Google Pixel 10 Series : కొత్త గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ వచ్చేస్తోంది.. మొత్తం 4 ఫోన్లు.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే..?

Google Pixel 10 Series : గూగుల్ నుంచి పిక్సెల్ 10 సిరీస్ ఆగస్టులో లాంచ్ కానుంది. 4 మోడల్స్ రిలీజ్ డేట్, ధర, డిజైన్, కెమెరా ఫీచర్ల వివరాలివే..

Google Pixel 10 Series

Google Pixel 10 Series : పిక్సెల్ కస్టమర్ల కోసం అతి త్వరలో పిక్సెల్ 10 సిరీస్ రాబోతుంది. గూగుల్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఆగస్టు 20, 2025న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్నాయ. ఈ మేరకు గూగుల్ అధికారికంగా ధృవీకరించింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మొత్తం 4 పిక్సెల్ మోడళ్లు వస్తున్నాయి.

అందులో పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ఉండనున్నాయి. డిజైన్, పర్ఫార్మెన్స్, కెమెరా టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లతో రానున్నాయి. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ఫోన్ వంటి ఫీచర్లు, ధర వివరాలపై అంచనాలు ఇలా ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి..

గూగుల్ పిక్సెల్ 10 డిజైన్, స్పెసిఫికేషన్లు (అంచనా) :
గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో గత జనరేషన్ మాదిరిగానే డిజైన్‌ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ల ఫీచర్లలో సూక్ష్మమైన మార్పులు ఉన్నాయి. ఈ రెండు మోడళ్లు ఇప్పుడు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తాయి. పిక్సెల్ 10 ప్రో XL కూడా అదే ఫీచర్లతో రావచ్చు. పిక్సెల్ ఫోల్డ్ మోడల్ 6.4-అంగుళాల లోపలి డిస్‌ప్లే, 155.2 x 150.4 x 5.2 మిమీ వరకు ఉండొచ్చు. ఈ 4 పిక్సెల్ మోడల్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌లతో OLED ప్యానెల్‌ కలిగి ఉండే అవకాశం ఉంది.

Read Also : Apple iPhone 17 Pro : ఆపిల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అతి త్వరలో ఐఫోన్ 17 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ఫుల్ ఫీచర్లు, ధరపై భారీ అంచనాలివే..!

బేస్ పిక్సెల్ 10 మోడల్ 6.3-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ప్రో, ప్రో XL మోడల్స్ సైజు, బ్యాటరీలో తేడాలతో పాటు ఒకేలాంటి స్పెషిఫికేషన్లు కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

మొత్తం సిరీస్‌ రాబోయే టెన్సర్ G5 చిప్, ఆండ్రాయిడ్ 16తో బాక్స్ వెలుపల ఉంటాయి. బ్యాటరీ పరంగా పరిశీలిస్తే.. పిక్సెల్ 10 ఫోన్ 4970mAh, 10 ప్రో మోడల్ 4870mAh, 10 ప్రో ఫోల్డ్ 5015mAh, 10 ప్రో XL ఫోన్ భారీ 5200mAh సెల్‌ కలిగి ఉండే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ కెమెరా ఫీచర్లు (అంచనా) :
ఈ పిక్సెల్ 10 సిరీస్‌లో 50MP GN8 మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్, 10MP టెలిఫోటో ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ 42MP లెన్స్ ఉండవచ్చు. పిక్సెల్ ప్రో, ప్రో XL 50MP మెయిన్, 48MP అల్ట్రా-వైడ్, 48MP టెలిఫోటో లెన్స్‌ ఉండొచ్చు. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో 48MP మెయిన్ కెమెరా, అదనపు అల్ట్రా-వైడ్, టెలిఫోటో షూటర్‌లు, అలాగే డ్యూయల్ 10MP ఫ్రంట్-ఫేసింగ్ సెన్సార్‌లు ఉండొచ్చు.

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ధర (అంచనా) :
గూగుల్ పిక్సెల్ 10 ధర రూ.79,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ధర రూ.90,600 వరకు ఉండవచ్చు. పిక్సెల్ 10 ప్రో XL ధర రూ.1,17,700 వరకు ఉంటుందని అంచనా. ఫోల్డబుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధర రూ.1,79,999 వరకు ఉండవచ్చు.