Twitter Account: పాక్ రాయబార కార్యాలయాల అధికారిక ట్విటర్ ఖాతాలను బ్యాన్ చేసిన ఇండియా

భారత దేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్స్ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు పలు దేశాల్లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయాల అధికారిక ట్విటర్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిలో యూఎన్, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయాల ట్విటర్ ఖాతాలు ఉన్నాయి.

Twitter Account: పాక్ రాయబార కార్యాలయాల అధికారిక ట్విటర్ ఖాతాలను బ్యాన్ చేసిన ఇండియా

Twitter

Twitter Account: భారత దేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్స్ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు పలు దేశాల్లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయాల అధికారిక ట్విటర్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిలో యూఎన్, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్ లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయాల ట్విటర్ ఖాతాలు ఉన్నాయి. అంతేకాక పాకిస్థాన్‌లోని జాతీయ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ – రేడియోను నిషేధించింది. అయితే భారత్ లో ట్విటర్ అధికారిక ఖాతాలను నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఖాతాలను తక్షణ పునరుద్ధరించాలని ట్విటర్‌ను కోరింది. ఇదిలాఉంటే భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గతంలో ఆరు పాకిస్థాన్ ఆధారిత ఛానెల్‌లతో సహా 16యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ ను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.

Pakistan: పాకిస్థాన్ మ‌రిన్ని క్లిష్ట‌ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది: ప్ర‌ధాని షెహ్‌బాజ్‌

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకారం తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో భయాందోళనలను సృష్టించడానికి, మత విద్వేషాలు సృష్టించడానికి, పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా గతంలో యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు సమాచారాన్ని పొందుపర్చారు. దీంతో వాటిని బ్లాక్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. బ్లాక్ చేయబడిన సోషల్ మీడియా ఖాతాలలో ఆరు పాకిస్తాన్ ఆధారిత, పది భారతదేశానికి చెందిన యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లు ఉన్నాయి. ఇవి 68కోట్లకు పైగా వీక్షకుల సంఖ్యను కలిగి ఉన్నాయి. ఐటి రూల్స్, 2021లోని రూల్ 18 ప్రకారం డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌లు ఎవరూ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించలేదని ప్రభుత్వం తెలిపింది.

Pakistan Embassies

Pakistan Embassies

ఉక్రెయిన్‌లో పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం, జమ్మూ, కాశ్మీర్, భారతదేశం యొక్క విదేశీ సంబంధాల వంటి వివిధ విషయాలపై భారతదేశం గురించి తప్పుడు వార్తలను పోస్ట్ చేయడానికి పాకిస్తాన్‌లోని యూట్యూబ్ ఛానెల్స్ ప్రయత్నించినట్లు గుర్తించి, ఈ ఛానెల్‌లలోని కంటెంట్ పూర్తిగా అబద్ధమని ప్రకటించిన భారత్ వాటిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నందుకు భారతదేశం గతంలో పాకిస్తాన్‌ను హెచ్చరించిన విషయం విధితమే. తాజాగా పలు దేశాల్లోని పాకిస్థాన్ రాయబారాలకు సంబంధించిన ట్విటర్ ఖాతాలను కేంద్రం బ్యాన్ చేసింది.