Google Services Down : నిలిచిపోయిన గూగుల్ సర్వీసులు.. యూజర్ల ఇబ్బందులు!

ప్రపంచ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం, ఆల్ఫాబెట్ ఇంక్ సంస్థ గూగుల్ సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాంతో చాలామంది యూజర్లు గూగుల్ సర్వీసులను వినియోగించుకోవడం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Google Services Down : ప్రపంచ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం, ఆల్ఫాబెట్ ఇంక్ సంస్థ గూగుల్ సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాంతో చాలామంది యూజర్లు గూగుల్ సర్వీసులను వినియోగించుకోవడం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూగుల్ సర్వీసుల్లో ముఖ్యంగా స్ట్రీమింగ్ యూట్యూబ్, ఈమెయిల్ సర్వీసులు నిలిచిపోయినట్టు ఔటేజ్ మానిటరింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ (Downdetector) ఒక ప్రకటనలో వెల్లడించింది.

గూగుల్, యూట్యూబ్, జీమెయిల్ (Gmail Services) సర్వీసులు సోమవారం సాయంత్రం నిలిచిపోయినట్టు తెలిపింది. దీని కారణంగా వేలాది మంది యూజర్లు లాగిన్ కాలేకపోవడం, వెబ్ సైట్లను యాక్సస్ చేసుకోలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపింది. ఉత్తర అమెరికాలోని పలు ప్రాంతాల్లోని యూజర్లు ఈ సమస్యను అధికంగా ఎదుర్కొన్నట్టు డౌన్ డిటెక్టర్ పేర్కొంది.

యూట్యూబ్ (Youtube), గూగుల్ డ్రైవ్ (Googel Drive) సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. గూగుల్ ప్లాట్ ఫాంలపై తలెత్తిన సమస్య పరిష్కరించలేదని తెలిపింది. దీనిపై గూగుల్ కూడా వర్కింగ్ అవర్లలో స్పందించలేదు. సర్వీసుల్లో సమస్యకు సంబంధించి డౌన్ డిటెక్టర్ కొన్ని రిపోర్టులను నివేదించింది. యూజర్ సబ్మిటెడ్ ఎర్రర్లను కూడా తన ప్లాట్ ఫాంపై నివేదించింది.

ట్రెండింగ్ వార్తలు