Apple iPhone Air Price : ఆపిల్ లవర్స్ మీకోసమే.. ఈ ఐఫోన్ ఎయిర్ ధర అమెజాన్‌లో రూ.లక్ష లోపే.. డిస్కౌంట్ ఎలా పొందాలంటే?

Apple iPhone Air Price : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర తగ్గిందోచ్.. ఆకర్షణీయమైన డిజైన్, అదిరిపోయే స్పెసిఫికేషన్లతో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ మోడల్ అమెజాన్ లో ధర ఎంత తగ్గిందో ఇప్పుడు చూద్దాం..

Apple iPhone Air Price : ఆపిల్ లవర్స్ మీకోసమే.. ఈ ఐఫోన్ ఎయిర్ ధర అమెజాన్‌లో రూ.లక్ష లోపే.. డిస్కౌంట్ ఎలా పొందాలంటే?

Apple iPhone Air Price ( Image Credit to Original Source)

Updated On : January 26, 2026 / 6:55 PM IST
  • భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు
  • అసలు ధర రూ.1,19,900 నుంచి రూ.99వేల లోపు
  • క్రెడిట్ కార్డులపై రూ.4వేల వరకు అదనపు డిస్కౌంట్

Apple iPhone Air Price : ఆపిల్ లవర్స్ పండగ చేస్కోండి.. ఐఫోన్ ఎయిర్ మోడల్ ధర భారీగా తగ్గింది. 2025లో లాంచ్ అయిన ఈ ఆపిల్ ఐఫోన్ ఎయిర్ బాగా పాపులర్ అయింది. చూసేందుకు చాలా సన్నని ఛాసిస్, పవర్ ఫుల్ స్పెషిఫికేషన్లతో అందరిని ఆకర్షించింది.

ఐఫోన్ సిరీస్ నుంచి ప్లస్ వేరియంట్ స్థానంలో ఈ ఎయిర్ మోడల్ వచ్చింది. ఐఫోన్ ప్రో లైనప్ మాదిరిగా ప్రో చిప్‌సెట్‌ను కలిగిన ఫస్ట్ వేరియంట్ కూడా ఇదే. ప్రస్తుతం అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో ఈ ఐఫోన్ ఎయిర్ రూ. 1,00,000 ధరకే లభ్యమవుతుంది. ఇంతకీ ఈ క్రేజీ డీల్‌ ఎలా పొందాలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం..

అమెజాన్ సేల్‌లో ఐఫోన్ ఎయిర్ ధర తగ్గింపు :
అమెజాన్ ఇండియాలో ఐఫోన్ ఎయిర్ అసలు లాంచ్ ధర రూ.1,19,900 నుంచి రూ.99,000 తక్కువ ధరకు లభిస్తుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.4వేల వరకు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దాంతో అసలు ధర నుంచి ఐఫోన్ ఎయిర్ రూ.95,900కి తగ్గుతుంది. ఈ ఐఫోన్ స్కై బ్లూ, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్, స్పేస్ బ్లాక్ అనే 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : Union Budget 2026 : ఆర్థిక సర్వే అంటే ఏంటి? కేంద్ర బడ్జెట్ ముందు ఎందుకు ప్రవేశపెడతారు? బడ్జెట్‌కు, సర్వేకు మధ్య తేడా ఏంటి?

ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ కూడా ఉంది. ప్యానెల్ 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్‌ అందిస్తుంది. సిరామిక్ షీల్డ్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఫోన్ లిక్విడ్ గ్లాస్ థీమ్‌తో iOS26 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తుంది. 3nm ప్రాసెస్, ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్‌ కూడా ఉంది.

ఆపిల్ ఐఫోన్ ఎయిర్ మోడల్ సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో సింగిల్ రియర్ 48MP కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP స్నాపర్‌ కూడా అందిస్తుంది. ఆపిల్ ఈ ఫోన్ 3149mAh బ్యాటరీతో పాటు 20W మ్యాగ్ సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందిస్తుంది.