Kantara Chapter 1 Collections : కాంతార చాప్టర్ 1 ఫస్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..? టార్గెట్ మిస్ అయింది..

మొదట్లో ఈ సినిమాకి మొదటి రోజే 100 కోట్లు వస్తాయని అంచనా వేశారు. (Kantara Chapter 1 Collections)

Kantara Chapter 1 Collections : కాంతార చాప్టర్ 1 ఫస్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా..? టార్గెట్ మిస్ అయింది..

Kantara Chapter 1 Collections

Updated On : October 3, 2025 / 4:19 PM IST

Kantara Chapter 1 Collections : రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన కాంతార ఛాప్టర్ 1 సినిమా నిన్న అక్టోబర్ 2న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా భారీగానే తెరకెక్కింది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా జయరాం, గుల్షన్ దేవయ్య.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.(Kantara Chapter 1 Collections)

ముందు నుంచి ఈ సినిమాకు అంచనాలు బాగానే ఉన్నాయి కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత, కన్నడ – తెలుగు భాషా వివాదంతో ఈ సినిమాకు కొంత నెగిటివిటి వచ్చింది. కన్నడలో మాత్రం ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. అలాగే అక్కడ వేరే సినిమాలేమి లేవు. దసరా పండగ కూడా ఉండటంతో మొత్తానికి కాంతార ఛాప్టర్ 1 సినిమాకు బాగానే కలిసి వచ్చింది.

Also See : Vishal Sai Dhanshika : కాబోయే భార్యతో విశాల్ దసరా పూజలు.. ఫొటోలు..

మొదట్లో ఈ సినిమాకి మొదటి రోజే 100 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా జరగకపోవడంతో భయపడ్డారు. చివరి నిమిషంలో దసరా ఫెస్టివల్ కావడంతో బాగా కలిసి వచ్చింది. తాజాగా మూవీ యూనిట్ కాంతార ఛాప్టర్ 1 సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు. కాంతార ఛాప్టర్ 1 సినిమా మొదటి రోజు 89 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిందని ప్రకటించారు.

దీంతో వంద కోట్ల టార్గెట్ కొంతలో మిస్ అయిందని భావిస్తున్నారు. హాలిడేస్ ఉండటం, కన్నడలో ఏ సినిమా లేకపోవడం కాంతార ఛాప్టర్ 1 కి కలిసొస్తుంది. మరి కాంతార కలెక్షన్స్ 400 కోట్లను ఈ సినిమా బీట్ చేస్తుందా లేదా చూడాలి. రాజుల కాలం నాటి ఓ రొటీన్ కథకి అక్కర్లేని కామెడీ, అద్భుతమైన విజువల్స్, దైవత్వం జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో ఏం లేకపోయినా సెకండ్ హాఫ్ సినిమాకు బాగా కలిసొచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

kantara

Also See : Ram Charan : ఘనంగా ప్రారంభమైన ఆర్చరీ ప్రీమియర్ లీగ్.. గెస్ట్ గా గ్లోబల్ స్టార్.. ఫొటోలు..