Google Pixel 9a launched
Google Pixel 9a Launch : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి సెర్చ్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ నుంచి సరికొత్త పిక్సెల్ 9a ఫోన్ వచ్చేసింది. పిక్సెల్ 9 సిరీస్‌లో అత్యంత సరసమైన మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది.
అయితే, కొన్ని మార్పులు ఉన్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. పిక్సెల్ 9a ప్రీమియం విభాగంలో అద్భుతమైన ఆప్షన్. గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ రోజువారీ పనులు, మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
భారత్‌లో పిక్సెల్ 9a ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ ధర రూ.49,999కు ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ కచ్చితమైన తేదీని గూగుల్ ఇంకా వెల్లడించలేదు. కానీ, ఏప్రిల్ 2025 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని ధృవీకరించింది.
పిక్సెల్ 9a ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9a, గూగుల్ పిక్సెల్ 8a కన్నా అద్భుతమైన అప్‌గ్రేడ్స్‌తో వస్తుంది. ఈ పిక్సెల్ 9a ఫోన్ ఇతర పిక్సెల్ ఫోన్లలో ఉండే ట్రేడషనల్ కెమెరా బంప్‌ను తొలగించింది. ఫ్లష్ రియర్ కెమెరా మాడ్యూల్‌కు రిఫ్రెష్ చేసిన డిజైన్‌ను అమర్చింది. కెమెరా సెటప్ కింద 48MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 13MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుంది.
ప్రైమరీ సెన్సార్‌తో క్లోజప్ షాట్‌ల కోసం గూగుల్ మాక్రో మోడ్‌ను కూడా అమర్చారు. గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. పిక్సెల్ 9a ఫోన్ భారీ 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. సున్నితమైన 120Hz రిఫ్రెష్ రేట్, 2,700 నిట్‌ల ఆకట్టుకునేలా గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.
పిక్సెల్ 8a చిన్న 6.1-అంగుళాల ప్యానెల్, 2,000-నిట్ ప్రకాశం కన్నా ఇది ఎక్కువగా ఉంటుంది. గూగుల్ ఇన్-హౌస్ టెన్సర్ G4 చిప్‌సెట్‌తో రన్ అయ్యే పిక్సెల్ 9a ఫోన్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.
పిక్సెల్ 9a మోడల్ 5,100mAh బ్యాటరీతో వస్తుంది. పిక్సెల్ 8aలో ఉన్న 4,402mAh బ్యాటరీ కన్నా చాలా పెద్దది. పిక్సెల్ 9a ఫోన్ Qi వైర్‌లెస్ ఛార్జింగ్, 23W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్టు ఇస్తుంది. వాటర్, డస్ట్ నిరోధకతకు IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.
సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. పిక్సెల్ 9a ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో వస్తుంది. జెమిని ఏఐ, గూగుల్ అసిస్టెంట్ వంటి గూగుల్ ఏఐ ఆధారిత టూల్స్‌తో వస్తుంది. 7 ఏళ్ల OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తోంది.
గూగుల్ లాంగ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్టుతో పాటు ఫోన్ ఎక్కువకాలం మన్నికను కూడా అందిస్తుంది.