Google: గూగుల్‌లో ఏది వెతికితే అవే యాడ్స్ వస్తున్నాయా? డేటా డిలీట్ చేయండిలా!

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లో మనం ఏం సెర్చ్ చేసినా దానికి సంబంధించిన యాడ్స్ కనిపిస్తుంటాయి. వెంటనే ఆ ట్రాకింగ్ డేటాను డిలీట్ చేసుకోవచ్చు.

Google: గూగుల్‌లో ఏది వెతికితే అవే యాడ్స్ వస్తున్నాయా? డేటా డిలీట్ చేయండిలా!

Google Tracks Through Ads On You Search From Any Device

Updated On : August 20, 2021 / 8:35 AM IST

Google Tracks Through Ads : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లో మనం ఏం సెర్చ్ చేసినా దానికి సంబంధించిన యాడ్స్ కనిపిస్తుంటాయి. మీరు ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు అందులో మీరు సెర్చ్ చేసిన కీవర్డ్‌కు సంబంధించిన యాడ్స్ డిస్ ప్లే అవుతుంటాయి. దానికి కారణం మీ సెర్చ్ చేసే అంశం అడ్వర్టైజర్లకు తెలియడమే.. అలాగే గూగుల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా యాడ్ స్పాన్సర్ చేసేవారికి మీరు ఏం సెర్చ్ చేస్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది. అందుకే మీరు ఏం సెర్చ్ చేసినా అవే యాడ్స్ ఆయా వెబ్ సైట్లో కనిపిస్తుంటాయి. ఒకవేళ మీరు ఏదైనా అమెజాన్ లో ప్రొడక్టు కోసం సెర్చ్ చేశారనుకోండి.. దానికి సంబంధించిన యాడ్స్ మీరు విజిట్ చేసిన వెబ్ సైట్లో కనిపిస్తుంటాయి. గూగుల్ యాడ్స్ ట్రాకింగ్ ద్వారా ఇలా జరుగుతుంది. మనం గూగుల్లో ఏం వెతుకుతున్నామో ఇతరులకు తెలిస్తే ఎలా.. ప్రైవసీకి ఇబ్బందిగా ఫీలవుతున్నారా? అయితే మీరు ఏం సెర్చ్ చేస్తున్నారో గూగుల్ ట్రాకింగ్ చేయకుండా నిలిపివేయొచ్చు. అందుకు మీరు చేయాల్సిందిల్లా.. మీ గూగుల్ అకౌంట్లో సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు.. గూగుల్ జీమెయిల్ అకౌంట్లోని My Activity.. మన బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేస్తుంటుంది. దీనిద్వారానే గూగుల్ భాగస్వామ్య యాడ్ ఏజెన్సీలు తమ యాడ్స్ డిస్ ప్లే చేస్తుంటాయి.

గూగుల్ అకౌంట్ లాగిన్ అయి ఉండి.. మీరు ఏం సెర్చ్ చేసినా అది రికార్డు అవుతుంది. My Activity అన్ని సెర్చ్ హిస్టరీని ట్రాక్ చేస్తుంటుంది. గూగుల్‌లో ప‌ర్స‌న‌ల్ డేటా ట్రాకింగ్ చేయొద్దని అనుకుంటే.. దాని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇప్పటివరకూ గూగుల్ రికార్డు చేసిన హిస్టరీ ట్రాకింగ్ మొత్తాన్ని డిలీట్ చేయొచ్చు. గూగుల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి My Activity లింక్‌పై క్లిక్ చేయండి.. అప్పుడు మీకో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది. అక్కడ ఇప్పటివరకూ మీరు ఏం సెర్చ్ చేసిన వెబ్‌సైట్ల వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. తేదీల వారీగా విజిట్ చేసిన వెబ్‌సైట్ల వివ‌రాలు కూడా క‌నిపిస్తాయి. ఈ మొత్తం హిస్ట‌రీని ఎప్ప‌టిక‌ప్పుడు డిలీట్ చేస్తుండాలి. ఈ డేటాను డిలీట్ చేసేందుకు ప్రయత్నిస్తే క‌న్ఫ‌ర్మేష‌న్ అడుగుతుంది.
Netflix Hacks : ఈ 7 టాప్ నెట్‌ఫ్లిక్స్ హ్యాక్స్ తెలిస్తే.. ప్రోగా మారిపోవచ్చు!

Okay పై క్లిక్ చేసి డిలీట్ చేస్తే డేటా అంతా డిలీట్ అయిపోయింది. గూగుల్ సర్వర్ల నుంచి కూడా మీ డేటా డిలీట్ అయిపోతుంది. వెబ్‌సైట్లే కాదు.. యూట్యూబ్‌లో ప్రతి వీడియో హిస్టరీని కూడా గూగుల్ ట్రాక్ చేస్తుంది. దీనికి కూడా My Activity ట్రాకింగ్ చేస్తుంది. అంతేకాదు…సెర్చ్ చేసే డేటా ఆధారంగా ఇతర సంబంధిత వీడియోల‌ను రికమండ్ చేస్తుంటుంది. ఈ హిస్ట‌రీని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూట్యూబ్‌లోని హిస్ట‌రీ ఆప్ష‌న్‌ విజిట్ చేయండి. క్లియ‌ర్ వాచ్ హిస్ట‌రీ, క్లియ‌ర్ ఆల్ సెర్చ్ హిస్ట‌రీ ఆప్ష‌న్ల‌ను ఎంచుకోండి. మొత్తం హిస్ట‌రీ డిలీట్ చేయొచ్చు లేదంటే మీకు అవసరంలేని వీడియోల‌ను మాత్రమే డిలీట్ చేయొచ్చు.

గూగుల్‌లో సెర్చ్ చేసే ప్ర‌తి డేటాను ఇత‌ర యాడ్ సంస్థ‌లు చూస్తుంటాయి. మ‌న బ్రౌజింగ్ హిస్ట‌రీ ఆధారంగా ఆయా సంస్థలు యాడ్స్ డిస్‌ప్లే చేస్తుంటాయి. ఈ యాడ్ కంపెనీలు మ‌న డేటాను చూడకుండా కంట్రోల్ చేయొచ్చు. ముందుగా గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అయి అందులో ప్రైవ‌సీ విభాగంలోకి వెళ్లండి. అందులో యాడ్స్ సెట్టింగ్స్‌ కనిపిస్తుంది. మేనేజ్ యాడ్ సెట్టింగ్స్‌ను ఎంచుకోండి. యాడ్ ప‌ర్స‌న‌లైజేష‌న్ ఆప్ష‌న్‌ను డియాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ సంస్థలకు మీరు ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసుకోలేరు.

గూగుల్ సర్వీసుల్లో మరొకటి.. గూగుల్ మ్యాప్స్.. ఇది లొకేషన్ ఆధారంగా ట్రాక్ చేస్తుంటుంది. గూగుల్ మ్యాప్స్ యాప్ ద్వారా మీరు వెళ్లే ప్రతి లొకేషన్ స్టోర్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో టైమ్‌లైన్ ఆప్ష‌న్ ఉంటుంది. మన ప్ర‌తి లొకేష‌న్‌ను స్టోర్ చేస్తుంది. టైమ్‌లైన్ లింక్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్ హిస్ట‌రీని డిలీట్ చేసుకోవచ్చు.లొకేష‌న్ ట్రాకింగ్‌ను కూడా నిలిపివేయొచ్చు. మొత్తం హిస్ట‌రీ డిలీట్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేని లొకేషన్ల డేటాను కూడా డిలీట్ చేసుకోవచ్చు.
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 5 ట్రిక్స్ తప్పక తెలుసుకోవాల్సిందే