Google 25th Birthday Doodle : గూగుల్ 25వ వార్షికోత్సవం.. స్పెషల్ డూడుల్ చూశారా? హోం పేజీలో లోగోపై క్లిక్ చేస్తే చాలు..!

Google 25th Birthday Doodle : ఈరోజు (సెప్టెంబర్ 27) గూగుల్ (Google) పుట్టినరోజు.. సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక డూడుల్ పెట్టుకుంది.

Google Celebrates Its 25th Birthday With A Special Doodle

Google 25th Birthday Doodle : ప్రపంచ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google) ఈరోజు (సెప్టెంబర్ 27) తన 25వ పుట్టినరోజును ప్రత్యేక డూడుల్‌తో జరుపుకుంటోంది. 1998, సెప్టెంబర్ 4న గూగుల్ (Google Inc)ను సెర్గీ బ్రిన్ (Sergey Brin), లారీ పేజ్ (Larry Page) అనే అమెరికన్ కంప్యూటర్ సైంటిస్టులు స్థాపించారు. అయితే, ఒక దశాబ్దానికి పైగా గూగుల్ తన పుట్టినరోజును సెప్టెంబర్ 27న జరుపుకుంటుంది.

అందులో భాగంగా కంపెనీ ‘వాక్ డౌన్ మెమరీ లేన్’ని తీసుకుంది. గూగుల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా గూగుల్‌ డూడుల్ (Google Doodle) ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది. గూగుల్ లోగో ప్లేస్‌లో 25వ వార్షికోత్సవాలు (G25gle) అనే అక్షరాలు స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది. వాస్తవానికి, గూగుల్ (Google)కు సెప్టెంబర్ 4కు 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.

Read Also : Google Track Users Location : అయ్య బాబోయ్.. గూగుల్ ఎంత పనిచేసింది.. యూజర్ల లొకేషన్‌ను సీక్రెట్‌గా ట్రాక్ చేస్తుందట.. రూ. 7వేల కోట్ల జరిమానా!

గూగుల్ లోగో బదులుగా ‘G25gle’ పేజీ.. : 
25 ఏళ్ల క్రితం, కాలిఫోర్నియా సబర్బ్‌లోని గ్యారేజ్ నుంచి గూగుల్ శోధన ప్రారంభమైంది. మొత్తం 6 ఖండాలలో 200 నగరాల్లో కార్యాలయాలు, డేటా కేంద్రాలను గూగుల్ కలిగి ఉంది. గూగుల్ తన 25వ పుట్టినరోజును పురస్కరించుకుని #Google25 గుర్తుగా వివిధ డూడుల్‌లను తన వెబ్ పేజీపై ప్రదర్శించింది. ప్రస్తుతం గూగుల్ హోం పేజీలో (Google Doodle GIF)తో వస్తుంది. ‘Google’ని ‘G25gle’గా మార్చేసింది. భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తూ ఈ రోజును ‘ప్రతిబింబించే సమయం’గా ఉపయోగిస్తున్నట్లు టెక్ సంస్థ తెలిపింది.

Google 25th Birthday Doodle Celebrates 25th Birthday

గూగుల్‌కు 25 ఏళ్లు.. 


గూగుల్ ప్రస్తుత సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai), గత నెలలో కంపెనీ పుట్టినరోజు సందర్భంగా గూగులర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గూగుల్ విజయంలో భాగమైన వినియోగదారులకు, ఉద్యోగులు, భాగస్వాములకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ పేరు ప్రారంభంలో గూగోల్ (Googol) నుంచి వచ్చింది. Googol అంటే.. 1 తర్వాత 100 జీరోలు అనమాట.. డేటాను ఆర్గనైజ్ చేసి ప్రపంచమంతా డేటాను సులభంగా యాక్సెస్ చేసేలా రూపొందించింది. ఈ క్రమంలోనే గూగుల్ ఫస్ట్ ఆఫీస్ అద్దెకు తీసుకుంది.

Read Also : Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్, ధర ఎంతో తెలిసిందోచ్..!

ట్రెండింగ్ వార్తలు