Kranthi Madhav : ఆ సూపర్ హిట్ డైరెక్టర్ రీ ఎంట్రీ.. చైతన్య రావుతో కొత్త సినిమా అనౌన్స్..

కొన్నాళ్ళకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.(Kranthi Madhav)

Kranthi Madhav : ఆ సూపర్ హిట్ డైరెక్టర్ రీ ఎంట్రీ.. చైతన్య రావుతో కొత్త సినిమా అనౌన్స్..

Kranthi Madhav

Updated On : October 3, 2025 / 6:24 PM IST

Kranthi Madhav : ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు క్రాంతి మాధవ్ చివరగా అవిజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తీసాడు. అప్పట్నుంచి కొన్నాళ్ళకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన క్రాంతి మాధవ్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.(Kranthi Madhav)

శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై చైతన్య రావు, ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నేడు కొత్త సినిమాని ప్రారంభించారు. ఈ కొత్త సినిమా నేడు అక్టోబర్ 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ దేవా కట్టా క్లాప్ కొట్టగా, నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా తొలి సన్నివేశానికి వర ముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించారు.

Also See : Kiran Abbavaram : ఫ్రెండ్ పెళ్ళిలో భార్య, కొడుకుతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం.. క్యూట్ ఫొటోలు వైరల్..

సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో డైరెక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడుతూ.. ఇది నాకు ఐదో సినిమా. చైతన్య, పూర్ణ గార్లతో నాది ఎన్నో ఏళ్ల బంధం. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు తరువాత పూర్ణ గారితో ఓ సినిమా చేయాలి. హిట్స్‌లో ఉన్నప్పుడు చేయను.. బాధల్లో ఉన్నప్పుడు చేస్తాను అని అన్నారు. నా గత సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో పూర్ణ గారు వచ్చి సినిమా చేద్దామని అన్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతోంది అని తెలిపారు.

Kranthi Madhav

హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. క్రాంతి అన్నతో నాది మూడేళ్ల బంధం. ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాను. నాకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చాలా ఇష్టమైన సినిమా. మయసభ, ఘాటీ తరువాత ఇంత మంచి సినిమా చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను. క్రాంతి అన్న చెప్పిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ కథ నాకు చాలా నచ్చింది అని అన్నారు. నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ.. క్రాంతిని నేను దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నాను కానీ ఇన్నాళ్లకు మా ఇద్దరికీ మూవీ సెట్ అయింది. క్రాంతి చెప్పే కథలంటే నాకు చాలా ఇష్టం అని అన్నారు.

Also Read : Kantara Chapter 1 Collections : కాంతార చాప్టర్ 1 ఫస్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..? టార్గెట్ మిస్ అయింది..

హీరోయిన్ ఐరా మాట్లాడుతూ.. నాది బెంగళూరు. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. నేను తెలుగులోనే ఇంట్రడ్యూస్ అవ్వాలి కానీ తమిళంలో అయ్యాను. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా నేను దాదాపు 20 సార్లు చూసి ఉంటాను. క్రాంతి గారి నుంచి నాకు ఫోన్ రావడంతో చాలా సంతోషించాను అని తెలిపింది.