Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్‌!

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటిని తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.

Twitter Accounts : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటిని తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి జూలై 4 చివరి గడువును విధించింది. ఈ మేరకు ట్విట్టర్‌కు కేంద్రం తుది నోటీసులను జారీ చేసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ జూన్ 27న నోటీసులు జారీ చేసింది. అయితే కేంద్రం పంపిన నోటీసులను ట్విట్టర్ పట్టించుకోలేదు. దాంతో కేంద్రం ట్విట్టర్‌కు తుది నోటీసులు ఇచ్చింది. మరోసారి గడువు పెంచేది లేదని స్పష్టం చేసింది. ఇదే ఆఖరిదని తేల్చిచెప్పింది. ఆదేశించిన గడువులోగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయని పక్షంలో ట్విటర్ మధ్యవర్తి స్థితిని కోల్పోతుందని కేంద్రం హెచ్చరించింది.

Uddhav Thackeray Will Resign To His Post

ఆయా ట్విట్టర్ పోస్టులకు బాధ్యత వహించాల్సిందిగా కేంద్రం సూచించింది. అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, రైతు ఉద్యమానికి మద్దతు పలికిన ట్విటర్‌ అకౌంట్లను, కొన్ని ట్వీట్‌లను బ్లాక్ చేయాలని 2021లో ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది.

అయితే.. అప్పటికే 80కి పైగా ట్విటర్‌ అకౌంట్లను బ్లాక్‌ చేశామని ట్విట్టర్ తేల్చిచెప్పింది. ఆయా అకౌంట్లకు సంబంధించిన జాబితాను జూన్ 26న కేంద్రానికి సమర్పించింది. ట్విటర్‌ పాటించాల్సిన ఆర్డర్‌లు ఇంకా ఉన్నాయని తెలిపింది. జూలై 4 మాత్రమే చివరి గడువని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం విధించిన డెడ్ లైన్ సంబంధించి ట్విట్టర్ ఇప్పటివరకూ స్పందించలేదు.

Read Also : Twitter Account: పాక్ రాయబార కార్యాలయాల అధికారిక ట్విటర్ ఖాతాలను బ్యాన్ చేసిన ఇండియా

ట్రెండింగ్ వార్తలు