×
Ad

Happy Diwali 2025 : హ్యాపీ దీపావళి 2025.. వాట్సాప్ స్టేటస్ వీడియో ఇలా డౌన్‌లోడ్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి..!

Happy Diwali 2025 : హ్యాపీ దీపావళి 2025 కోసం వాట్సాప్ స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇదిగో ఇలా డౌన్‌లోడ్ చేసి షేర్ చేయండి.

Happy Diwali 2025

Happy Diwali 2025 : దీపావళి పండగ వచ్చేసింది. ప్రతి ఇంట్లో వెలుగులతో సందడి వాతావరణం కనిపిస్తుంటుంది. ఎక్కడ చూసినా దీపాల వెలుగులో ఆహ్లాదకరంగా మెరుస్తుంటాయి. ఇంటి ముంగిట రంగోలితో కుటుంబాలు ఉత్సాహంగా గడుపుతుంటాయి. ప్రతిఒక్కరూ లైట్లు, స్వీట్లను కొనుగోలుచేసి తమ ప్రియమైనవారికి బహుమతిగా ఇచ్చేందుకు అద్భుతమైన సమయం.

వాట్సాప్ వేదికగా అనేక మంది (Happy Diwali 2025) తమ పండగ వేడుకలకు సంబంధించి వీడియోలు, స్టేటస్ షేర్ చేస్తుంటారు. మీరు కూడా మీ వాట్సాప్‌లో హ్యాపీ దీపావళి వాట్సాప్ స్టేటస్ వీడియో షేర్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. రంగురంగుల దీపావళి స్టేటస్ వీడియోలను ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేయొచ్చు.

‘2025 హ్యాపీ దీపావళి’ వీడియోలు ఎక్కడ పొందాలి? :
మీరు గూగుల్ లేదా యూట్యూబ్‌లో “హ్యాపీ దీపావళి 2025 వాట్సాప్ స్టేటస్ వీడియో డౌన్‌లోడ్” అని టైప్ చేయండి. పండగ సమయంలో అనేక వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అద్భుతమైన రీల్స్ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం Pexels, Pixabay, Pinterest, Unsplash, Canva వంటి ఫ్రీ ప్లాట్‌ఫారమ్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యూటీఫుల్ టెంప్లేట్‌లు, షార్ట్ వీడియోలను ఎంచుకోవచ్చు.

Read Also : Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. ఈ శాంసంగ్ అల్ట్రా 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

ఏఐతో సొంతంగా ఫెస్టివల్ మెసేజ్ క్రియేట్ చేయండి : 
మీరు ఫెస్టివల్ విషెస్ తెలిపేందుకు సొంతంగా ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు వీడియో ఎడిటింగ్ పెద్దగా తెలియాల్సిన పనిలేదు. ChatGPT, Meta AI, Gemini లేదా Grok వంటి ఏఐ టూల్స్ వాడటం తెలిస్తే చాలు.. కొన్ని క్లిక్‌లలోనే కస్టమ్ క్యాప్షన్‌లు, ఓవర్‌లేలు మొత్తం దీపావళి వీడియోలను జనరేట్ చేయొచ్చు.

వాట్సాప్‌లో దీపావళి స్టేటస్ వీడియోలను ఎలా అప్‌లోడ్ చేయాలి? :

  • వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • స్టేటస్ (Status) ట్యాబ్‌కు వెళ్ళండి.
  • My Status ఆప్షన్ ట్యాప్ చేయండి.
  • మీ ఫొటో లేదా వీడియోను ఎంచుకోండి.
  • ఫోన్ గ్యాలరీ నుంచి పండుగ దీపావళి క్లిప్‌ను ఎంచుకోండి.
  • మీకు నచ్చినట్టుగా ఒక క్యాప్షన్ పెట్టుకోండి.
  • SEND బటన్ ట్యాప్ చేయండి.