Google For India: భారత్‌లో గూగుల్ బిగ్ ఈవెంట్.. నేడే ప్రారంభం!

ప్రతి సంవత్సరం గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ ఈరోజే(18 నవంబర్) ప్రారంభం అవుతుంది.

Google For India: ప్రతి సంవత్సరం గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ ఈరోజే(18 నవంబర్) ప్రారంభం అవుతుంది. కంపెనీ ఈ ఈవెంట్‌లో భారతదేశానికి సంబంధించిన తన ప్లాన్‌లను షేర్ చేసుకుంటుంది. ఈ ఏడాది కూడా కంపెనీ తన కొత్త ప్లాన్‌లను ఈ ఈవెంట్‌లో పంచుకోబోతుంది.

ఈ అతిపెద్ద ఈవెంట్‌లో కంపెనీ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు జరగబోయే ఈవెంట్ గూగుల్ నిర్వహిస్తున్న ఏడవ గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్. కరోనాకు ముందు, ఇది ఫిజికల్‌గా ఉండేది, కానీ ఇప్పుడు వర్చువల్‌గా మాత్రమే నిర్వహిస్తున్నారు.

పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ చేయట్లేదు:
గూగుల్ భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పటివరకు లాంఛ్ చెయ్యలేదు.. కానీ ప్రతి ఏడాది కంపెనీ ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. Pixel-6 సిరీస్‌ను భారతదేశంలో స్టార్ట్ చెయ్యట్లేదు. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది.

ఉదయం 10 గంటలకు..
Google ఫర్ ఇండియా ఈవెంట్‌లోనే గూగుల్.. ఆన్‌లైన్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ Tezని భారతదేశంలో ప్రారంభించింది. తర్వాతికాలంలో అది Google Payకి మార్చబడింది. అదే సమయంలో, ఈసారి కంపెనీ భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని గూగుల్ తన ఉత్పత్తులలో కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

Child Pornography: చైల్డ్‌ పోర్నోగ్రఫీపై సీబీఐ ఫోకస్‌.. దేశవ్యాప్తంగా అరెస్ట్‌లు.. చూసినా నేరమే!

ఈ సంధర్భంగా కంపెనీ ప్రకటనలో.. “మేము.. మీరూ కలిసి ఇంత దూరం నడిచాము. ఈసారి మేము మరిన్ని ప్రాడక్ట్ అప్‌డేట్‌లను, టెక్నికల్ ఆవిష్కరణలను చేయబోతున్నాముజజ భారతదేశ డిజిటల్ ప్రయాణంలో కీలక అడుగులు వేస్తున్నాము” అని కంపెనీ తెలిపింది.

Ameerpet: అమీర్‌పేటలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌.. నమ్మన స్నేహితుడినే లక్షల్లో మోసం చేశాడు

ట్రెండింగ్ వార్తలు