Ration Card Update : రేషన్ కార్డుపై బిగ్ అప్‌డేట్.. జూన్ 30 లోపు ఈ పని పూర్తి చేయకపోతే ఫ్రీ రేషన్ కట్.. ఇప్పుడే ఇలా చేయండి!

Ration Card Update : రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ పూర్తి చేయలేదా? లేదంటే ఈ నెల 30లోగా పూర్తి చేయండి. రేషన్ కార్డుదారులందరికి ఈ-కేవైసీ తప్పనిసరి.

Ration Card Update : రేషన్ కార్డుపై బిగ్ అప్‌డేట్.. జూన్ 30 లోపు ఈ పని పూర్తి చేయకపోతే ఫ్రీ రేషన్ కట్.. ఇప్పుడే ఇలా చేయండి!

Ration Card Update

Updated On : June 28, 2025 / 5:13 PM IST

Ration Card Update : రేషన్ కార్డుదారులకు బిగ్ అప్‌డేట్.. మీ రేషన్ కార్డుకు ఇంకా ఈ-కేవైసీ చేయించుకోలేదా? లేదంటే.. ఇప్పుడు పూర్తి చేయండి. మీకు (Ration Card Update) రావాల్సిన రేషన్ నిలిచిపోతుంది.

జూన్ 30 నాటికి అన్ని రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. ఈ తేదీ నాటికి ఈ-కెవైసీ చేయించుకోని లబ్ధిదారుల ఆహార ధాన్యాలు నిలిపివేస్తారు. అయితే, పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులలో చాలా మందికి ఈ-కెవైసీ పూర్తయింది. చాలామంది లబ్ధిదారులు ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో కూడా లక్షల రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ పూర్తయింది. ఇంకా చాలామంది లబ్ధిదారుల కేవైసీ పెండింగ్‌లో ఉంది. అనర్హులు, మరో చోటుకు వెళ్లినవారు, మరణించిన వారి పేర్లను గుర్తించి తొలగించనున్నారు.

అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ పంపిణీ చేయనున్నారు. ఒకవేళ మీ రేషన్ కార్డుకు సంబంధించి e-KYC ప్రక్రియను సంబంధిత రేషన్ డీలర్‌ ద్వారా పూర్తి చేయొచ్చు. తద్వారా కార్డుదారులు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు.

Read Also : Google Pixel 9 Pro XL : పిక్సెల్ ఫోన్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 32వేలు తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు..!

ఇంటి నుంచే e-KYC పూర్తి చేయండి :
ఇంటి నుంచే e-KYC పూర్తి చేసేందుకు ముందుగా KYC యాప్, ఆధార్ ఫేస్ RD యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ కింది విధంగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

1. ముందుగా My KYC, ఆధార్ ఫేస్ RD యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
2. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి స్టేట్, లొకేషన్ ఎంచుకోండి.
3. మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. లింక్ చేసిన మొబైల్‌కు వచ్చే OTP ఎంటర్ చేయండి.
4. ఆ తర్వాత మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
5. ఫేస్ స్కాన్, మొబైల్ సెల్ఫీ కెమెరాతో స్కానింగ్ కోసం ఫేస్ eKYC ఆప్షన్ ఎంచుకోండి.
6. ఇలా చేయడం ద్వారా e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.

ఇప్పటికే, ప్రభుత్వం రేషన్ కార్డుపై eKYC పూర్తి చేసేందుకు చాలాసార్లు గడువులు ఇచ్చింది. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం గడువును చాలాసార్లు పొడిగించింది. మోదీ ప్రభుత్వం జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించింది. జూన్ 30లోపు ఈ పని చేయకపోతే మీకు ఫ్రీ రేషన్ రావడం ఆగిపోవచ్చు.