Simple One Vs Ola: ఇందులో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్.. ఏయే ఫీచర్లు బాగున్నాయి
స్కూటర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. దేశంలో రెండు ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్లోకి వచ్చాయి. ఓలా ఎలక్ట్రానిక్, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ కంపెనీలు లాంచ్ చేశాయి.

Ola Electric Scooter Vs Simple One E Bike Compare Price, Range & Features Before Booking (1)
Simple One Vs Ola Features : స్కూటర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. పెట్రోల్ వాహనాలతో విసిగిపోయారా? ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు మార్కెట్లోకి వచ్చేశాయి. దేశంలో లేటెస్టుగా రెండు ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. అందులో ఒకటి ఓలా ఎలక్ట్రానిక్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Scooter).. రెండోది సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచి సింపుల్ వన్ ఈ-బైక్ (Simple One). ఓలా ఎలక్ట్రానిక్, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ కంపెనీల నుంచి వచ్చిన ఈ రెండు ఈ-స్కూటర్లలో ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఓలా స్కూటర్ బెస్టా? లేదా సింపుల్ వన్ స్కూటర్ బెస్టా అంటే చెప్పడం కష్టమే. అలాంటి వినియోగదారులకు ఎందులో బెస్ట్ ఫీచర్లు ఉన్నాయో తెలిపే ప్రయత్నమే ఇది.. బుకింగ్ చేసుకునే ముందు ఈ రెండింట్లో మీకు నచ్చిన ఫీచర్లు ఉన్న స్కూటర్ ఎంచుకుని కొనుగోలు చేసుకోవచ్చు.
బుకింగ్ ఫీజు :
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి రెండు మోడల్స్ ఉన్నాయి. అందులో S1, S1 pro స్కూటర్లు మార్కెట్లోకి వచ్చేశాయి. S1 మోడల్ ధర రూ.99,999 ఉండగా.. S1 Pro మోడల్ ధర 1,29,999గా నిర్ణయించింది. Ola S1 స్కూటర్‌ను కేవలం రూ.499 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1,09,999 నుంచి అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ బుకింగ్ కోసం రూ.1947 చెల్లించాల్సి ఉంటుంది.
టాప్ స్పీడ్ :
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ S1 90 మోడల్ గంటకు 90కిలోమీటర్ల టాప్ స్పీడ్ అందిస్తుంది. S1 Pro 115kmph టాప్ స్పీడ్ అందిస్తుంది. అలాగే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్‌స్పీడ్ రేంజ్ 98kmph నుంచి 105kmph వరకు అందిస్తుంది. S1 Pro మూడు సెకన్లలోనే 115 టాప్ స్పీడ్‌ను అందుకోగల సామర్థ్యం ఉంది.
చార్జింగ్ సమయం :
ఓలా స్కూటర్ పోర్టబుల్ హోమ్ చార్జర్‌తో వచ్చింది. ఫుల్ చార్జ్ కోసం S1 స్కూటర్ కు 4.48 గంటలు సమయం తీసుకుంటుంది. S1 Pro స్కూటర్ అయితే 6.30 గంటలు సమయం పడుతుంది. సింపుల్ వన్ స్కూటర్ పోర్టబుల్ 15A చార్జింగ్ సాకెట్‌తో వచ్చింది. 2.5 గంటల్లో ఫుల్ చార్జింగ్ సమయం తీసుకుంటుంది.
మైలేజీ :
ఓలా ఎలక్ట్రిక్ ప్రకారం.. ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే S1 మోడల్ మాత్రం 121 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. S1 Pro 181 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 2.98 కిలోవాట్స్, 3.97 కిలోవాట్స్ బ్యాటరీలు రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తోనే ఇన్ బుల్ట్ వచ్చేశాయి. సింపుల్ వన్ స్కూటర్ కూడా ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 236 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇందులో 4.8 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చినట్టు కంపెనీ తెలిపింది.
ఫీచర్లు ఇవే :
ఓలా S1 డిజిటల్ కీ ఫీచర్‌తో పనిచేస్తుంది. ఫిజికల్‌గా Key అవసరం లేదు. మీ ఫోన్‌తో ఇంటిగ్రేట్ అయి ఆపరేట్ చేయొచ్చు. మీ ఫోన్ సాయంతో స్కూటర్ దగ్గరకు వెళ్లగానే ఆటోమెటిక్‌గా అన్‌లాక్ అయిపోతుంది. బైక్‌ను పార్క్ చేసి దూరంగా వెళ్తే ఆటోమెటిక్‌గా లాక్ అయిపోతుంది. LED లైట్స్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, AI Speech రికగ్నిషన్ ఆల్గారిథమ్స్ బిల్ట్ ఇన్ హౌస్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ సిస్టమ్, మల్టీ మైక్రోఫోన్ అర్రే, జియో ఫెన్సింగ్, వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా.. సింపుల్ వన్ స్కూటర్ 4G నెట్‌వర్క్ ఆధారంగా వర్క్ అవుతుంది. 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ప్యానెల్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఓవర్ ద ఎయిర్ అప్‌డేట్స్, జియో ఫెన్సింగ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు.
అందుబాటులో ఎక్కడంటే? :
సింపుల్ వన్ స్కూటర్.. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తర ప్రదేశ్, గుజారత్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గోవా రాష్ట్రాల్లో మాత్రమే ఈ స్కూటర్ లాంచ్ చేసింది కంపెనీ. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ S1 స్కూటర్ సేల్స్ సెప్టెంబర్ 8, 2021 నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా దేశవ్యాప్తంగా 1000 నగరాల్లో అక్టోబర్ నెల వరకు డెలివరీలను అందిస్తామని ఓలా ప్రకటించింది.