×
Ad

Google Pixel 10 Pro XL : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో XLపై కిర్రాక్ డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Google Pixel 10 Pro XL : అమెజాన్ అద్భుతమైన ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఖరీదైన ఫోన్ ఎంత తక్కువకు వస్తుందంటే?

Google Pixel 10 Pro XL

  • భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ రూ.1,24,999కు లాంచ్
  • అమెజాన్‌లో రూ.1,14,990కే, రూ.10,009 ఫ్లాట్ డిస్కౌంట్
  • బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత సేవింగ్
  • మొత్తంగా రూ. 13,500 కన్నా భారీ తగ్గింపు ఆఫర్

Google Pixel 10 Pro XL : పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మీరు గూగుల్ లేటెస్ట్ హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో రూ. 1,24,999కు లాంచ్ అయిన పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ప్రస్తుతం రూ. 13,500 కన్నా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ ఆకట్టుకునే కెమెరా సామర్థ్యాలు, ఏఐ ఆధారిత ఫీచర్లతో పిక్సెల్ 10 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది. అంతేకాదు.. లేటెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. మీరు పిక్సెల్ అభిమాని అయితే ఈ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?

గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL డీల్ :

భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL రూ.1,24,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.1,14,990కు లిస్ట్ అయింది. రూ.10,009 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే, మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ట్రేడ్ చేయవచ్చు.

Read Also : Jio OTT Prepaid Plans : జియో మల్టీ OTT ప్రీపెయిడ్ ప్లాన్లు.. సింగిల్ రీఛార్జ్‌తో 10కిపైగా ఓటీటీ యాప్స్ ఫ్రీ.. డేటా, కాలింగ్ బెనిఫిట్స్ కూడా!

గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL 120Hz రిఫ్రెష్ రేట్, 3,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.8-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌ ఉంది. అలాగే, డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, పిక్సెల్ 10 ప్రో XL టెన్సర్ G5 చిప్‌పై రన్ అవుతుంది. 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

కెమెరాల విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో 50MP వైడ్ లెన్స్, మాక్రో ఫోకస్‌తో 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 48MP 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP కెమెరా కూడా ఉంది.