×
Ad

Google AI Mode : కొంపదీసి మీరు గూగుల్ AIని హెల్త్ టిప్స్ అడుగుతున్నారా?

Google AI Tool : గూగుల్ ఏఐ హెల్త్ టూల్ చెప్పే ఆరోగ్య సమాచారాన్ని చూసి వైద్య నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. గూగుల్ యూట్యూబ్‌ను డాక్టర్ అనుకుంటోందని, అన్ని వీడియోలను యూజర్లకు సూచిస్తోందని అధ్యయనంలో తేలింది.

Google AI Tool ( Image Credit to Original Source)

  • గూగుల్ ఏఐ మోడ్‌ వాడేవారికి షాకింగ్ న్యూస్
  • గూగుల్ ఎక్కువగా యూట్యూబ్‌ వీడియోలనే చూపిస్తోంది
  • యూట్యూబ్ నుంచే 4.43 శాతం ఆరోగ్య సమాచారం
  • గూగుల్‌లో 50వేలకు పైగా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలపై అధ్యయనం
  • మొత్తం 465,000 ఏఐ డేటాలో యూట్యూబ్ 20,621 సార్లు కనిపించింది

Google AI Health Tool : బాబోయ్.. గూగుల్ ఏఐతో జాగ్రత్త.. నేటి డిజిటల్ యుగంలో చాలామంది ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గూగుల్ ఏఐని అడిగేస్తున్నారు. ఒకప్పుడు ఆరోగ్య సమస్యల కోసం డాక్టర్లను సంప్రదించేవారు. కానీ, ఇప్పుడు ఏఐ డాక్టర్లను దూరం చేసింది. ఇప్పుడు ఏ ఆస్పత్రికి వెళ్లే పని లేకుండా కేవలం ఏఐని అడిగి హెల్త్ టిప్స్ తెలుసుకుంటున్నారు. ఏఐ చెప్పిన ఆరోగ్య సూచనలు విని పాటించేవారు కూడా చాలామందే ఉన్నారు.

గూగుల్ కొత్త ‘ఏఐ ఓవర్ వ్యూ’ మోడ్ అనే ఫీచర్‌ తీసుకురావడంతో మనం ఏది సెర్చ్ చేసినా దానికి సంబంధించి సమ్మరీని సూచిస్తుంటుంది. ప్రతి నెలా బిలియన్ల మంది ప్రశ్నలకు క్షణాల్లో సమాధానం ఇస్తోంది. ఈ ఏఐ మోడ్ ఫీచర్ అందించే ఆరోగ్యం సమాచారంపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు.

వాస్తవానికి, ఈ గూగుల్ ఏఐ మోడ్ ఏమైనా కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అందిస్తుందా? అంటే అది ఎక్కువగా యూట్యూబ్ లో పోస్టు చేసిన వైద్యపరంగా ధృవీకరించని ఆరోగ్య సమాచారాన్నే చూపిస్తోందని ఒక అధ్యయనంలో తేలింది. ఇందులో గూగుల్ అడిగిన ఏదైనా వ్యాధి గురించి ఏఐ అందించే సమాధానాలను ఎంతవరకు నమ్మొచ్చు అనేదానిపై లోతుగా అధ్యయనం జరిగింది.

గూగుల్ ఎక్కువగా యూట్యూబ్‌నే చూపిస్తోంది :
ఏఐ ఆరోగ్యం సమాచారాన్ని అందించే అంశంపై ఇటీవల బెర్లిన్‌లో నిర్వహించిన అధ్యయనం ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. ఎస్ఈ ర్యాంకింగ్ పరిశోధకులు గూగుల్‌లో 50వేల కన్నా ఎక్కువ ఆరోగ్య సంబంధిత ప్రశ్నలను విశ్లేషించారు. అందులో ప్రధానంగా వ్యాధులకు సమాధానాలు అందించే గూగుల్ ఏఐ ఆధారిత ఫీచర్ ఏయే వనరులను వినియోగిస్తుందో తెలుసుకునేందుకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

అయితే, ఫలితాలు అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా వచ్చాయి. కచ్చితమైన వైద్య సమాచారాన్ని అందించే గూగుల్ ఈ ఏఐ టూల్ ద్వారా ఏదైనా పాపులర్ ఆస్పత్రి లేదా ప్రభుత్వ ఆరోగ్య పోర్టల్ కన్నా యూట్యూబ్‌పై ఎక్కువగా ఆధారపడుతుందని పరిశోధనలో తేలింది.

Read Also : Apple iPhone Air Price : ఆపిల్ లవర్స్ మీకోసమే.. ఈ ఐఫోన్ ఎయిర్ ధర అమెజాన్‌లో రూ.లక్ష లోపే.. డిస్కౌంట్ ఎలా పొందాలంటే?

గణాంకాలు ఏం చెబుతున్నాయంటే? :

అధ్యయనం ప్రకారం.. అన్ని ఏఐకి సంబంధించి ఆరోగ్య సూచనలలో 4.43 శాతం యూట్యూబ్ నుంచే వచ్చాయి. ఈ సంఖ్య ఏ ఆస్పత్రి నెట్‌వర్క్, ప్రభుత్వ ఆరోగ్య పోర్టల్, వైద్య సంఘం లేదా విద్యాసంస్థ కన్నా ఎక్కువ. మొత్తం 465,000 కన్నా ఎక్కువ ఏఐ అందించిన ఆరోగ్య సమాచారంలో యూట్యూబ్ 20,621 సార్లు కనిపించింది. ఆ తర్వాత జర్మనీ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NDR.de, మెడికల్ రిఫరెన్స్ సైట్ MSD మాన్యువల్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాయి.

గూగుల్ యూట్యూబ్‌‌ చెప్పింది పాటిస్తే అంతే :
యూట్యూబ్ ఏమైనా డాక్టరా? అది కేవలం ఒకరు పోస్టు చేసిన కంటెంట్ ఉంటుంది. సొంతంగా అది వైద్య సలహాలు ఇవ్వలేదని పరిశోధకులు అంటున్నారు. ఎవరైనా కంటెంట్‌ను ఫ్రీగా అప్‌లోడ్ చేసే ఓపెన్ వీడియో ప్లాట్‌ఫామ్. ఇందులో డాక్టర్, హాస్పిటల్ ఛానల్స్ మాత్రమే కాకుండా, మెడిల్ ట్రైనింగ్ లేకుండా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, అనేక మంది క్రియేటర్లు ఉన్నారు.

అందుకే ఆరోగ్య సమాచారం కోసం యూట్యూబ్‌పై ఎక్కువగా ఆధారపడటం అత్యంత ప్రమాదకరం. మీరు ఏఐలో అడిగిన ఆరోగ్య సమస్యలపై కేవలం పాపులర్ కంటెంట్ మాత్రమే సూచిస్తుంది.. ఇలాంటి ఆరోగ్య సలహాలను పాటిస్తే ప్రాణాలకే ప్రమాదమని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.