Google Pixel 10 : వావ్.. అద్భుతమైన డిస్కౌంట్.. ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్‌పై రూ. 10వేలు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!
Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ పిక్సెల్ 10 ఫోన్ ఏకంగా రూ. 10వేలు డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Google Pixel 10
- భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్
- విజయ్ సేల్స్‌లో రూ. 5,000 ఫ్లాట్ డిస్కౌంట్, రూ. 74,999కి లిస్టింగ్
- బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా చేయొచ్చు
Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కొనేసుకోవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 79,999 ప్రారంభ ధరతో పిక్సెల్ 10 లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రూ. 10వేల వరకు తగ్గింపుతో లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, మంచి కెమెరా పర్ఫార్మెన్స్, అనేక ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
గూగుల్ పిక్సెల్ 10 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్సైట్లో ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 5వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌తో రూ. 74,999 కే లభిస్తోంది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐలపై అదనంగా రూ. 5వేలు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు వన్ కార్డ్ క్రెడిట్ ఈఎంఐపై రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10లో 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ సపోర్టు ఇస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది.
పర్ఫార్మెన్స్ పరంగా పిక్సెల్ 10 టెన్సర్ G5 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ 4,970mAh బ్యాటరీ కూడా ఉంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 10లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ వైపు, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5MP కెమెరా ఉంది.
గూగుల్ పిక్సెల్ 10 కొనాలా? వద్దా? :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ గూగుల్ లాంచ్ చేసిన ఫోన్లలో ఒకటి. టెన్సర్ G5 చిప్సెట్ రోజువారీ పనులను అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఛార్జింగ్ నెమ్మదిగా ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ అంత ఆకట్టుకునేలా ఉండదు. LTPO డిస్ప్లే లేదు. సాఫ్ట్వేర్ ఫీచర్లు, మంచి కెమెరాలు, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
