రిపబ్లిక్ డే సేల్: నోకియా కొత్త ఫోన్లపై 100% క్యాష్ బ్యాక్

వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ తయారీ సంస్థలు పోటాపోటీగా సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. డిస్కౌంట్ లు, క్యాష్ బ్యాక్ లంటూ యూజర్లను ఊరిస్తున్నాయి. రిపబ్లిక్ డే సేల్స్ అంటూ మొబైల్ తయారీ సంస్థలు సొంత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

  • Published By: sreehari ,Published On : January 24, 2019 / 10:22 AM IST
రిపబ్లిక్ డే సేల్: నోకియా కొత్త ఫోన్లపై 100% క్యాష్ బ్యాక్

వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ తయారీ సంస్థలు పోటాపోటీగా సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. డిస్కౌంట్ లు, క్యాష్ బ్యాక్ లంటూ యూజర్లను ఊరిస్తున్నాయి. రిపబ్లిక్ డే సేల్స్ అంటూ మొబైల్ తయారీ సంస్థలు సొంత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

మొబైల్ మార్కెట్లో రిపబ్లిక్ డే సేల్స్ సందడి మొదలైంది. ఇప్పటికే ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ లపై మొబైల్ సేల్ ఆఫర్ల మోత మోగుతోంది. 70వ రిపబ్లిక్ డే సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ తయారీ సంస్థలు పోటాపోటీగా సరికొత్త ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. డిస్కౌంట్ లు, క్యాష్ బ్యాక్ లంటూ యూజర్లను ఊరిస్తున్నాయి. రిపబ్లిక్ డే సేల్స్ అంటూ మొబైల్ తయారీ సంస్థలు సొంత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఫిన్నీస్ హెచ్ఎండీ గ్లోబల్ అనుబంధ సంస్థ నోకియా కూడా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై కొత్త ఆఫర్లను అందిస్తోంది. నోకియా అందిస్తోన్న ఐదు సరికొత్త మోడల్ ఫోన్లలో ఏ ఫోన్ మోడల్ తీసుకున్నా సరే.. వారికి ఏకంగా 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. నోకియా అందించే ఐదు మోడల్స్ లో (నోకియా 8.1, నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్, నోకియా 3.1 ప్లస్) మోడల్ ఏదైనా.. రిపబ్లిక్ డే సేల్ సమయంలో ఒకటి కొన్నా చాలు.. మీరు 100 శాతం క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు చేయాల్సిందిల్లా నోకియా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ఐదు మోడల్స్ లో ఏదోక నోకియా మోడల్ ఫోన్ కొనుకోవాల్సి ఉంటుంది. రిపబ్లిక్ డే జనవరి 26 నుంచి జనవరి 30 వరకు సేల్ ఉంటుంది.

క్యాష్ బ్యాక్ కావాలా.. కండీషన్స్ ఆప్లై
కానీ, క్యాష్ బ్యాక్ పొందాలంటే నోకియా కండీషన్స్ ఆప్లై అంటోంది.100 శాతం క్యాష్ బ్యాక్ పొందాలంటే కొనుగోలుదారులు సేల్ కాంపిటీషన్ లో పాల్గొనాలి. నోకియా స్టోర్ నుంచి మాత్రమే నోకియా కొత్త ఫోన్లు కొనుగోలు చేయాలి. అప్పుడే నోకియా మిమ్మల్ని పార్టిషిపెంట్ గా లెక్కిస్తుంది. అంతేకాదండోయ్.. ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. కొన్నప్రతివారికీ 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించదు. ఇందులో ఎవరైతే నోకియా క్రైటేరియాను రీచ్ అవుతారో వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జనవరి 23 సేల్ ప్రారంభమైన తొలిరోజు నుంచి (జనవరి 30) ముగిసేవరకు రోజుకో ఒకరిని మాత్రమే విజేతగా ప్రకటించి వారికే 100 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తుంది. తమిళనాడు రాష్ట్రంలోని కొనుగోలుదారులకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదట. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే నోకియా స్టోర్ లోకి వెళ్లి మీకు కావాల్సిన నోకియా ఫోన్ మోడల్ కొనేయండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కొట్టేయండి.