2023 Honda Motorcycle : 2023 హోండా 100cc మోటార్ సైకిల్ ఇదిగో.. మార్చి 15నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
2023 Honda Motorcycle : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle), స్కూటర్ ఇండియా (Scooter India) రాబోయే 100CC మోటార్‌సైకిల్ లాంచ్ చేయనుంది.

2023 Honda 100cc Motorcycle _ More details emerge before March 15 launch
2023 Honda Motorcycle : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle), స్కూటర్ ఇండియా (Scooter India) రాబోయే 100CC మోటార్‌సైకిల్ లాంచ్ చేయనుంది. భారత మార్కెట్లో 2023 హోండా 100cc మోటార్‌సైకిల్ లాంచ్ మార్చి 15న జరుగనుంది. లేటెస్ట్ టీజర్ ప్రకారం.. 2023 హోండా 100cc మోటార్‌సైకిల్‌కు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు లభిస్తాయని కనిపిస్తోంది. ఈ బైక్ టాప్ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉండవచ్చు.
మరో ఫీచర్ ఫ్లాట్ సీటు కూడా ఉండే అవకాశం ఉంది. హోండా కంపెనీ ప్రస్తుతం CD110 డ్రీమ్, Livo, షైన్, SP125, Unicorn, X-Blade, Hornet 2.0, CB 200X వంటి మోటార్‌సైకిళ్లను (నాన్ ప్రీమియం) విక్రయిస్తోంది. డియో, యాక్టివా, యాక్టివా 125, గ్రాజియా 125 వంటి స్కూటర్లను అందిస్తుంది. 2023 హోండా 100CC మోటార్‌సైకిల్ కంపెనీకి కొత్త ఎంట్రీ లెవల్ బైక్‌గా ఉంటుంది.

2023 Honda 100cc Motorcycle _ More details emerge before March 15 launch
CD110 Dream కింద కనిపిస్తుంది. దీని ధర రూ. 71,133 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ). 2023 హోండా 100cc మోటార్‌సైకిల్ పోటీదారులలో Hero HF డీలక్స్, హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా 100 ఉన్నాయి. ఫిబ్రవరిలో హోండా దేశీయ మార్కెట్లో 227,064 యూనిట్లను విక్రయించింది. మరో 20,111 యూనిట్లను హోండా కంపెనీ ఎగుమతి చేసింది. హోండా రాబోయే 100cc మోటార్‌సైకిల్ Livo, షైన్ 125 మాదిరిగా డిజైన్ ఉండే అవకాశం ఉంది.
ఈ బైక్ పేరును అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. దీనిని హోండా షైన్ 100 (Honda Shine) కూడా పిలుస్తారు. 100cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. RDE కంప్లైంట్, E20 ఇంధనంతో కూడా పని చేస్తుంది. స్టార్ట్ లెవల్ ప్రొడక్టు కావడంతో ప్రాథమిక ఫీచర్లతో మాత్రమే రానుంది.

2023 Honda 100cc Motorcycle _ More details emerge before March 15 launch
హోండా ఇటీవలే యాక్టివా H-స్మార్ట్‌ను భారత మార్కెట్లో రూ. 80,537 ఎక్స్-షోరూమ్‌కు రిలీజ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ Key సిస్టమ్ స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ ఫీచర్‌లను కలిగి ఉంది. కంపెనీ త్వరలో H’ness CB350, CB350RS కోసం కొన్ని అనుబంధ కిట్‌లను కూడా అందించింది. H’ness కోసం 4 కస్టమైజడ్ ప్యాక్‌లు, CB350RS కోసం రెండు వెర్షన్లు అందుబాటులో ఉంటాయి.