Apple iPhone 17 Pro : ఆపిల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అతి త్వరలో ఐఫోన్ 17 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ఫుల్ ఫీచర్లు, ధరపై భారీ అంచనాలివే..!

Apple iPhone 17 Pro : వచ్చే సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 ప్రో లాంచ్ కాబోతుంది. భారత మార్కెట్లో ఈ ఐఫోన్ ధర, లాంచ్ డేట్, ఫుల్ ఫీచర్ల వివరాలివే..

Apple iPhone 17 Pro : ఆపిల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అతి త్వరలో ఐఫోన్ 17 ప్రో వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ఫుల్ ఫీచర్లు, ధరపై భారీ అంచనాలివే..!

Apple iPhone 17 Pro

Updated On : July 26, 2025 / 1:03 PM IST

Apple iPhone 17 Pro : ఆపిల్ అభిమానుల కోసం ఐఫోన్ 17 ప్రో వచ్చేస్తోంది. 2025లో రాబోయే ఐఫోన్‌లలో ఐఫోన్ 17 ప్రో ఒకటి. వచ్చే సెప్టెంబర్‌లో ఆపిల్ లాంచ్  (Apple iPhone 17 Pro) ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 17 సిరీస్ ప్రవేశపెట్టనుంది. ఈ ప్రీమియం మోడల్ ఐఫోన్ 17 లైనప్‌లో చేరనుంది.

ఇందులో రెగ్యులర్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ఎయిర్ అనే సరికొత్త మోడళ్లు ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధరకు సంబంధించి అంచనాల వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

ఐఫోన్ 17 ప్రో డిజైన్, కలర్ ఆప్షన్లు (అంచనా) :
డిజైన్ పరంగా పరిశీలిస్తే.. ఐఫోన్ 17 ప్రో త్రిభుజాకార లెన్స్, బ్యాక్ సైడ్ బోల్డ్ కొత్త కెమెరా లేఅవుట్‌ను సూచిస్తున్నాయి. బహుశా ఆపిల్ కొత్త రీడిజైన్ కావచ్చు. మాగ్‌సేఫ్ సిస్టమ్‌లో మార్పులకు అనుగుణంగా ఐకానిక్ ఆపిల్ లోగో కూడా దిగువకు మారవచ్చు. కలర్ ఆప్షన్ల విషయానికొస్తే.. సిల్వర్, బ్లాక్, యాష్, బ్రైట్ బ్లూ వంటి సాధారణ క్లాసీ షేడ్స్‌ ఉండొచ్చు. అద్భుతమైన కాపర్-ఆరెంజ్ ఎండ్ కూడా ఉండొచ్చు.

Read Also : Sundar Pichai : ప్రపంచ బిలియనీర్ క్లబ్‌లోకి సుందర్ పిచాయ్.. గూగుల్ సీఈఓ నికర విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు..!

ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో నెక్స్ట్ జనరేషన్ A19 బయోనిక్ చిప్‌తో వస్తుందని భావిస్తున్నారు. అత్యాధునిక 2nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది. ఐఫోన్ ప్రో మోడల్స్ 12GB ర్యామ్, కొత్త స్టీమ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయని పుకార్లు సూచిస్తున్నాయి. గేమర్స్, మల్టీ టాస్కర్లకు ప్రత్యేకంగా ఉంటుంది. 5,000mAh కన్నా బిగ్ బ్యాటరీతో రావచ్చు.

ఐఫోన్ 17 ప్రో కెమెరా అప్‌గ్రేడ్‌లు (అంచనా) :
ఆపిల్ ఫొటోగ్రఫీ ఆధారిత ఫీచర్లపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఐఫోన్ 17 ప్రో మెయిన్, అల్ట్రావైడ్, టెలిఫోటో లెన్స్‌ను ట్రిపుల్ 48MP సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఐఫోన్‌లో 8K వీడియో రికార్డింగ్‌, ఫ్రంట్ కెమెరా కూడా 24MP బంప్‌తో వస్తుందని భావిస్తున్నారు.

ఐఫోన్ 17 ప్రో ఇండియా ధర, లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
ఆపిల్ సాధారణ షెడ్యూల్ ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 11 మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్లో దాదాపు ఐఫోన్ 17ప్రో ధర రూ.1,39,000 ఉండొచ్చు.