Harley Davidson X440 Launch : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హార్లే-డేవిడ్‌సన్ X440 సూపర్ బైక్ ఇదిగో.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?

Harley Davidson X440 Launch : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? హార్లే-డేవిడ్‌సన్ X440 సూపర్ బైక్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Harley Davidson X440 Launched In India At Rs 2.29 Lakh

Harley Davidson X440 Launched In India : కొత్త బైక్ కొంటున్నారా? భారత మార్కెట్లో వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న (Harley-Davidson X440) అధికారికంగా లాంచ్ అయింది. ఈ బైక్ ధర రూ. 2.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉండనుంది. హార్లే-డేవిడ్‌సన్ X440 డెనిమ్, వివిడ్, S అనే 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. చివరి రెండు వేరియంట్ల ధర రూ. 2.49 లక్షలు, రూ. 2.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

హార్లే X440 బైక్ అనేది హీరో-హార్లే సహకారం నుంచి లాంచ్ అయిన ఫస్ట్ ప్రొడక్టు ఇదే.. మోటార్‌సైకిల్ 3 ఏళ్లలోపు డెవలప్ అయింది. X440ని బైక్ నిర్మాణంలో సరైన ఎగ్జాస్ట్ నోట్‌ని ఒకటని రెండు ఇతరకంపెనీలు పేర్కొన్నాయి. Harley-Davidson X440లో స్లిమ్ ట్యాంక్, నిటారుగా ఉండే సీటింగ్ పొజిషన్, వెడల్పాటి బార్‌లు, గుండ్రని హెడ్‌లైట్ ఉన్నాయి. హార్లేస్ ప్రసిద్ధి చెందిన క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంది.

Read Also : Samsung Galaxy M34 5G : జూలై 7న శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

హార్లే X440 రాజస్థాన్‌లోని నీమ్రానాలోని హీరోస్ ఫెసిలిటీలో తయారైంది. ఇంజన్ విషయానికి వస్తే.. X440 440cc ఆయిల్-కూల్డ్, లాంగ్-స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో ఆధారితమైనది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 27bhp, 38Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ E20 కంప్లైంట్, X440తో, కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను లక్ష్యంగా చేసుకుంది.

Harley Davidson X440 Launched In India At Rs 2.29 Lakh

ఫీచర్ల విషయానికొస్తే.. హార్లే-డేవిడ్‌సన్ X440 USD ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్‌లు, డ్యూయల్-ఛానల్ ABSతో రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 18-అంగుళాల ముందు, 17-అంగుళాల వెనుక చక్రాలను కలిగి ఉంది. USB ఛార్జింగ్ సాకెట్, LED లైట్లు, కనెక్ట్ చేసిన ఫీచర్‌లు ఉన్నాయి. Harley-Davidson X440 క్లాసిక్ 350, హంటర్, మెటోర్, హోండా CB 350, CB 350 RS, బెనెల్లీ ఇంపీరియల్ 400 త్వరలో లాంచ్ కానున్న ట్రయంఫ్ స్పీడ్ 400లతో కూడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 రేంజ్‌తో పోటీపడుతుంది.

* Harley-Davidson X440 Denim : రూ. 2.29 లక్షలు
* Harley-Davidson X440 Vivid : రూ. 2.49 లక్షలు
* Harley-Davidson X440 S : రూ. 2.69 లక్షలు

Read Also : Jio Bharat Phone : ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ‘జియోభారత్’ ఫోన్‌ వచ్చేసిందోచ్.. కేవలం రూ. 999 మాత్రమే.. త్వరపడండి..!