BSNL Flash Sale : BSNL కొత్త ఫ్లాష్ సేల్.. కేవలం రూ. 1కే 1GB హైస్పీడ్ డేటా.. 400GB డేటా పొందాలంటే..? లిమిటెడ్ ఆఫర్!
BSNL Flash Sale : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. ప్రత్యేకించి వినియోగదారుల కోసం కొత్త ఫ్లాష్ సేల్ ప్రారంభించింది.

BSNL Flash Sale
BSNL Flash Sale : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ BSNL అధికారికంగా కొత్త ఫ్లాష్ సేల్‌ను ప్రకటించింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లతో హై-స్పీడ్ 4G డేటాను అందిస్తుంది. అధికారిక సోషల్ మీడియా ద్వారా ఈ సేల్ వివరాలను షేర్ చేసింది.
90వేల 4G టవర్ల మైలురాయిని జరుపుకుంది. అయితే, ప్రణాళికలో భాగంగా బీఎస్ఎన్ఎల్ 2025 మధ్య నాటికి లక్ష 4G టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఎస్ఎన్ఎల్ ఫ్లాష్ సేల్ కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
BSNL ఫ్లాష్ సేల్ వివరాలు :
బీఎస్ఎన్ఎల్ పోస్ట్ ప్రకారం.. ఈ సేల్ జూన్ 28న లైవ్ అయింది. జూలై 1 వరకు సేల్ కొనసాగుతుంది. ఈ లిమిటెడ్ ఆఫర్ సమయంలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు కేవలం రూ. 400కే 400GB డేటాను పొందవచ్చు. 1GBకి రూ. 1 చొప్పున పొందవచ్చు. ఆసక్తిగల కస్టమర్లు BSNL వెబ్‌సైట్, BSNL సెల్ఫ్-కేర్ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.
సబ్‌స్క్రైబర్‌లతో సవాళ్లు :
ఇటీవలి డేటా ప్రకారం.. BSNL గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది. గత మేలో 1.35 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. ఈ ఫ్లాష్ సేల్ కంపెనీకి టర్నింగ్ పాయింట్. బహుశా కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించే అవకాశం ఉంది. వినియోగదారులకు కనెక్టివిటీని పెంచుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ఒక లక్ష అదనపు మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
BSNL 5G ప్రారంభం :
టెలికం వినియోగదారుల అనుభవాన్ని మరింత పెంచేందుకు BSNL కొత్త టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ. 13వేల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతోంది. అదనంగా, కంపెనీ ఇటీవల హైదరాబాద్‌లో 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సర్వీసును ప్రారంభించింది. బెంగళూరుతో సహా దక్షిణ భారత్‌లోని అనేక నగరాల్లో కొత్త సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తోంది.
లక్ష కొత్త టవర్ల నిర్మాణం :
BSNL నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరిచేందుకు అదనంగా లక్ష కొత్త 4G, 5G మొబైల్ టవర్లను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇంకా కేంద్ర మంత్రివర్గం ఆమోదం రావాల్సి ఉంది. గత ఏడాదిలో కంపెనీ ఇదే సంఖ్యలో టవర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఇప్పటివరకు అందులో 70వేల కన్నా ఎక్కువగా ఏర్పాటు చేయగా, ఈ ఇన్‌స్టాలేషన్‌లు మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది.