Google Pixel 9 Pro XL : పిక్సెల్ ఫోన్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 32వేలు తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు..!
Google Pixel 9 Pro XL : రిలయన్స్ డిజిటల్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఇలా పొందవచ్చు..

Google Pixel 9 Pro XL
Google Pixel 9 Pro XL : పిక్సెల్ ఫోన్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. హై-ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL అత్యంత (Google Pixel 9 Pro XL) అడ్వాన్స్‌డ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఒకటి. గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL కొనుగోలుపై లిమిటెడ్ టైమ్ డీల్ అందిస్తోంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?
పిక్సెల్ 9 ప్రో XLపై భారీ ధర తగ్గింపు :
భారత మార్కెట్లో పిక్సెల్ 9 ప్రో XL (256GB స్టోరేజ్, 16GB ర్యామ్ హాజెల్ కలర్ వేరియంట్) అసలు ధర ధర రూ.1,24,999 ఉండగా, రిలయన్స్ డిజిటల్‌లో రూ.97,999కి అమ్ముడవుతోంది. ఎక్స్ఛేంజ్ లేదా ప్రోమో కోడ్ రూ.27వేల తగ్గింపు అందిస్తోంది.
ఈఎంఐ కొనుగోళ్లకు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలుదారులు అదనంగా 7.5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (రూ.5వేల వరకు) పొందవచ్చు. తద్వారా ధర రూ.92,999కి తగ్గుతుంది. మొత్తం రూ.32వేలు సేవ్ చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరింత తగ్గే అవకాశం ఉంది.
పిక్సెల్ 9 ప్రో XL స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3వేల నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.7-అంగుళాల LTPO ఓఎల్ఈడీ HDR డిస్‌ప్లేను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో ప్రొటెక్షన్ అందిస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5060mAh బ్యాటరీతో పిక్సెల్ 9 ప్రో XL మోడల్ కస్టమ్ టెన్సర్ G4 చిప్‌పై రన్ అవుతుంది.
గూగుల్ పిక్సెల్ పర్ఫార్మెన్స్, యూజర్ రెండింటినీ ఏఐ-ఆధారిత ఫీచర్లను అందిస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ సూట్, 50MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. 42MP ఫ్రంట్ కెమెరా టాప్-టైర్ సెల్ఫీలు, వీడియో కాల్స్ అందిస్తుంది.