Aadhaar Update Deadline : గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఈ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు!

Aadhaar Update Deadline : ఆన్‌లైన్‌లో ఎలాంటి ఖర్చు లేకుండా డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడానికి గడువును పొడిగించింది. అంటే.. ఆధార్ డేటాను ఉచితంగా జూన్ 14, 2024 వరకు అప్‌డేట్ చేసుకోవచ్చు.

Aadhaar Update Deadline : గుడ్ న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఈ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు!

Govt extends deadline to update Aadhaar details online

Aadhaar Update Deadline : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరోసారి గడువు పొడిగించింది. ఆన్‌లైన్‌లో ఎలాంటి ఖర్చు లేకుండా డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడానికి గడువును పొడిగించింది. అంటే.. ఆధార్ డేటాను ఉచితంగా జూన్ 14, 2024 వరకు అప్‌డేట్ చేసుకోవచ్చు.

యూఐడీఏఐ ప్రకారం.. భారతీయ నివాసితులకు 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధార్‌.. వివిధ ప్రభుత్వ సేవలు, ఆర్థిక లావాదేవీల కోసం వినియోగించుకోవచ్చు. బయోమెట్రిక్స్‌తో ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా సిస్టమ్ ఫేక్ నంబర్‌లను నిరోధిస్తుంది. డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయడం ద్వారా నివాసితులు తమ వివరాలు సెక్యూర్‌గా అప్‌డేట్ చేసుకోవచ్చు.

Read Also : EPFO Aadhaar Card : ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన.. ఇకపై పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డు పనికిరాదు.. వ్యాలీడ్ డాక్యుమెంట్లు ఇవే..!

యూఐడీఏఐ 10 ఏళ్ల క్రితం ఆధార్ కార్డును పొందిన వ్యక్తులు వారి గుర్తింపు ప్రూఫ్ (POI), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) డాక్యుమెంట్లను అప్‌డేట్ చేసేందుకు అనుమతిస్తుంది. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సులో పిల్లల బయోమెట్రిక్ వివరాలను వారి ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ ప్రక్రియ పెద్దలకు సమానంగా ఉంటుంది. మైనర్‌ల కోసం ఆధార్ అప్‌డేట్ ప్రత్యేక విధానం ఉండదు. బాల్ ఆధార్ కార్డ్ నవజాత శిశువులకు కూడా అందుబాటులో ఉంది.

ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను ఉచితంగా ఇలా అప్‌డేట్ చేయండి :
1. (myAadhaar) పోర్టల్‌ (uidai.gov.in/en) విజిట్ చేయండి.
2. మీ ఆధార్ నంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు అందిన ఓటీపీని ఉపయోగించి లాగిన్ చేయండి.
3. మీ ప్రొఫైల్‌లో కనిపించే ప్రస్తుత గుర్తింపు, అడ్రస్ వివరాలను రివ్యూ చేయండి.
4. ఏదైనా వివరాలను మార్చాలనుకుంటే నిర్దిష్ట డాక్యుమెంట్ (POI/POA) ఎంచుకోవాలి. ఆపై స్కాన్ చేసిన కాపీని (JPEG, PNG, లేదా PDF ఫార్మాట్, 2ఎంబీ కన్నా తక్కువ) అప్‌లోడ్ చేయండి.
5. మీ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసిన తర్వాత కొత్త అప్‌డేట్‌కు రిక్వెస్ట్ చేయండి.

మీరు ఉచితంగా అప్‌డేట్ చేసే వివరాలివే :

  • పేరు
  • అడ్రస్
  • పుట్టిన తేదీ/వయస్సు
  • లింగం
  • మొబైల్ నంబర్
  • ఇమెయిల్ అడ్రస్
  • రిలేషన్‌షిప్ స్టేటస్
  • ఇన్ఫర్మేషన్ షేరింగ్ కన్సెంట్

ముఖ్యంగా, మీరు బయోమెట్రిక్ ఫీచర్లు మినహా అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఫేషియల్ ఫోటో, ఐరిస్ లేదా ఫింగర్ ఫ్రింట్ వంటి బయోమెట్రిక్ సమాచారం వంటి వివరాలకు ధృవీకరణ అవసరం. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ విజిట్ చేయడం ద్వారా ఈ వివరాలను ధృవీకరించవచ్చు.

ఆఫ్‌లైన్ అప్‌డేషన్‌ను పూర్తి చేయడానికి :
1. ఆధార్ లొకేటర్ వెబ్‌సైట్‌ను (bhuvan.nrsc.gov.in/aadhaar) విజిట్ చేయండి.
2. మీ దగ్గరలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ కోసం ‘Nearby Centers’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
3. మీరు ‘Search through Pincode’ విభాగంలో మీ పిన్ కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ సెంటర్ కోసం కూడా సెర్చ్ చేయొచ్చు.
4. అవసరమైన డాక్యుమెంట్లతో ఎంచుకున్న ఆధార్ సెంటర్ ఎంచుకోండి. మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ కోసం సూచనలను పాటించండి.
ముఖ్యంగా, రూ. 50 రుసుము చెల్లించాలి. ఆధార్ కేంద్రాలలో మీ ఆధార్ కార్డ్ కోసం మీ డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

Read Also : Blue Aadhaar Card : బాల (బ్లూ) ఆధార్ కార్డు అంటే ఏంటి? ఈ ప్రత్యేకమైన కార్డు ఐదేళ్ల లోపు పిల్లలకు ఎందుకు ముఖ్యమంటే?