Honda CB300R Prices : కొంటే ఇలాంటి బైక్ కొనాలి భయ్యా.. ఈ హోండా బైకులపై బిగ్ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Honda CB300R Price : హోండా బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. హోండా CB300R, CB300F బైక్ మోడళ్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లను అందిస్తోంది.

Honda CB300R Prices : కొంటే ఇలాంటి బైక్ కొనాలి భయ్యా.. ఈ హోండా బైకులపై బిగ్ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Honda CB300R Price

Updated On : October 3, 2025 / 6:23 PM IST

Honda CB300R Prices : కొత్త హోండా బైక్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో భారీ తగ్గింపు ధరకే హోండా బైకులు లభ్యమవుతున్నాయి. మీరు 300cc సెగ్మెంట్‌లో పవర్‌ఫుల్, స్టైలిష్ బైక్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఇటీవలే జీఎస్టీ 2.0 రేట్ల అమల్లోకి రావడంతో హోండా మరింత తగ్గింపు పొందింది.

ప్రస్తుతం హోండా CB300R, CB300F అనే రెండూ బైకులు భారీ తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. ఈ బైక్‌లు ఇప్పుడు గతంలో కన్నా చాలా సరసమైన ధరకే లభిస్తున్నాయి. ఇదే సెగ్మెంట్‌లో ఇతర బైక్‌లకు గట్టి పోటీని ఇస్తున్నాయి. ఈ రెండు బైక్‌ల ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.

హోండా CB300R :
హోండా సీబీ300ఆర్ బైక్ మోడల్ ధర నేరుగా రూ.21వేలు తగ్గింది. మొదట్లో రూ.2.40 లక్షలుగా ఉన్న ఈ బైక్ ధర ఇప్పుడు రూ. 2.19 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గింది. ఈ ధర వద్దనే సీబీ300ఆర్ ట్రయంఫ్ స్పీడ్ 400 (రూ. 2.50 లక్షలు), టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 (రూ. 2.21 లక్షలు) కన్నా చౌకగా లభిస్తుంది. కేటీఎం 250 డ్యూక్ (రూ. 2.12 లక్షలు)కి దగ్గరగా ఉంది.

భారత మార్కెట్లో 2019లో హోండా సీబీ300ఆర్ లాంచ్ కాగా BS6 నిబంధనలు అమల్లోకి రావడంతో ఈ మోడల్ నిలిపివేసింది కంపెనీ. కానీ, 2022లో BS6 వెర్షన్‌తో తిరిగి మార్కెట్లోకి వచ్చింది. ఆ సమయంలో ఈ బైక్ ధర రూ. 2.77 లక్షలు. 2023లో స్థానికీకరణ కారణంగా ధర రూ. 2.40 లక్షలకు తగ్గింది. ఇప్పుడు, జీఎస్టీ 2.0 అమల్లోకి రావడంతో ఈ హోండా సీబీ300ఆర్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది.

హోండా CB300R డిజైన్, ఫీచర్లు :

డిజైన్, ఫీచర్ల విషయానికి వస్తే.. హోండా CB300R బైక్ నియో-రెట్రో లుక్ అత్యంత ఆకర్షణగా ఉంటుంది. రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్మూత్ బాడీ ప్యానెల్‌లు, మినిమలిస్ట్ డిజైన్ స్పెషల్ అట్రాక్షన్ కలిగి ఉంది. ఈ బైక్ 286cc, సింగిల్-సిలిండర్, DOHC, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. 31hp, 27.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అసిస్ట్, స్లిప్పర్ క్లచ్, గోల్డెన్ USD ఫోర్కులు, ట్రాక్షన్ కంట్రోల్, డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మోడ్రాన్ ఫీచర్లు ప్రీమియం టచ్‌ను అందిస్తాయి.

Read Also : Amazon Diwali Sale : అమెజాన్ దీపావళి సేల్ ఆఫర్.. ఈ ఇన్ఫినిక్స్ నోట్ 50s ప్లస్ 5G ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

హోండా CB300F :
ఇప్పుడు హోండా CB300F బైక్ విషయానికి వస్తే.. ఈ హోండా బైక్ ధర కూడా రూ.15వేలు తగ్గింది. మొదట్లో ఈ బైక్ ధర రూ. 1.70 లక్షలుగా ఉండేది. ఇప్పుడు రూ. 1.55 లక్షలకు తగ్గింది. దాంతో సీబీ300ఎఫ్ సెగ్మెంట్‌లో అత్యంత సరసమైన బైక్‌ ఇదే.. బజాజ్ డొమినార్ 250తో పోల్చితే ధర రూ. 1.77 లక్షలు, హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ ధర రూ. 1.66 లక్షలు ఉంటుంది. హోండా సీబీ300ఎఫ్ స్టయిల్, పర్ఫార్మెన్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

హోండా CB300F ఇంజిన్, ఫీచర్లు :
ఇంజిన్, ఫీచర్ల పరంగా హోండా CB300F 293CC ఎయిర్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో పవర్ కలిగి ఉంది. 24hp, 25.6Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్‌తో వస్తుంది. ముఖ్యంగా, ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌ను 2024లో ప్రవేశపెట్టారు. ఈ మోడల్ E85 ఫ్యూయిల్ (85శాతం ఇథనాల్, 15శాతం పెట్రోల్)తో కూడా నడపగలదు. ఆసక్తికరంగా, ఈ బైక్ ధర స్టాండర్డ్ వెర్షన్ (ధర రూ.1.55 లక్షలు) మాదిరిగానే ఉంటుంది.