Harley Davidson X440 Launch : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హార్లే-డేవిడ్‌సన్ X440 సూపర్ బైక్ ఇదిగో.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?
Harley Davidson X440 Launch : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? హార్లే-డేవిడ్‌సన్ X440 సూపర్ బైక్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Harley Davidson X440 Launched In India At Rs 2.29 Lakh
Harley Davidson X440 Launched In India : కొత్త బైక్ కొంటున్నారా? భారత మార్కెట్లో వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న (Harley-Davidson X440) అధికారికంగా లాంచ్ అయింది. ఈ బైక్ ధర రూ. 2.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉండనుంది. హార్లే-డేవిడ్‌సన్ X440 డెనిమ్, వివిడ్, S అనే 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. చివరి రెండు వేరియంట్ల ధర రూ. 2.49 లక్షలు, రూ. 2.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
హార్లే X440 బైక్ అనేది హీరో-హార్లే సహకారం నుంచి లాంచ్ అయిన ఫస్ట్ ప్రొడక్టు ఇదే.. మోటార్‌సైకిల్ 3 ఏళ్లలోపు డెవలప్ అయింది. X440ని బైక్ నిర్మాణంలో సరైన ఎగ్జాస్ట్ నోట్‌ని ఒకటని రెండు ఇతరకంపెనీలు పేర్కొన్నాయి. Harley-Davidson X440లో స్లిమ్ ట్యాంక్, నిటారుగా ఉండే సీటింగ్ పొజిషన్, వెడల్పాటి బార్‌లు, గుండ్రని హెడ్‌లైట్ ఉన్నాయి. హార్లేస్ ప్రసిద్ధి చెందిన క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంది.
హార్లే X440 రాజస్థాన్‌లోని నీమ్రానాలోని హీరోస్ ఫెసిలిటీలో తయారైంది. ఇంజన్ విషయానికి వస్తే.. X440 440cc ఆయిల్-కూల్డ్, లాంగ్-స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో ఆధారితమైనది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 27bhp, 38Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ E20 కంప్లైంట్, X440తో, కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను లక్ష్యంగా చేసుకుంది.

Harley Davidson X440 Launched In India At Rs 2.29 Lakh
ఫీచర్ల విషయానికొస్తే.. హార్లే-డేవిడ్‌సన్ X440 USD ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్‌లు, డ్యూయల్-ఛానల్ ABSతో రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 18-అంగుళాల ముందు, 17-అంగుళాల వెనుక చక్రాలను కలిగి ఉంది. USB ఛార్జింగ్ సాకెట్, LED లైట్లు, కనెక్ట్ చేసిన ఫీచర్‌లు ఉన్నాయి. Harley-Davidson X440 క్లాసిక్ 350, హంటర్, మెటోర్, హోండా CB 350, CB 350 RS, బెనెల్లీ ఇంపీరియల్ 400 త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్పీడ్ 400లతో కూడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 రేంజ్‌తో పోటీపడుతుంది.
* Harley-Davidson X440 Denim : రూ. 2.29 లక్షలు
* Harley-Davidson X440 Vivid : రూ. 2.49 లక్షలు
* Harley-Davidson X440 S : రూ. 2.69 లక్షలు
Read Also : Jio Bharat Phone : ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ‘జియోభారత్’ ఫోన్ వచ్చేసిందోచ్.. కేవలం రూ. 999 మాత్రమే.. త్వరపడండి..!