Bigg Boss 5: బిగ్ బాస్ నుంచి జెస్సి అవుట్.. షాక్ లో షన్ను, సిరి

గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జెస్సీ హౌస్‌ నుంచి బయటకు వచ్చేశాడు. జెస్సి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స అందించినా నిన్నటి ఎపిసోడ్‌లో జెస్సి

Bigg Boss 5: బిగ్ బాస్ నుంచి జెస్సి అవుట్.. షాక్ లో షన్ను, సిరి

Jessi

Bigg Boss 5:  ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5 నుంచి 9 మంది ఎలిమినేట్ అయ్యారు. అయితే 10వ వారం ఎలిమినేషన్ కి ఇంకా టైం ఉండగానే మరో కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకి వెళ్ళిపోయాడు. దీంతో హౌస్ లోని సభ్యులు షాక్ కి గురయ్యారు. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జెస్సీ హౌస్‌ నుంచి బయటకు వచ్చేశాడు. జెస్సి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చికిత్స అందించినా నిన్నటి ఎపిసోడ్‌లో జెస్సి మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని సీక్రెట్‌ రూంలో ఉంచి చికిత్స అందించారు.

Liger : లైగర్ కోసం బాలయ్య, అమితాబ్.. పూరి పర్ఫెక్ట్ ప్లాన్

తాజాగా విడుదల అయిన బిగ్ బాస్ ప్రోమోలో జెస్సిని ఇంటి నుంచి పంపించినట్టు తెలుస్తుంది. చికిత్స అందించినా అతని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బిగ్‌బాస్‌ జెస్సీని హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపొమ్మని చెప్పాడు. ఇందుకు జెస్సి బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాడు. సీక్రెట్ రూమ్ లోంచి జెస్సి బయటకి వచ్చి కంటెస్టెంట్స్ తో బయటకి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. దీంతో జెస్సికి ఫ్రెండ్స్ అయిన షన్ను, సిరిలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సిరి వచ్చి జెస్సి ని హగ్ చేసుకొని ఏడ్చేసింది. జెస్సి షన్నుని హగ్ చేసుకొని ఏడుస్తూ మిస్ యు రా అని చెప్పాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా వచ్చి జెస్సిని ఓదార్చారు. కంటెస్టెంట్స్ అంతా జెస్సిని మెయిన్ గేట్ వరకు తీసుకెళ్లారు. జెస్సి వెళ్లిపోతుండగా సిరి పరిగెత్తుకుంటూ వెళ్లి నుదుటి పైన ముద్దు పెట్టి హగ్ చేసుకొని ఏడ్చేసింది.

Jai Bhim: చలించిపోయిన లారెన్స్.. రియల్ సినతల్లికి ఇల్లు కట్టిస్తానని హామీ!

గత బిగ్ బాస్ సీజన్స్ లో కూడా సంపూర్ణేష్ బాబు, గంగ‌వ్వ‌, నోయ‌ల్ ఇలా ఆరోగ్య సమస్యలతో గేమ్ మ‌ధ్య నుంచి బ‌య‌ట‌కు వచ్చేసారు. తాజాగా ఈ సీజన్ లో జెస్సీ కూడా బయటకి వచ్చేశాడు. అయితే ఇది ప్రేక్షకులు కూడా ఊహించకపోవడంతో ఈ ప్రోమో చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.