క్లౌడ్ యూజర్లకు గుడ్ న్యూస్ : గూగుల్ ‘యాంథోస్’ వచ్చేసింది

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త ఓపెన్ ప్లాట్ ఫాంను ప్రవేశపెట్టింది. అదే.. యాంథోస్. ఈ ప్లాట్ ఫాంపై ఎక్కడి నుంచి అయిన యాప్స్ ను అపరేట్ చేయొచ్చు.

  • Published By: sreehari ,Published On : April 10, 2019 / 09:27 AM IST
క్లౌడ్ యూజర్లకు గుడ్ న్యూస్ : గూగుల్ ‘యాంథోస్’ వచ్చేసింది

Updated On : April 10, 2019 / 9:27 AM IST

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త ఓపెన్ ప్లాట్ ఫాంను ప్రవేశపెట్టింది. అదే.. యాంథోస్. ఈ ప్లాట్ ఫాంపై ఎక్కడి నుంచి అయిన యాప్స్ ను అపరేట్ చేయొచ్చు.

శాన్ ఫ్రాన్సిస్ కో : ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త ఓపెన్ ప్లాట్ ఫాంను ప్రవేశపెట్టింది. అదే.. యాంథోస్. ఈ ప్లాట్ ఫాంపై ఎక్కడి నుంచి అయిన యాప్స్ ను అపరేట్ చేయొచ్చు. క్లౌడ్ సర్వీసు ప్లాట్ ఫాం ఆధారంగా 2018లో Anthos ప్లాట్ ఫాంను గూగుల్ ప్రకటించింది. ఈ యాంథోస్.. పబ్లిక్ క్లౌడ్ లో హర్డ్ వేర్ ఇన్వెస్ట్ చేసిన అప్లికేషన్లను యూజర్లు రన్ చేసుకోవచ్చు.
Read Also : సెలవులు, టూర్లు, ఎన్నికలు: అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..

గూగుల్ క్లౌడ్ పై కస్టమర్లను అనుమతించడం మాత్రమే కాదు.. తమ సొంత డేటా సెంటర్లను కూడా నిర్మించుకోవచ్చు. ఇందుకు కావాల్సిన ఫ్లెక్సిబుల్టీని యాంథోస్ యూజర్లకు అందిస్తోంది. తద్వారా కస్టమర్లు తమ వర్క్ లోడ్స్ ను తమ గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ పైనే నిర్వహించుకునేందుకు వీలు ఉంటుంది. ఇతర క్లౌడ్ సర్వీసుదారులు (Multi-Cloud)లను మార్చుకోవాల్సిన పనిలేకుండా సొంత డేటా సెంటర్లపైనే అప్లికేషన్లు రన్ చేసుకోనే అవకాశం ఉందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తెలిపారు.

యాంథోస్ ఓపెన్ ప్లాట్ ఫాం ద్వారా.. యూజర్లు తమ వర్క్ లోడ్ సర్వీసులను థర్డ్ పార్టీ క్లౌడ్ సర్వీసులు అమెజాన్, ఎడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ పై కూడా రన్ చేయొచ్చు. యాంథోస్ ప్లాట్ ఫాంపై సర్వీసులో భాగస్వాములైన సిస్కో, డెల్, హెచ్ పీ, ఇంటెల్, లెనొవో, వీఎం వేర్ సంస్థలు కూడా సంయుక్తంగా సర్వీసులు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కురియన్ అభిప్రాయపడ్డారు.

గూగుల్.. యాంథోస్ మైగ్రేట్ అనే బీటా ప్లాట్ ఫాంను కూడా ప్రకటించింది. వర్ట్యూవల్ మిషన్స్ (VMware)తమ ప్లాట్ ఫాం నుంచే ఇతర ప్లాట్ ఫాంలైన క్లౌడ్ సర్వీసులకు నేరుగా మైగ్రేట్ కావొచ్చు. గూగుల్ క్యూబర్ నేట్స్ ఇంజిన్ (GKE) కంటైనర్ల సాయంతో సులభంగా మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. 
Read Also : ఎయిర్ పోర్టులో నేలమీదే నిద్రపోయిన ధోనీ దంపతులు