Income Tax Rules 2026 : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. రూ. 15 లక్షల జీతం వచ్చినా మీరు పైసా టాక్స్ కట్టనక్కర్లేదు.. ఈ ట్రిక్‌తో జీరో టాక్స్!
Income Tax Rules 2026 : వచ్చే నెల ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం కలిగించవచ్చు. అయితే, ప్రస్తుతానికి, మీరు దాదాపు రూ. 15 లక్షల జీతంపై జీరో టాక్స్ గా మార్చుకోవచ్చు.. ఎలాగంటే?
Income Tax Rules 2026
- ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ 2026 ప్రకటన
- ఆదాయ పరిమితి మించితే రూ. 75వేలు స్టాండర్డ్ డిడక్షన్
- మీ ఆదాయం రూ. 12,75 లక్షలు మించితే పన్ను చెల్లించాలి
- రూ. 15 లక్షల (రూ. 14.66 లక్షలు) వరకు జీరో టాక్స్ ఎలా?
Income Tax Rules 2026 : టాక్స్ పేయర్లకు బిగ్ న్యూస్.. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ 2026ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పన్నుచెల్లింపుదారులకు ఈసారి బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో ఉపశమనాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ కూడా త్వరలో కొత్త ఐటీఆర్ ఫారమ్‌లను జారీ చేయనుంది. కొత్త పన్ను విధానంలో మీ వార్షిక జీతం రూ. 12 లక్షల వరకు ఉంటే.. మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే, మీ ఆదాయం ఈ పరిమితిని మించి ఉంటే.. ఆదాయపు పన్ను శాఖ రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ అనే ప్రత్యేక మినహాయింపును అందిస్తుంది. ఈ మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 115BAC(1A)(iii) కింద అందుబాటులో ఉంది.
అయితే, మీ ఆదాయం రూ. 12. 75 లక్షలు మించి ఉంటే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొత్త పన్ను విధానంలో కూడా మీ ఆదాయంపై జీరో టాక్స్ పొందడానికి మరో మార్గం ఉంది. నివేదికల ప్రకారం.. మీ కంపెనీ మిమ్మల్ని ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (EPF), జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)కి కాంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు అనుమతిస్తే మీరు మీ జీతంలో రూ.14.66 లక్షల వరకు జీరో టాక్స్ గా మార్చుకోవచ్చు.
జీరో టాక్స్ ఎలా సాధ్యం? :
మీ ఆదాయాన్ని సుమారు రూ. 15 లక్షల (రూ. 14.66 లక్షలు) వరకు జీరో టాక్స్ గా మార్చుకోవచ్చు. మీ కంపెనీకి సంబంధించి EPFO, NPS రెండింటిలోనూ మీరు మెంబర్ అయి ఉండాలి ఆయా అకౌంట్లలో డబ్బు డిపాజిట్ అవుతుండాలి. మీ కంపెనీ ఈపీఎఫ్ కింద పన్ను మినహాయింపులను అందిస్తే కొత్త పన్ను విధానం ప్రకారం.. మీరు ఇప్పటికీ రూ. 13.56 లక్షల జీతాన్ని జీరో టాక్స్‌గా మార్చుకోవచ్చు.
పన్ను ఆదా ఎలా పొందాలి? :
ఆర్థిక నిపుణుల ప్రకారం.. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి ఉద్యోగిగా ఈపీఎఫ్‌లో డిపాజిట్ అయిన డబ్బుకు సెక్షన్ 80C మినహాయింపు లభించదు. ఎందుకంటే ఇది పాత పన్ను విధానానికి విరుద్ధం. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్, సెక్షన్ 80C డిడక్షన్‌కు ఇక్కడ అర్హులు. ఇందులో కంపెనీ, ప్రాథమిక జీతం, డీఏలో 12శాతం వరకు కాంట్రిబ్యూషన్ పాత, కొత్త పన్ను విధానాల కింద పన్ను రహితంగా ఉంటుంది.
అయితే, మొత్తం రూ. 7.5 లక్షల పరిమితిలో ఉండాలి. అప్పుడే పాత, కొత్త పన్ను విధానాలకు వర్తిస్తుంది. NPS విషయానికి వస్తే.. ఉద్యోగి సొంత కాంట్రిబ్యూషన్ కొత్త పన్ను విధానం ప్రకారం పన్ను మినహాయింపు పొందదు. అయితే, యజమాని కాంట్రిబ్యూషన్ మాత్రం బేసిక్ పే, డీఏ కలిపి 14శాతం వరకు మినహాయింపు ఉండవచ్చు. పాత కొత్త పన్ను విధానాల కింద జీరో టాక్స్ లభిస్తుంది.
మీ రూ. 15 లక్షల జీతాన్ని జీరో టాక్స్ గా ఎలా చేయొచ్చు? :
- మీ మొత్తం జీతం రూ. 14.66 లక్షలు అనుకుందాం..
- మీ బేసిక్ పే రూ. 7.33 లక్షలు (రూ. 14.66 లక్షలలో 50శాతం).
- కంపెనీ మీ బేసిక్ పేలో 12శాతం లేదా దాదాపు రూ. 87,960ను EPFకు డిపాజిట్ చేస్తుంది. ఇది పూర్తిగా జీరో టాక్స్
- మీ కంపెనీ 14శాతం లేదా దాదాపు రూ. 102,620ను NPSకి డిపాజిట్ చేస్తుంది. ఇది కూడా జీరీ టాక్స్
- దాంతో పాటు కొత్త పన్ను విధానంలో రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉంది.
ఎలాగో ఇప్పుడు లెక్కలు చూద్దాం :
- మొత్తం జీతం : రూ. 14,66,000
- కంపెనీ EPF కాంట్రిబ్యూషన్ (పన్ను రహితం) : రూ. 87,960
- కంపెనీ NPS కాంట్రిబ్యూషన్ (పన్ను రహితం): రూ. 1,02,620
- స్టాండర్డ్ డిడక్షన్ : రూ. 75,000
- మొత్తం సేవింగ్స్ : రూ. 2,65,580
మీ పన్ను విధించే ఆదాయం ఈ విధంగా తగ్గుతుంది. ఈ మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే.. అప్పుడు మీ పన్నుపై చెల్లించాల్సిన మొత్తం ఆదాయం భారీగా తగ్గుతుంది. అప్పుడు మీ జీతం రూ. 14.66 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
రిటైర్మెంట్ కోసం భారీగా టాక్స్ సేవింగ్ :
ఈపీఎఫ్, ఎన్‌పీఎస్ కేవలం పన్ను ఆదా కోసం మాత్రమే కాదు.. దీర్ఘకాలంలో మీ రిటైర్మెంట్ కోసం భారీ మొత్తంలో డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. 25 ఏళ్ల వ్యక్తి NPSలో ప్రతి నెలా రూ. 10వేలు డిపాజిట్ చేస్తుండాలి.
ఇలా ఈ మొత్తాన్ని ప్రతి ఏడాది 5శాతంగా పెంచుతూ పోతే 60 ఏళ్ల వయస్సు వరకు డబ్బు డిపాజిట్ కొనసాగిస్తే వార్షికంగా 12శాతం రాబడితో ఏకంగా రూ. 8.62 కోట్లు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా, 25 ఏళ్ల వ్యక్తి EPFలో ప్రతి నెలా రూ. 10వేలు డిపాజిట్ చేస్తే ఈ మొత్తాన్ని ప్రతి ఏడాది 5శాతంగా పెంచి, 8.25శాతం వడ్డీని పొందితే సుమారుగా రూ.4.05 కోట్లు కూడబెట్టవచ్చు.
