Telugu » Technology » Google Pixel 9 Pro Xl Price Cuts Down By Rs 39000 On Flipkart Now Available Sh
Google Pixel 9 Pro XL : కొత్త ఫోన్ కొంటున్నారా? గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Google Pixel 9 Pro XL : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ తగ్గింపు ధరకే లభిస్తోంది. మంచి ఆఫర్ కోసం చూస్తుంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ఈ డీల్ మీకోసమే..
Google Pixel 9 Pro XL : కొత్త పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన గూగుల్ 9 ప్రో ఎక్స్ఎల్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. పవర్‌ఫుల్ ఇన్-హౌస్ ప్రాసెసర్ నుంచి మంచి కెమెరా సిస్టమ్ వరకు ఈ ఫోన్ అన్ని ఫీచర్లను అందిస్తుంది.
2/5
మీరు కూడా ఈ పిక్సెల్ 9ప్రో XL ఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే సరైన సమయం. ప్రస్తుతానికి, ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/5
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ డీల్ : 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్ 16GB ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ.1,24,999కి బదులుగా ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.89,999కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, అన్ని ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ, ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ.4వేలు ఫోన్ తగ్గింపు పొందవచ్చు. పోర్ సిలియన్ అనే కలర్ వేరియంట్ కలిగి ఉంది.
4/5
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 6.8-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ మాలి-G715 MC7 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. గూగుల్ అందించే 7 మెయిన్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
5/5
గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ షూటర్, 5x జూమ్‌తో 48MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 123 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP స్నాపర్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 37W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5060mAh బ్యాటరీని అందిస్తుంది.