Google Drive: గూగుల్ డ్రైవ్‌లో సరికొత్త ఫీచర్.. చిటికెలో మీ ఫైల్స్‌ గుర్తుపట్టొచ్చు!

గూగుల్ డ్రైవ్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఇకపై డ్రైవ్ లో మీ ఫైల్స్ కోసం ఇబ్బంది పడాల్సిన పనిలేదు. చిటికెలో మీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టే ఫీచర్ తీసుకొస్తోంది గూగుల్.

Google Drive Search Chips Feature : గూగుల్ డ్రైవ్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఇకపై డ్రైవ్ లో మీ ఫైల్స్ కోసం ఇబ్బంది పడాల్సిన పనిలేదు. చిటికెలో మీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టే ఫీచర్ తీసుకొస్తోంది గూగుల్. అదే.. Search Chips ఫీచర్.. దీని ద్వారా గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసిన డేటాను వేగంగా గుర్తుపట్టొచ్చు. గూగుల్ షేరింగ్, క్లౌడ్ సర్వీసుల కోసం గూగుల్ డ్రైవ్ ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. 15GB వరకు ఫ్రీగా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసిన ఫైల్స్‌ను వేగంగా సెర్చ్ చేసేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ఫీచర్స్ లేవు. గూగుల్ డ్రైవ్ యూజర్లు తమకు అవసరమైన ఫైల్స్ కనిపెట్టడంలో ఇబ్బంది పడుతున్నారు. గూగుల్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక సరికొత్త సెర్చ్ ఫీచర్ తీసుకొస్తోంది. Search Chips పేరుతో ఈ ఫీచర్‌ను రిలీజ్ చేయనున్నట్టు గూగుల్ ప్రకటించింది.

ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు సెర్చ్ నుంచి మాడిఫై చేసుకోవచ్చు. డ్రైవ్ ప్లాట్‌ఫామ్‌లో ఫైల్స్‌ ఎక్కడెక్కడ ఉన్నాయో సులభంగా గుర్తించే వీలుంది. గతంలో జీమెయిల్‌‌లో వచ్చిన ఫీచర్ సెర్చ్ ఫిల్టర్‌ మాదిరిగానే పనిచేయనుంది. ఈ ఫీచర్‌ ద్వారా ఫైల్స్ కోసం సెర్చ్ చేసేటప్పుడు యూజర్లు సజెస్టెడ్ ఫిల్టర్ ఎంపిక చేసుకోవచ్చు. అవసరమైన ఫైల్స్ మాత్రమే సెలక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సెర్చ్ చిప్స్‌ ఫీచర్ గూగుల్ డ్రైవ్ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా గూగుల్ డ్రైవ్ యూజర్లందరికీ ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గూగుల్ డ్రైవ్‌ లో ఈ సెర్చ్ ఫీచర్‌ను చేర్చినట్టు గూగుల్ ప్రకటించింది.

కొత్త అప్‌డేట్‌ ప్రకారం.. యూజర్లు query నమోదు చేసినప్పుడు.. టాప్ బటన్‌ వరుసలో రిజల్ట్స్ చూడొచ్చునని గూగుల్ పేర్కొంది. ఫైల్ టైప్, పీపుల్, లోకేషన్, లాస్ట్ మాడిఫైడ్ డేట్, ఫైల్ టైటిల్స్ తదితర ఫిల్టర్‌లతో యూజర్లు వేగంగా ఫైల్స్ షేర్ చేయొచ్చు. అన్ని ఫిల్టర్‌లను ఒకేసారి కలిపి వినియోగించుకోవచ్చు. క్షణాల వ్యవధిలోనే యూజర్లు తమకు కావాల్సిన ఫైల్ ఈజీగా కనుగొనవచ్చు. ప్రస్తుతానికి ఈ సెర్చ్ చిప్స్ ఫీచర్ బీటా వెర్షన్‌లో మాత్రమే ఉంది. ఈ ఫీచర్ వినియోగించుకోవాలంటే యూజర్లు గూగుల్ ఫారమ్‌లో బీటా ప్రోగ్రామ్‌లో సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ వర్క్ స్పేస్, జీ సూట్ బేసిక్, బిజినెస్ వినియోగదారుల అందిరికి అందుబాటులో ఉంటుంది.
Read Also : Bigg Boss 5: బిగ్ బాస్ నుంచి జెస్సి అవుట్.. షాక్ లో షన్ను, సిరి

ట్రెండింగ్ వార్తలు