New Honda Motorcycle : హీరో స్ప్లెండర్‌కు పోటీగా.. న్యూ హోండా 100CC మోటార్‌సైకిల్ వచ్చేస్తోంది.. మార్చి 15నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

New Honda Motorcycle : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle), స్కూటర్ ఇండియా (Scooter India) నుంచి మార్చి 15న భారత మార్కెట్లోకి కొత్త 100cc హోండా మోటార్‌సైకిల్‌ను లాంచ్ వచ్చేస్తోంది.

New Honda Motorcycle : హీరో స్ప్లెండర్‌కు పోటీగా.. న్యూ హోండా 100CC మోటార్‌సైకిల్ వచ్చేస్తోంది.. మార్చి 15నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

New Honda 100cc motorcycle launch in India on March 15, will rival Hero Splendor

New Honda Motorcycle : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle), స్కూటర్ ఇండియా (Scooter India) నుంచి మార్చి 15న భారత మార్కెట్లోకి కొత్త 100cc హోండా మోటార్‌సైకిల్‌ను లాంచ్ వచ్చేస్తోంది. కొత్త ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ CD 110తో వస్తోంది. ఈ హోండా డ్రీమ్ బైక్ ధర రూ. 71,133 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా ఉండనుంది.

హోండా మోటార్‌సైకిల్ లైనప్, భారీ బైక్‌లను మినహాయించి, CD 110 డ్రీమ్, Livo, Shine, SP125, Unicorn, X-Blade, Hornet 2.0, CB 200X వంటి మోడల్‌లను కలిగి ఉంది. స్కూటర్ ఇండియా అందించే మోడల్ స్కూటర్లలో డియో, యాక్టివా, యాక్టివా 125 గ్రాజియా 125 వంటి స్కూటర్లను విక్రయిస్తోంది. కొత్త హోండా 100CC మోటార్‌సైకిల్ హీరో HF డీలక్స్, హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా 100 వంటి వాటికి పోటీగా మార్కెట్లోకి వస్తోంది.

Read Also : OnePlus 11R Sale in India : వన్‌ప్లస్ 11R ఫోన్ సేల్ ఆఫర్లు.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

సెక్టార్ విశ్లేషకుల ప్రకారం.. ద్రవ్యోల్బణం పెరుగుదలతో పాటు అధిక యాజమాన్య ఖర్చులు, తగ్గిన డిమాండ్ కారణంగా ఎంట్రీ-లెవల్ టూ-వీలర్ సెగ్మెంట్ ఇప్పటికీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇండస్ట్రీ బాడీ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ విభాగంలో దేశీయ హోల్‌సేల్ వాల్యూమ్‌లు (ఇంజన్ కెపాసిటీ 75cc కన్నా ఎక్కువ.. 110cc కంటే తక్కువ లేదా అంతకంటే తక్కువ) 5.20శాతం తగ్గి 369,589 యూనిట్లకు పడిపోయింది. 2023 ఏడాది జనవరిలో 389,870 యూనిట్లుగా ఉంది.

New Honda 100cc motorcycle launch in India on March 15, will rival Hero Splendor

New Honda 100cc motorcycle launch in India on March 15, will rival Hero Splendor

హోండా దేశీయ ద్విచక్ర వాహనాల విక్రయాలు 11.75శాతం తగ్గి 2023 జనవరిలో 278,143 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలలో 315,196 యూనిట్లు ఉన్నాయి. కంపెనీ ఇటీవలే 2023 హోండా యాక్టివా హెచ్-స్మార్ట్‌ను రూ. 80,537 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) వద్ద లాంచ్ చేసింది. యాక్టివా H-స్మార్ట్ హోండా (Smart Key)తో వస్తుంది.

ఎలాంటి ఫిజికల్ కీని ఉపయోగించకుండా స్కూటర్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు. ఎలాంటి ఫిజికల్ కీని ఉపయోగించకుండా ఇంజిన్‌ను స్టార్ట్ చేయొచ్చు. హోండా స్మార్ట్ కీలో ఇమ్మొబిలైజర్ సిస్టమ్ కూడా ఉంది. తద్వారా నాన్ రిజిస్టర్ Keyతో ఇంజిన్ స్టార్ట్ చేయడం కుదరదు. మీరూ కూడా కొత్త హోండా బైక్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మార్చి 15వరకు వేచి ఉండాల్సిందే..

Read Also : Poco C55 Sale in India : ఫ్లిప్‌కార్ట్‌లో Poco C55 బడ్జెట్ ఫోన్ సేల్ మొదలైందోచ్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే?