Google Pixel 7 Pro Discount : గూగుల్ పిక్సెల్ 7ప్రో ఫోన్‌పై రూ. 17వేలు డిస్కౌంట్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?
Google Pixel 7 Pro Discount : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 7 ప్రోపై భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. మీరు ఈ ఫోన్ ఎందుకు తీసుకోవాలో 4 కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Google Pixel 7 Pro gets a massive discount of Rs 17,000 on Flipkart
Google Pixel 7 Pro Discount : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో (Google Pixel 7)పై అద్భుతమైన డీల్ అందిస్తోంది. ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను రూ. 50వేల లోపు కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా, గూగుల్ పిక్సెల్ 7 ప్రోపై భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై రూ. 70వేల లోపు ధరకు ఆఫర్ చేస్తోంది. పిక్సెల్ 7 ప్రో కొనుగోలుపై అనేక డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఎందుకు కొనాలి? అంటే 4 కారణాలను తప్పక తెలుసుకోండి.
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 7 ప్రో ధర ఎంతంటే? :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 7 ప్రో 12GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.67,999కి విక్రయిస్తోంది. పిక్సెల్ 7 ప్రోపై అసలు లాంచ్ ధర నుంచి రూ. 17వేలు భారీగా తగ్గించింది. నిర్దిష్ట బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి EMI లావాదేవీలను కూడా అందించనుంది. క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలను ఎంచుకోవడం వల్ల రూ. 2వేలు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
మీరు ఎక్స్చేంజ్ కోసం పాత ఫోన్‌ను కలిగి ఉంటే.. ఫ్లిప్‌కార్ట్ రూ. 48,749 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తుంది. మీరు మంచి ఎడిషన్‌లో ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటే.. ఎక్స్జేంజ్ అర్హత పొందడం ద్వారా గూగుల్ పిక్సెల్ 7 ప్రోపై మరింత తగ్గింపు ధరను పొందవచ్చు.

Google Pixel 7 Pro gets a massive discount of Rs 17,000 on Flipkart
పిక్సెల్ 7 ప్రో కొనుగోలుకు 4 కారణాలివే :
క్లాస్-లీడింగ్ కెమెరా : కెమెరా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లు ఈ ఖ్యాతిని నిలకడగా నిలబెట్టాయి. పిక్సెల్ 7 ప్రో సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుత పిక్సెల్ 7 ప్రో ఫోన్ వెనుక ట్రిపుల్-కెమెరాను కలిగి ఉంది. ఇందులో 50MP f/1.9 ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP OIS రెడీ టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది.
ఫ్రంట్ ఫేసింగ్ హోల్-పంచ్ 10.8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 7 ప్రో ఆస్ట్రోఫోటోగ్రఫీ, సినిమాటిక్ బ్లర్ మోడ్‌లతో సహా అందుబాటులో ఉన్న అనేక ఫీచర్ల ద్వారా కెమెరాను మరింత విస్తరించింది. మ్యాజిక్ ఎరేజర్, ఫొటో అన్‌బ్లర్ వంటి గ్రేట్ ఎడిటింగ్ ఫంక్షనాలిటీలతో పాటు ఫొటోల యాప్‌లో అందుబాటులో ఉంటుంది.