Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్, ధర ఎంతో తెలిసిందోచ్..!

Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఏడాది (2023)లో అక్టోబర్ 4న అధికారికంగా కొత్త పిక్సెల్ 8 ప్రో (Pixel 8 Pro) మోడల్ లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్, ధర ఎంతో తెలిసిందోచ్..!

Google Pixel 8 Series Complete Specifications, Price Tipped Ahead of October 4 Launch

Google Pixel 8 Series : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సొంత బ్రాండ్ పిక్సెల్ (Pixel) నుంచి సరికొత్త మోడల్ గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ (Google Pixel 8) సిరీస్ అక్టోబర్ 4న లాంచ్ కానుంది. ఈ 2023 ఏడాదిలో (Pixel 8 )ని బేస్ మోడల్‌గా, (Pixel 8 Pro)ని సరికొత్త ప్రో మోడల్‌గా లైనప్‌ని కంపెనీ ధృవీకరించినట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ 2022లో లాంచ్ అయిన (Google Pixel 7, Pixel 7 Pro) మోడల్ కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానున్నాయి.

రాబోయే పిక్సెల్ హ్యాండ్‌సెట్‌లకు సంబంధించి అనేక లీక్‌లు, నివేదికలు, వెరిఫైడ్ లిస్టులు పిక్సెల్ ఫోన్‌ల కీలక స్పెసిఫికేషన్‌లను సూచించాయి. త్వరలో లాంచ్ కాబోయే పిక్సెల్ ఫోన్‌లు గత మోడళ్ల కన్నా గణనీయమైన అప్‌గ్రేడ్‌లను అందించగలవని భావిస్తున్నారు. ఇప్పుడు, అధికారిక లాంచ్‌కు కొన్ని రోజుల ముందు.. టిప్‌స్టర్ స్మార్ట్‌ఫోన్‌ల అన్ని స్పెసిఫికేషన్‌లు, ధరలను రివీల్ చేసింది.

Read Also : Google Pixel 8 Launch : సరసమైన ధరకే గూగుల్ పిక్సెల్ 8 ఫోన్.. అక్టోబర్ 4నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

టిప్‌స్టర్ (Tipster) ప్రకారం.. పిక్సెల్ 8 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ధర అంచనాను జాబితా చేసింది. బేస్ మోడల్ పిక్సెల్ 8, అబ్సిడియన్, హాజెల్, రోజ్ కలర్ ఆప్షన్‌లలో రానుందని నివేదిక పేర్కొంది. అయితే, పిక్సెల్ 8 ప్రో అబ్సిడియన్, పింగాణీ, బే వేరియంట్‌లలో వస్తుంది. అంతేకాదు.. బేస్ మోడల్ ధర 699 డాలర్లు (దాదాపు రూ. 51,800), పిక్సెల్ ప్రో మోడల్ 899 డాలర్లు (దాదాపు రూ. 74,800)గా ఉండవచ్చు. బేస్ మోడల్ పిక్సెల్ 8 ఫోన్ ఫుల్-HD+ రిజల్యూషన్‌తో 6.17-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో సిరీస్ స్పెషిఫికేషన్లు :
అయితే ప్రో మోడల్ QHD రిజల్యూషన్‌తో 6.71-అంగుళాల LTPO OLED కలిగి ఉంటుంది. పిక్సెల్ ఫోన్ స్క్రీన్‌లు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లు టెన్సర్ G3 SoCల ద్వారా పవర్ అందిస్తాయి. 8GB + 12GB,128GB + 256GB RAM స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ కానుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 14తో పాటు పిక్సెల్ ఫోన్‌లను షిప్పింగ్ చేయనుంది.

Google Pixel 8 Series Complete Specifications, Price Tipped Ahead of October 4 Launch

Google Pixel 8 Series Complete Specifications Leak

పిక్సెల్ 8 డ్యూయల్ బ్యాక్ కెమెరా యూనిట్ 50MP ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 12MP సెన్సార్‌కు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు. అయితే, పిక్సెల్ 8 ప్రో ఆప్టికల్ ఇమేజ్‌తో 50MP ప్రైమరీ సెన్సార్‌ ఉంటుందని భావిస్తున్నారు. స్థిరీకరణ (OIS), అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన 48MP సెన్సార్, 5x జూమ్‌తో కూడిన మరో 48MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఈ పిక్సెల్ ఫోన్‌లు 10.5MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌లతో వచ్చే అవకాశం ఉంది.

పిక్సెల్ 8 సిరీస్ కెమెరా ఫీచర్లు  (అంచనా) :
గూగుల్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోతో ఏడేళ్ల OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించవచ్చని భావిస్తున్నారు. మ్యాజిక్ ఎడిటర్ ఫేస్-స్వాపింగ్ ప్రాపర్టీతో పాటు రియల్ టోన్, నైట్ సైట్, ఆస్ట్రోఫోటోగ్రఫీ, సూపర్ రెస్ జూమ్ ఫీచర్‌లకు కూడా ఫోన్‌లు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. వినియోగదారులు తక్కువ-కాంతి పరిస్థితుల్లో వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. తద్వారా వీడియో బూస్ట్, లైట్ సైట్ ఫీచర్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఈ ఫోన్‌లు ఆడియో ఎరేజర్‌తో వస్తాయి. వీడియోలలో ఆడియో నాయిస్ తగ్గించడంలో సాయపడుతుంది.

పిక్సెల్ 8 మోడల్ 24W వైర్డ్, 12W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,485mAh బ్యాటరీని అందిస్తుంది. మరోవైపు, పిక్సెల్ 8 ప్రో 27W వైర్డ్ ఫాస్ట్, 12W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,950mAh బ్యాటరీని అందిస్తుందని భావిస్తున్నారు. సెక్యూరిటీ పరంగా హ్యాండ్‌సెట్‌లు ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లతో వస్తాయి. బేస్ మోడల్ బరువు 187 గ్రాములు, ప్రో మోడల్ బరువు 213 గ్రాములు ఉండే అవకాశం ఉంది.

Read Also : Hero Karizma XMR : కొత్త బైక్ కొంటున్నారా? అక్టోబర్ 1 నుంచి పెరగనున్న హీరో కరిజ్మా XMR బైక్ ధర.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!