Oppo Reno 15 Pro Mini : వారెవ్వా.. కొత్త ఒప్పో రెనో 15 ప్రో మినీ సిరీస్ వచ్చేస్తోంది, ఫీచర్లు కేక.. ధర ఎంతో తెలిసిందోచ్

Oppo Reno 15 Pro Mini : ఒప్పో అభిమానులు గెడ్ రెడీ. అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి ఒప్పో రెనో 15 ప్రో మినీ సిరీస్ వచ్చేస్తోంది. ధర, ఫీచర్లు లీక్ వివరాలపై ఓసారి లుక్కేయండి.

Oppo Reno 15 Pro Mini : వారెవ్వా.. కొత్త ఒప్పో రెనో 15 ప్రో మినీ సిరీస్ వచ్చేస్తోంది, ఫీచర్లు కేక.. ధర ఎంతో తెలిసిందోచ్

Oppo Reno 15 Pro Mini

Updated On : December 30, 2025 / 6:55 PM IST
  • 6.32-అంగుళాల డిస్‌ప్లేతో ఒప్పో రెనో 15 ప్రో మినీ
  • 50MP సెల్ఫీ కెమెరాతో రానున్న ఒప్పో రెనో 15 ప్రో మినీ సిరీస్
  • కచ్చితమైన లాంచ్ తేదీపై భారీ అంచనాలు, ధర వివరాలు లీక్

Oppo Reno 15 Pro Mini : కొత్త ఒప్పో ఫోన్ కొంటున్నారా? భారతీయ మార్కెట్లోకి కొత్త ఒప్పో రెనో 15 సిరీస్‌ వచ్చేస్తోంది. రెనో 15, రెనో 15 ప్రో, రెనో 15 ప్రో మినీలు ఉన్నట్లు అంచనా. అతి త్వరలోనే రెనో 15 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. టెక్ సంస్థ రాబోయే ఫోన్లకు సంబంధించి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు డిజైన్‌ టీజ్ చేసింది.

అయితే, ఇంకా ఒప్పో రెనో ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఒప్పో రెనో 15 ప్రో మినీ బాక్స్ ధర ముందుగానే రివీల్ అయింది. 6.32-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది.

భారత్‌లో ఒప్పో రెనో 15 ప్రో మినీ ధర, స్పెసిఫికేషన్లు (అంచనా) :

భారత మార్కెట్లో రాబోయే ఒప్పో రెనో 15 ప్రో మినీ బాక్స్ ధర 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 64,999గా నిర్ణయించినట్టు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు. భారత మార్కెట్లో ఫోన్ల బాక్స్ ధరలు సాధారణంగా రిటైల్ ధరల కన్నా ఎక్కువగా ఉన్నాయి.

ఒప్పో రెనో 15 ప్రో మినీ సేల్ ధర దేశంలో తక్కువగా ఉండవచ్చు. ఈ కాన్ఫిగరేషన్ రూ. 59,999 వద్ద అందుబాటులో ఉండవచ్చు. అదనంగా, ఒప్పో బ్యాంక్ డిస్కౌంట్లను అందించవచ్చు. తద్వారా ధర మరింత తగ్గుతుంది.

Oppo Reno 15 Pro Mini

Oppo Reno 15 Pro Mini

భారత మార్కెట్లో ఒప్పో రెనో 15 ప్రో మినీ, రెనో 15 రెనో 15 ప్రోలతో పాటు లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. దేశంలో లాంచ్ అయిన తర్వాత రెనో 15 సిరీస్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Read Also : Apple iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్, ఇలాంటి ఆఫర్ మళ్లీ జన్మలో రాదు

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే..

ఒప్పో రెనో 15 ప్రో మినీ 6.32-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 1.6mm మందపాటి బెజెల్స్‌తో 93.35 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో అందిస్తుందని కంపెనీ ధృవీకరించింది. బరువు 187 గ్రాములు, మందం 7.99mm ఉంటుంది.

ఒప్పో ప్రకారం.. ఒప్పో రెనో 15 ప్రో మినీ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌ కలిగి ఉంది. అంతేకాకుండా, USB టైప్-సి పోర్ట్ కూడా ప్లాటినం లేయర్ కలిగి ఉంది.

ఒప్పో రెనో 15 ప్రో మినీ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB ర్యామ్, 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుందని రిపోర్టులు సూచిస్తున్నాయి. 200MP ప్రైమరీ రియర్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని చెబుతున్నారు.

ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుందని సమాచారం. ఒప్పో రెనో 15 ప్రో మినీ 6,200mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇవ్వొచ్చు.