Google Chrome
Google Chrome : గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? మీరు వాడే ఆండ్రాయిడ్ ఫోన్ వెర్షన్ పాతదా? కొత్తదా? ఓసారి చెక్ చేసుకోండి.. ఎందుకంటే.. వచ్చే ఆగస్టు నుంచి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ (Google Chrome) ఆయా ఫోన్లలో పనిచేయదు.
ఇంకా పాత ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే.. ఆండ్రాయిడ్ 8(Oreo) లేదా ఆండ్రాయిడ్ 9(Pie) వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోండి. ఈ పాత ఆండ్రాయిడ్ వెర్షన్ రన్ అయ్యే ఫోన్లలో క్రోమ్ సపోర్టును నిలిపివేస్తున్నట్లు గూగుల్ అధికారికంగా ప్రకటించింది.
మొదటివారంలో అప్ డేట్స్ రిలీజ్ (Google Chrome) :
ఆగస్టు 2025 ఫస్ట్ వీక్ నుంచి క్రోమ్ అప్‌డేట్స్ రిలీజ్ కానున్నాయి. ఆండ్రాయిడ్ 10 లేదా ఆపై వెర్షన్లలో మాత్రమే సపోర్టు చేస్తాయి. క్రోమ్ 139 వెర్షన్ ఆగస్టు 5, 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. క్రోమ్ 138 అనేది ఆండ్రాయిడ్ 8, 9 ఫోన్లకు ఫైనల్ వెర్షన్. ఈ పాత బ్రౌజర్ వెర్షన్ ప్రస్తుతానికి పనిచేస్తూనే ఉన్నప్పటికీ ఫ్యూచర్‌లో ఎలాంటి సేఫ్టీ ప్యాచ్‌లు, అప్‌గ్రేడ్స్ లేదా కొత్త ఫీచర్లు అందవు.
ఆండ్రాయిడ్ 8 లేదా ఆండ్రాయిడ్ 9లో ఫోన్ వాడుతున్నా అందులో క్రోమ్ బ్రౌజర్ వర్క్ అవుతుంది. కానీ కొత్త అప్‌డేట్ రాదు.. లేదా సేఫ్‌గా ఉండదు. కాలక్రమేణా అప్‌డేట్స్ లేకపోవడం వల్ల బగ్స్ లేదా సెక్యూరిటీ లోపాలు ఎదురవుతాయి. గూగుల్ అడ్వైజరీ సపోర్టు పేజీలో ఆండ్రాయిడ్ 8.0 లేదా 9.0 యూజర్లు ఆండ్రాయిడ్ 10.0 అంతకన్నా వెర్షన్‌లను పొందవచ్చు.
ఏప్రిల్ 2025 నాటి డేటా ప్రకారం.. ఆండ్రాయిడ్ 9 ఇప్పటికీ 6 శాతంతో యాక్టివ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లు ఆండ్రాయిడ్ 8, 8.1 దాదాపు 4 శాతం వాటా కలిగి ఉంది. భవిష్యత్తులో క్రోమ్ అప్‌గ్రేడ్ నుంచి ప్రతి 10 మంది ఆండ్రాయిడ్ యూజర్లలో డివైజ్‌లో గూగుల్ క్రోమ్ వెంటనే నిలిచిపోతుంది. పాత సాఫ్ట్‌వేర్‌లకు మీ ఫోన్ అప్‌గ్రేడ్ చేయకపోతే సేఫ్ ఫీచర్లతో పాటు లేటెస్ట్ బ్రౌజింగ్‌కు యాక్సస్ చేయలేరు.