Google Pixel 9a Price
Google Pixel 9a Price : కొత్త పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? అతి త్వరలో గూగుల్ పిక్సెల్ 10a రాబోతోంది. కానీ, గూగుల్ పిక్సెల్ 9a ఇప్పటికీ భారీ తగ్గింపుతో మార్కెట్లో అందుబాటులో ఉంది. టెన్సర్ ప్రాసెసర్ నుంచి డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, జెమిని ఏఐ యాక్సెస్ వరకు అన్ని ఫీచర్లు ఉన్నాయి.
ఇప్పుడు, ఈ పిక్సెల్ 9a ఫోన్ ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ. 35వేల లోపు తగ్గింపు ధరకు కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో పిక్సెల్ ఫ్యాన్స్ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పిక్సెల్ 9ఎ ధర ఎంతంటే? :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 8GB ర్యామ్ వేరియంట్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ మోడల్ రూ.32,999కే లభిస్తోంది. అసలు ధర రూ.49,999 ఉండగా రూ.17వేలు తగ్గింపుతో అందుబాటులో ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని బ్యాంక్ ఆఫర్లతో డిస్కౌంట్ పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఐరిస్, పొర్సిలియన్, అబ్సిడియన్ అనే 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 9ఎ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9ఎ ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ప్యానెల్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కూడా ఉంది. పిక్సెల్ 9ఎ ఫోన్ గూగుల్ టెన్సర్ జీ4 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.
ఈ పిక్సెల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OSకి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5100mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 48MP ప్రైమరీ షూటర్, 13MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
ఈ ఫోన్ కొనాలా? వద్దా? :
మీరు లేటెస్ట్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ పిక్సెల్ 9a మోడల్ కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్వరలో పిక్సెల్ 10a లాంచ్ కానుంది. పాత మోడల్ అయినా సరే ఆఫర్ ఉంది కదా కొనేస్తామంటే కొనేసుకోవచ్చు. ప్రస్తుతం పిక్సెల్ 9a భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ ఆఫర్ రిపబ్లిక్ డే సేల్ జరిగే వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.