Honda Cb200x Vs Royal Enfield Himalayan
Honda CB200X vs Royal Enfield Himalayan : ప్రస్తుత దేశీయ మార్కెట్లో అడ్వెంచర్ బైకులకు భారీ డిమాండ్ ఉంది. అందులో అడ్వెంచర్ టూరింగ్ ఆప్షన్లతో వచ్చిన బైకుల్లో పాపులర్ బ్రాండ్ రాయల్ ఎన్ ఫీల్డ్.. భారతీయ మార్కెట్లో దీని క్రేజే వేరు. లేటెస్టుగా హోండా మోటార్‌సైకిల్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle and Scooter India) కొత్త Hornet 2.0 ఆధారిత అడ్వెంచర్ మోటార్‌సైకిల్ (CB200X)బైకుని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైకు (Royal Enfield Himalayan)కు ఎంతమాత్రం పోటీదారి కాదు. కానీ, భారతీయ మార్కెట్లో చాలా తక్కువ మాత్రమే అడ్వెంచర్ టూరింగ్ బైకులు అందుబాటులో ఉన్నాయి. దాంతో రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు సహా ఈ కొత్త CB200X కూడా పరోక్షంగా భారీ డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Oki90 : త్వరలో మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ వెహికల్
ఈ రెండు మోడల్స్ సెగ్మెంట్లను కంపేర్ చేసి చూస్తే.. ఈ కొత్త CB200X హిమాలయన్ బైక్‌కు గట్టిపోటీనిచ్చేలా ఉంది. బడ్జెట్ ఆధారంగా కస్టమర్లను తొందరగా ఆకర్షించాలంటే అందుకు తగినట్టుగా ఫీచర్లు ఉండాలి. అందుకే Hero XPulse 200 రేంజ్‌లో RE హిమాలయన్ కస్టమర్లను లక్ష్యంగా CB200X బైకుతో హోండా మార్కెట్లోకి వస్తోంది. హిమాలయన్ బైకులో పెద్ద డిస్ప్లేస్‌మెంట్ ఇంజిన్ అమర్చారు. 411 cc సింగిల్ సిలిండర్ పవర్‌ట్రెయిన్. 24 PS 32 Nm గరిష్ట టార్క్‌ను అందించగలదు. అదే CB200X బైకు 184cc PGM-FI ఇంజిన్‌ను కలిగి ఉంది. 8500 rpm వద్ద 17.2 6000 rpm వద్ద 16.1 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ అవుట్‌పుట్ పరంగా పరిశీలిస్తే.. హిమాలయన్ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంది. హిమాలయన్ ఫీచర్లలో హాఫ్-డ్యూప్లెక్స్ స్ప్లిట్ క్రెడిల్ ఫ్రేమ్ ఉంది. CB200X డైమండ్ టైప్ స్టీల్ ఫ్రేమ్‌తో వస్తుంది.
ఫీచర్‌ల విషయానికొస్తే.. CB200X పూర్తిగా డిజిటల్ లిక్విడ్ క్రిస్టల్ మీటర్‌ను కలిగి ఉంది. మరోవైపు, హిమాలయన్ మీటర్ మల్టీ డయల్ లేఅవుట్‌తో పాటు ట్రిప్పర్‌ని నావిగేషన్ సిస్టమ్ కలిగి ఉంది. CB200X బైకులో LED స్టాంటెడ్ లైటింగ్ తో వస్తోంది. హిమాలయన్ మాత్రమే LED లైట్ మీద టైల్ లైట్ కలిగి ఉంది. CB200X అప్‌సైడ్ డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్ సెటప్‌ను కలిగి ఉంది. హిమాలయన్ ఫీచర్లలో టెలిస్కోపిక్, 41 mm ఫోర్క్, 200 mm ట్రావెల్ తో వస్తుంది. ఈ రెండు ADV వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్ కలిగి ఉన్నాయి.
CB200X బైకు ధర (ఎక్స్-షోరూమ్, గుర్గామ్)లో రూ.144,500గా ఉంది. అదే రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ ధర (ఎక్స్-షోరూమ్)తో కలిపి రూ. 2.05 నుంచి రూ. 2.13 లక్షల రేంజులో ఉంది. ఖరీదు పరంగా ఈ రెండు బైకుల మధ్య గణనీయమైన తేడా ఉంది. బడ్జెట్ ఆధారంగా కస్టమర్లను ఈ రెండు బైకులు ఆకర్షించే అవకాశం ఉంది.
Simple One Vs Ola: ఇందులో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్.. ఏయే ఫీచర్లు బాగున్నాయి