Honda Shine vs Hero HF Deluxe Honda Shine 100 vs Hero HF Deluxe vs Hero Splendor+ vs Bajaj Platina 100 Which is cheapest Price comparison
Honda Shine Hero HF Deluxe : ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ (Honda Motor Cycle), స్కూటర్ ఇండియా (Scooter India) మొదటి 100cc మోటార్‌సైకిల్, హోండా షైన్ 100 (Honda Shine 100)ని లాంచ్ చేసింది. ఇప్పుడు,100cc సెగ్మెంట్‌లో దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో (Hero) నుంచి రెండు మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. దాంతో హీరో, హోండా కంపెనీ మధ్య చాలా పోటీగా మారింది. HF డీలక్స్, హీరో స్ప్లెండర్+ (Hero Splendor+) తర్వాత బజాజ్ ప్లాటినా 100 కూడా అందుబాటులో ఉంది. వీటిలో ఏది చౌకగా ఉంటుందో చూద్దాం.
హోండా షైన్ 100 ప్రారంభ ధర రూ.64,900గా ఉంది. హీరో HF డీలక్స్ ధర రూ. 61,232గా ఉంది. (Hero Splendor+) ధర రూ. 72,420 నుంచి ప్రారంభం కాగా, బజాజ్ ప్లాటినా 100 బేస్ వేరియంట్‌ను రూ. 67,475 వద్ద పొందవచ్చు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబైకి చెందినవి అని గమనించాలి. హోండా షైన్ 100 కొత్త 100cc OBD2-కంప్లైంట్ PGM-FI ఇంజన్‌ను కలిగి ఉంది. పవర్, టార్క్ గణాంకాలు ఇంకా బయటకు రాలేదు. Shine 100కి క్లాస్-లీడింగ్ మైలేజీని హోండా కంపెనీ అందిస్తుండగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
Honda Shine Hero HF Deluxe : Honda Shine vs Hero HF Deluxe Honda Shine 100 vs Hero HF Deluxe vs Hero Splendor+
Hero Splendor+, Hero HF Deluxe రెండూ ఒకే 97.2cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, OHC ఇంజిన్‌తో వస్తాయి. 8.02PS గరిష్ట శక్తిని, 8.05Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందిస్తుంది. బజాజ్ ప్లాటినా 100 102cc, 4-స్ట్రోక్, DTS-i, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది.
గరిష్టంగా 7.9PS శక్తిని, 8.3Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చింది. హోండా షైన్ 100 కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. వచ్చే ఏప్రిల్‌లో మోటార్‌సైకిల్ ఉత్పత్తి ప్రారంభమై.. మే 23 నుంచి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది.
Read Also : 2023 Honda Motorcycle : 2023 హోండా 100cc మోటార్ సైకిల్ ఇదిగో.. మార్చి 15నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?