Google Incognito Mode: ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజింగ్‌లోనూ డేటా లీక్!!

ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి డెస్క్‌టాప్ వినియోగదారుల వరకూ ఇండియా మొత్తం 86శాతం మంది వాడే బ్రౌజర్ గూగుల్. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ముందు గుర్తొచ్చేది గూగుల్.

Google Incognito Mode: ఆండ్రాయిడ్ యూజర్ల నుంచి డెస్క్‌టాప్ వినియోగదారుల వరకూ ఇండియా మొత్తం 86శాతం మంది వాడే బ్రౌజర్ గూగుల్. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ముందు గుర్తొచ్చేది గూగుల్. పబ్లిక్ గా చేసుకునే సెర్చ్‌లు గురించి బాధలేదు కానీ, ఎవరికీ తెలియకూడదని పర్సనల్ గా బ్రౌజ్ చేసుకునేవి కూడా లీక్ అవుతున్నాయంటే ఎలా.. అలా చేసుకునే వాళ్లు incognito browserను వాడుతుంటారు.

కారణం.. అందులో బ్రౌజింగ్ చేసినప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కదనే నమ్మకం. కానీ, దానిపై కూడా నిఘా పెట్టారని వార్తలొస్తున్నాయి. ఇందులో సమాచారాన్ని సైతం గూగుల్‌ రహస్యంగా సేకరిస్తోందని, యూజర్‌ భద్రతకు గ్యారంటీ లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది కాలిఫోర్నియా కోర్టును ఆశ్రయించగా అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుంది. గురువారం కీలక ఆధారాలను పిటిషనర్లు సమర్పించడంతో ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్‌ సురక్షితం కాదని, గూగుల్‌కు ఈ విషయం తెలిసి కూడా మిన్నకుంటుందని ఆరోపిస్తున్నారు.

దీనిపై గూగుల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ లొర్రాయిన్‌ ట్వోహిల్‌ నేతృత్వంలో జరిగిన ప్రాజెక్టు సమయంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఇన్‌కాగ్నిటో మోడ్‌ బ్రౌజింగ్‌ మీద అనుమానాలు వ్యక్తం చేశారట. అందులో బోలెడు సమస్యలున్నాయని, ఆ ఫీచర్‌ అవసరం లేదనిపిస్తోందని సుందర్‌ ఆ ప్రాజెక్టు సందర్భంగా అభిప్రాయపడినట్లు సమాచారం. దీని వల్ల పర్సనల్ డేటా లీక్‌ అయ్యే అవకాశం లేకపోలేదని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదంతా తెలిసి కూడా సీక్రెట్‌ బ్రౌజింగ్‌ మోడ్‌ను ప్రమోట్‌ చేశారని ఆ సమయంలో ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ఈ మేరకు గూగుల్‌ కంపెనీకి సంబంధించిన కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు పిటిషనర్లు.

గూగుల్ అధికార ప్రతినిధి జోస్ కస్టనెడా మాట్లాడుతూ.. సెకండ్, థర్డ్ హ్యాండ్ అకౌంట్ల ద్వారా మెయిల్స్ తప్పుడుగా వెళ్లడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు