Google Workers Remote-Hybrid : గూగుల్ ఉద్యోగుల్లో 20శాతం వర్క్ ఫ్రమ్ హోం.. 60శాతం మందికి హైబ్రిడ్ వర్క్

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి ఆఫీసులను నెమ్మదిగా తెరవనుంది. అప్పటినుంచి తమ ఉద్యోగుల్లో రెండు రకాల పనివిధానాలు అమలు చేయాలని భావిస్తోంది.

Google Workers Remote-Hybrid : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి ఆఫీసులను నెమ్మదిగా తెరవనుంది. అప్పటినుంచి తమ ఉద్యోగుల్లో రెండు రకాల పనివిధానాలు అమలు చేయాలని భావిస్తోంది. గూగుల్ ఉద్యోగుల్లో ఇప్పటికే 20 శాతం మందికి రిమోట్ (వర్క్ ఫ్రమ్ హోం) పని చేస్తున్నారు. మరో 60శాతం మందిని హైబ్రిడ్ షెడ్యూల్ ప్రకారం పనిచేసేలా వీలు కల్పించనుంది.

హైబ్రిడ్ విధానంలో వారంలో ఐదు రోజులు పని ఉంటే.. అందులో ఆఫీసుల్లో మూడు రోజులు పనిచేస్తే.. మిగిలిన రెండు రోజులు ఉద్యోగులకు ఇష్టమైన లొకేషన్ నుంచి పనిచేసుకోవచ్చు. మిగిలిన 20శాతం మంది ఉద్యోగులు తమ పనిచేసే చోటును గూగుల్ ఆఫీసు నుంచి మరో చోటుకు మార్చుకోవచ్చు. గూగుల్ లో పనిచేసే 135,000 మంది ఉద్యోగులలో చాలామంది ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ఇంటి నుంచి పని చేసుకోవచ్చు.

ఏడాదికి 20 రోజుల వరకు, గూగుల్ ఉద్యోగులు తమ ప్రధాన కార్యాలయం కాకుండా వేరే ప్రదేశం నుంచి పని చేయొచ్చు. మహమ్మారి ప్రారంభంలో ఇంటి నుండి పని చేయమని తన ఉద్యోగులకు సూచించిన టెక్నికల్ కంపెనీల్లో గూగుల్ ఒకటి. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా తమ ఉద్యోగులకు ఇదే తరహా పని విధానాన్ని అనుమతిస్తే.. మహమ్మారి తర్వాత ఇంటి నుంచి శాశ్వతంగా పని చేసే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు