Apple iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్, ఇలాంటి ఆఫర్ మళ్లీ జన్మలో రాదు
Apple iPhone 17 Pro : విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై కిర్రాక్ డిస్కౌంట్ మీకోసమే. ఆన్ లైన్‌లో ఇలా కొన్నారంటే చాలా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
Apple iPhone 17 Pro
- భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ. 1,34,900
- విజయ్ సేల్స్‌లో ఈ ఐఫోన్ ధర రూ.1,25,490 మాత్రమే
- ఐఫోన్ 17 ప్రో కొనుగోలుపై నేరుగా రూ.9,410 డిస్కౌంట్
- ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5,000 అదనపు డిస్కౌంట్
- ఐఫోన్ 17 ప్రోపై మొత్తం రూ. 14వేలు డిస్కౌంట్
మీరు ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్. కొత్త ఏడాదికి ముందే ఈ ప్రీమియం ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఐఫోన్ లవర్స్ కోసం విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్‌ను అందిస్తోంది. వైడ్ రేంజ్ ఆపిల్ ప్రొడక్టులపై ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు.
ఈ సేల్‌లో ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఇతర (Apple iPhone 17 Pro) ఆపిల్ డివైజ్‌లపై అనేక డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లలో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో రూ. 14వేల కన్నా ఎక్కువ సేవింగ్ పొందవచ్చు. పూర్తి లాంచ్ ధర చెల్లించనవసరం లేదు. హై-ఎండ్ ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకునే కొనుగోలుదారులకు ఈ డీల్ అద్భుతంగా ఉంటుంది.
ఐఫోన్ 17 ప్రో విజయ్ సేల్స్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో రూ.1,34,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టాప్-ఎండ్ ఐఫోన్ ప్రస్తుతం రూ.1,25,490కి లిస్ట్ అయింది. రూ.9,410 నేరుగా ధర తగ్గింపు అందిస్తుంది. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.5వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

Apple iPhone 17 Pro
ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో 120Hz ప్రోమోషన్ టెక్నాలజీతో 6.3-అంగుళాల OLED డిస్‌ప్లే, ఆన్ డిస్‌ప్లే, యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ కలిగి ఉంది. ఇంకా, సిరామిక్ షీల్డ్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
హుడ్ కింద ఐఫోన్ A19 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్ కలిగి ఉంది. ఈ ఫోన్ సింగిల్ ఛార్జ్‌పై 39 గంటల వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో బ్యాక్ సైడ్ 48MP ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 48MP ఫ్యూజన్, 48MP అల్ట్రావైడ్ 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.
8x వరకు ఆప్టికల్ జూమ్ 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తాయి. ఫ్రంట్ సైడ్ ఐఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP కెమెరా కలిగి ఉంది.
