణ :
గూగుల్ ప్రతినిధి (José Castañeda) గార్డియన్‌తో మాట్లాడుతూ.. ‘ఇటీవలి సంవత్సరాలలో చేసిన మెరుగుదలలకు అనుగుణంగా గతంలో మార్చిన పాత ప్రొడక్టుల విధానాలపై ఆధారపడిన ఈ విషయాన్ని పరిష్కరించాం’ అని పేర్కొన్నారు. ముఖ్యంగా, సమ్మతి లేకుండా వినియోగదారుల డేటాను ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఏకైక గూగుల్ మాత్రమే కాదు. ఈ ఏడాది ప్రారంభంలో మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా (Meta) కూడా ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొంది.

1.2 బిలియన్ యూరోలు (1.3 బిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించాలని, యూరప్‌లోని ఫేస్‌బుక్ యూజర్ల నుంచి యునైటెడ్ స్టేట్స్‌కు సేకరించిన డేటా ట్రాన్స్‌ఫర్ నిలిపివేయాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సోషల్ మీడియా దిగ్గజానికి జరిమానా పడింది. ది న్యూయార్క్ టైమ్స్ నివేదించిన ప్రకారం.. రెగ్యులేటర్లు మెటా 2020 ఈయూ కోర్టు తీర్పును అనుసరించలేదని తేలింది.

Read Also : Xiaomi 14 Pro Launch Date : షావోమీ 14 ప్రో సిరీస్ లాంచ్ డేట్ లీక్.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?