Google Chrome Users At High Risk, Should Update Browser Immediately
Google Chrome : గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక.. మీరు హైరిస్క్‌లో ఉన్నారు. ఏ క్షణమైన హ్యాకర్లు మీ డేటాను హ్యాక్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే గూగుల్ క్రోమ్ తమ యూజర్లను అలర్ట్ చేస్తోంది. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే ఈ వార్నింగ్ మెసేజ్ డిస్ ప్లే చేస్తోంది. ప్రస్తుత గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్‌లో అనేక భద్రతా లోపాలు ఉన్నాయని తేలింది. ఇటీవలే Google ఈ బగ్స్ అన్నింటిని గుర్తించింది. బ్రౌజర్‌లోని మల్టీ హై-ఎఫెక్టివ్ బగ్స్ ఫిక్స్ చేసేందుకు కీలకమైన అప్ డేట్స్ రిలీజ్ చేస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. టెక్ దిగ్గజం Chrome తమ యూజర్లకు బ్రౌజర్ వెర్షన్ 102.0.5005.115కి అప్‌డేట్ చేయమని కోరుతోంది.
గత వారం జూన్ 9న అధికారికంగా ఈ కొత్త అప్ డేట్ రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 2.6 బిలియన్లకు పైగా యూజర్లతో Chrome ప్రపంచంలోనే నంబర్ వన్ బ్రౌజర్. ఈ కొత్త Chrome అప్‌డేట్ Windows, Mac, Linux యూజర్లకు అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ కొత్త అప్‌డేట్ వినియోగదారులకు ఆటోమాటిక్‌గా రిలీజ్ అయి ఉంటుంది. ఒకవేళ లేదంటే.. మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. టెక్ దిగ్గజం రాబోయే వారాల్లో అప్‌డేట్ అందరికి అందుబాటులోకి తీసుకురానుంది. గూగుల్ అధికారిక ప్రకటనలో.. క్రోమ్ బ్రౌజర్‌లో ఏడు లోపాలను ఫిక్స్ చేసినట్టు తెలిపింది.
Google Chrome Users At High Risk, Should Update Browser Immediately
అందులో నాలుగు అత్యంత తీవ్రమైనవిగా గూగుల్ గుర్తించింది. 2022-2007 (WebGPUలో యూజ్-ఆఫ్టర్-ఫ్రీ (UAF) వల్యూనరబిలిటీ), CVE-2022-2008 (మెమరీ) WebGLలో యాక్సెస్ వల్యూనరబిలిటీ), CVE-2022-2010, (CVE-2022-2011 (ANGLEలో UAF దుర్బలత్వం) ఈ భద్రతా లోపాలు వినియోగదారులను ఎలా ప్రభావితం చేశాయో కంపెనీ వెల్లడించలేదు. US Cybersecurity & Infrastructure Agency (CISA) ప్రకారం.. కొత్త ప్యాచ్ రిలీజ్ అయిన తర్వాత, వినియోగదారులు తమ బ్రౌజర్‌ను వెంటనే అప్‌డేట్ చేయమని కోరుతోంది.
Read Also : Google Chrome : వెబ్‌సైట్ల నోటిఫికేషన్లతో విసిగిపోయారా? ఇకపై క్రోమ్ బ్లాక్ చేస్తుంది..!