Netflix Hacks : ఈ 7 టాప్ నెట్‌ఫ్లిక్స్ హ్యాక్స్ తెలిస్తే.. ప్రోగా మారిపోవచ్చు!
ప్రపంచ ఓటీటీ దిగ్గజాల్లో పాపులర్ ప్లాట్ ఫాం Netflix ఒకటి. ఈ 7 టాప్ నెట్ ప్లిక్స్ హ్యాక్స్ తెలిస్తే చాలు.. నెట్ ప్లిక్స్ ప్రోగా మారిపోవచ్చు.

7 Secret Netflix Hacks That’ll Make You A Binge Watch Pro
7 secret Netflix hacks binge-watch pro : కరోనా పుణ్యామని ప్రపంచమంతా నెలల తరబడి ఇంట్లోనే క్వారంటైన్ కావాల్సి వచ్చింది. అందరికి ఎంటర్ టైన్మెంట్ తోనే టైమ్ పాస్ అయింది. బయటకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో అందరూ ఓటీటీ ప్లాట్ ఫాంల్లో స్ట్రీమింగ్ కు అలవాటుపడిపోయారు. ఫేవరెట్ టీవీ షోల నుంచి మూవీలు, వెబ్ సిరీస్ లను తెగ చూసేశారు. ప్రపంచ ఓటీటీ దిగ్గజాల్లో పాపులర్ ప్లాట్ ఫాం Netflix ఒకటి. అందులో నెట్ ప్లిక్స్ ప్రో అప్లికేషన్ యాక్సస్ చేసుకోవాలంటే ఆండ్రాయిడ్ యూజర్లు ఎలాంటి పేమెంట్, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 7 టాప్ నెట్ ప్లిక్స్ హ్యాక్స్ తెలిస్తే చాలు.. నెట్ ప్లిక్స్ ప్రోగా మారిపోవచ్చు.
1. మీ బ్యాండ్‌విడ్త్ కంట్రోల్ చేయండి :
బ్యాండ్‌విడ్ కంట్రోల్ చేయడం అదో టఫెస్ట్ టాస్క్. ఫ్యామిలీ మొత్తం ఒకే వై-ఫై కనెక్షన్ వాడుతున్నప్పుడు మీరు మరో వర్క్ చేయాలనుకుంటే కష్టమే. అప్పుడు మీ పిల్లల్లో ఎవరైనా కార్టూన్ చూస్తూ బిజీగా ఉండిపోవచ్చు. అలాంటి సమయంలో ఆ ప్రొఫైల్ ను పేరంటల్ కంట్రోల్స్ ద్వారా బ్యాండ్ విడ్త్ హైక్వాలిటీని కంట్రోల్ చేయొచ్చు. Account>Profile & Parental Controls లోకి వెళ్లండి. మీకు కావలసిన ప్రొఫైల్‌లోకి వెళ్లండి. డ్రాప్‌డౌన్ పై క్లిక్ చేయండి. ప్లేబ్యాక్ సెట్టింగ్‌లలో ‘Change’ క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఎంత స్ట్రీమింగ్ బ్యాండ్‌విడ్త్ వినియోగిస్తుందో చెక్ చేయండి. అప్పుడు ప్రతి ప్రొఫైల్ పై బ్యాండ్ కంట్రోల్ చేయొచ్చు. ప్రతి స్క్రీన్‌కు డేటా వినియోగాన్ని తక్కువగా ఉండేలా సెట్ చేసుకోవచ్చు.
2. Coming Soon.. వచ్చే షోలను చెక్ చేయండి :
మొబైల్ డివైజ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ యాప్ లో Coming Soon అనే ట్యాప్ ఉంటుంది. ఈ ట్యాబ్ ద్వారా నెట్ ఫ్లిక్స్ లో రాబోయే కొత్త షోలు, మూవీలు ఏంటో ముందే తెలుసుకోవచ్చు. రాబోయే మూవీలు, సిరీస్, టీవీ షోల ట్రైలర్లను చూడొచ్చు. అంతేకాదు.. ఏదైనా షో రిలీజ్ కు సంబంధించి అప్ డేట్ కావాలంటే Remind Me అనే బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే చాలు.. రిలీజ్ కాగానే నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా నెట్ ఫ్లిక్స్ లో అప్ కమింగ్ అప్ డేట్స్ గురించి ముందుగానే తెలుసుకోవచ్చు.
3. మీ ప్రొఫైల్‌కు పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి :
మీరు పిల్లల కోసం కిడ్ ప్రొఫైల్ క్రియేట్ చేశారా? అయితే మేనేజ్ ప్రొఫైల్ నుంచి ఈ ప్రొఫైల్ ఆపరేట్ చేయొచ్చు. అప్పుడు మెయిన్ ప్రొఫైల్‌కు పాస్ వర్డ్ చేసుకోండి.. లేదంటే.. మీ పిల్లలు మీ అకౌంట్ లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కిడ్స్ ప్రొఫైల్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ మాత్రమే చూసేలా చేయొచ్చు. వారు ఏ కంటెంట్ చూస్తున్నారో నిఘా పెట్టొచ్చు. అందుకు మీరు చేయాల్సిందిల్లా.. 4 అంకెల ప్రొపైల్ లాక్ పాస్ వర్డ్ చేసుకోండి. ఏ డివైజ్ నుంచి కూడా మీ ప్రొఫైల్ చూడలేరు. Account>Profile & Parental Controls ద్వారా ప్రొపైల్ సెలక్ట్ చేయండి. Change బటన్ పై క్లిక్ చేసి Profile Lock చేయండి.
Netflix: నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్.. మీకు కావాల్సినంత డౌన్‌లోడ్ చేసుకుని చూసేయొచ్చు
4. నెట్ ఫ్లిక్స్‌లో ప్రొపైల్ ఇమెయిల్ (Profile Email) సైన్‌అప్ అవ్వండి :
నెట్‌ఫ్లిక్స్‌లో వేలాది షోలు, సినిమాలు ఉంటాయి. అందులో మీకు ఏది సరైనదో తెలుసుకోవడం కష్టమే. ఏదైనా షో వచ్చినప్పుడు మిస్ కాకుండా ఉండాలంటే.. సైన్‌అప్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు నెట్‌ఫ్లిక్స్ మీకు రికమండేషన్స్ చూపిస్తుంది. ప్రొఫైల్ ఇమెయిల్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఈమెయిల్స్ కేవలం అకౌంట్ హోల్డర్ కు మాత్రమే కనిపిస్తాయి. మీకు అకౌంటు లేదు. చాలా ప్రొఫైల్స్ వాడుతున్నారు. అప్పుడు ఇక్కడ ప్రొఫైల్ ఈమెయిల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ మీరు ఏం చూడాలి.. ఏయే కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయో సూచనలను ఇమెయిల్ ద్వారా అలర్ట్ చేస్తుంది. Account>Profile & Parental Controlsలోకి వెళ్లి మీ ప్రొఫైల్ ఎంచుకోండి. అక్కడ Profile Email యాడ్ చేసుకోండి..
5. మీ మూడ్ బట్టి ఏది కావాలో సెర్చ్ చేయొచ్చు :
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఈజీగా సెర్చ్ చేసేందుకు Search Bar ఒకటి ఉంది. ఇక్కడే మీరు నెట్‌ఫ్లిక్స్ హ్యాక్ వినియోగించవచ్చు. ఏదైనా షో లేదా మూవీ, యాక్టర్ గురించి సెర్చ్ చేయొచ్చు. అలాగే మీ మూడ్ బట్టి కూడా ఏది కావాలో అది సెర్చ్ చేయొచ్చు. రొమాంటిక్ టీవీ ప్రొగ్రామ్స్ కోసం సెర్చ్ చేయొచ్చు.
6. ఒక క్లిక్‌తో మీకు ఫేవరెట్ షోలను షేర్ చేయొచ్చు :
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ అనగానే.. న్యూస్, మీమ్‌లు వంటి మరెన్నో షేర్ చేస్తుంటారు. అలాగే నెట్ ప్లిక్స్ కంటెంట్ కూడా షేర్ చేసుకోవచ్చు. మీ ఫేవరెట్ మూవీలు లేదా టీవీ షోలను ఫోన్ లేదా టెక్స్ట్ ద్వారా షేర్ చేయవచ్చు, నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో ‘Share’ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే చేసి Instagram Storiesలోకి షేర్ చేసుకోవచ్చు. అలాగే ట్విట్టర్ లేదా వాట్సాప్ మెసేజ్‌లకు షేర్ చేసుకోవచ్చు.
7. సబ్ టైటిల్స్ రిసైజు చేసుకోవచ్చు :
నెట్ ఫ్లిక్స్ యూజర్లల్లో చాలా తక్కువ మందికి ఈ హ్యాక్ తెలిసి ఉండొచ్చు. మీరు వాచ్ చేసే షో లేదా మూవీకి సంబంధించిన సబ్ టైటిల్స్ రీసైజు కోవచ్చు. అలాగే కలర్, ఫాంట్ సైజులను కూడా మార్చుకోవచ్చు. మీ కళ్లకు స్పష్టంగా కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందిల్లా.. మీ అకౌంట్లోకి వెళ్లి Subtitle Appearance సెలక్ట్ చేసుకోండి. కలర్, ఫాంట్ తో పాటు బ్యాక్ గ్రౌండ్, షాడో వంటి అనేక ఆప్షన్లను నచ్చిన విధంగా మార్చుకోవచ్చు.
Netflix: నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్.. మీకు కావాల్సినంత డౌన్‌లోడ్ చేసుకుని చూసేయొచ్చు