Google Pixel 8 Launch : సరసమైన ధరకే గూగుల్ పిక్సెల్ 8 ఫోన్.. అక్టోబర్ 4నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Google Pixel 8 Launch : డిజైన్ పరంగా గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 7 మాదిరిగానే ఉండవచ్చు. స్పెసిఫికేషన్ల వారీగా, గణనీయమైన అప్‌గ్రేడ్‌లు ఉండవచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Google Pixel 8 Launch : సరసమైన ధరకే గూగుల్ పిక్సెల్ 8 ఫోన్.. అక్టోబర్ 4నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Google Pixel 8 Launch on October 4 _ Everything we know so far

Google Pixel 8 Launch : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్ అయిన కొద్ది వారాల తర్వాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) పిక్సెల్ 8 సిరీస్ లాంచ్‌ తేదీ (అక్టోబర్ 4)ని ధృవీకరించింది. ఈ కొత్త పిక్సెల్ సిరీస్‌లో రెండు మోడల్‌లు ఉంటాయి. అందులో పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో. రెండోది అత్యంత అధునాతన ఫీచర్‌లతో రానుంది. పిక్సెల్ 8 సాపేక్షంగా సరసమైన ధరతో కస్టమర్‌లను ఆకట్టుకోనుంది. సాఫ్ట్‌వేర్ పరంగా, చిన్న ట్వీక్‌లతో పిక్సెల్ 8 పిక్సెల్ 8 ప్రో రెండూ ఒకే విధంగా ఉండవచ్చు. Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండవచ్చు. డిజైన్ వారీగా అనేక మార్పులు ఉండకపోవచ్చు. స్పెసిఫికేషన్ల వారీగా, కొన్ని అప్‌గ్రేడ్‌లు ఉండవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు (అంచనా) :
డిజైన్ : లీక్‌స్టర్ ఆన్‌లీక్స్‌తో (MySmartPrice) ద్వారా అందించిన రెండర్ల ఆధారంగా.. రాబోయే Pixel 8, Pixel 7ని పోలి ఉంటుంది. వెనుకవైపు కెమెరా బార్, పంచ్-హోల్ కటౌట్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుంది. వనిల్లా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాలను కొనసాగించవచ్చు. ప్రో మోడల్‌లో వెనుకవైపు 3 సెన్సార్లు ఉండవచ్చు. Pixel 8 మోడల్ సిరీస్ వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండడాన్ని కొనసాగించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్వీకుల కన్నా సన్నగా, తేలికగా ఉండవచ్చని లీక్ సూచించింది.

Read Also : iQOO Z7 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ Z7 ప్రో ఫోన్ వచ్చేసింది.. ఈ 5G ఫోన్ ధర ఎంతో తెలుసా? సేల్ డేట్ ఎప్పుడంటే?

డిస్‌ప్లే : వనిల్లా మోడల్ చిన్న డిస్‌ప్లేను కూడా కలిగి ఉండవచ్చు. Pixel 8 ఫోన్ 6.17-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేను 1,400nits గరిష్ట ప్రకాశం, 427 ppiతో కలిగి ఉండవచ్చు. గూగుల్సాధారణ మోడల్‌లో ఫ్లాట్ డిస్‌ప్లేను కొనసాగించవచ్చు.

Google Pixel 8 Launch on October 4 _ Everything we know so far

Google Pixel 8 Launch on October 4 _ Everything we know so far

సాఫ్ట్‌వేర్ – పర్ఫార్మెన్స్ : శాంసంగ్ Exynos ఆధారంగా Pixel ఇంటర్నల్ టెన్సర్ G3 చిప్‌సెట్ నుంచి పవర్ అందించవచ్చు. 24W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ టెక్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టుతో 4,485mAh బ్యాటరీ కూడా ఉండవచ్చు. ఛార్జర్ ఉండదని గమనించాలి. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లకు లైవ్ ట్రాన్స్‌లేషన్స్, ఫోటో బ్లర్, మరిన్నింటితో సహా అనేక AI, ML (మెషిన్ లెర్నింగ్) సామర్థ్యాలను అందిస్తుంది. Pixel 8 కొన్ని గూగుల్ బార్డ్ (Google Bard AI) ఫీచర్‌లను జెనరేటివ్ AI వంటి యాక్సస్ చేయడానికి ఉపయోగపడుతుంది.

కెమెరాలు : గూగుల్ పిక్సెల్ 8 వెనుక భాగంలో 50MP GN2 ప్రైమరీ సెన్సార్, 12MP IMX386 అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను ప్యాక్ చేయవచ్చు. మెరుగైన సబ్జెక్ట్ డిటెక్షన్ టైమ్-ఆఫ్-ఫ్లైట్ (ToF) సెన్సార్ కూడా ఉండవచ్చు. కొత్త సెటప్ మెరుగైన HDRతో పాటు లైట్ ప్రాసెసింగ్‌ను 35శాతం మెరుగుపరుస్తుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 11MP కెమెరా ఉండవచ్చు.

ధర : లాంచ్ ఈవెంట్ ధర గురించి తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 7 ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59,999 వద్ద లాంచ్ అయింది.

Read Also : Jio vs Airtel Monthly Fiber Plans : యూజర్లకు పండగే.. జియో, ఎయిర్‌టెల్ నెలవారీ ఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్ల ఫుల్ లిస్టు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!