Honda City 2023 Launch : కొత్త కారు కొంటున్నారా? సరికొత్త ఫీచర్లతో హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ఒక్కో వేరియంట్ ధర ఎంతంటే?

Honda City 2023 Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోండా సిటీ 2023 భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

Honda City 2023 Launch : కొత్త కారు కొంటున్నారా? సరికొత్త ఫీచర్లతో హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ఒక్కో వేరియంట్ ధర ఎంతంటే?

Honda City 2023 Launch _ Honda City 2023 launched in India, price

Honda City 2023 Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోండా సిటీ 2023ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కారు మోడల్ రూ. 11.49 లక్షల ప్రారంభ ధరకు అందిస్తోంది. హోండా బ్రాండ్ రేంజ్-టాపింగ్ వేరియంట్ రూ. 20.39 లక్షల వరకు ఉంది. 2023 సిటీ బ్రాండ్ సిటీ పెట్రోల్ (రూ. 11.49 లక్షలు నుంచి రూ. 15.97 లక్షలు), సిటీ e:HEV హైబ్రిడ్ (రూ. 18.89 లక్షల నుంచి రూ. 20.39 లక్షలు) ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఈ ధరలన్నీ (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)కి చెందినవే.. అయితే, ఇప్పుడు సిటీ డీజిల్ కారు వేరియంట్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేదు.

హోండా సిటీ 2023 కొత్త ఫీచర్లు ఇవే:
2023 హ్యుందాయ్ వెర్నాకు పోటీగా 2023 హోండా సిటీ సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. హోండా సిటీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అందించే ఫీచర్లలో డైమండ్ చెకర్డ్ ఫ్లాగ్ ప్యాటర్న్‌తో సరికొత్త గ్రిల్, కార్బన్ లోయర్ మౌల్డింగ్‌తో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్, కొత్త ఫాగ్ ల్యాంప్ గార్నిష్, కార్బన్ డిఫ్యూజర్‌తో కొత్త రియర్ బంపర్‌ను కలిగి ఉంది. బాడీ-కలర్ బూట్ లిడ్ స్పాయిలర్, సరికొత్త 16-అంగుళాల డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సిటీ ఫేస్‌లిఫ్ట్ అబ్సిడియన్ బ్లూ పెర్ల్ రూపంలో సరికొత్త కలర్ కూడా ఉంది.

Honda City 2023 Launch _ Honda City 2023 launched in India, price

Honda City 2023 Launch _ Honda City 2023 launched in India

క్యాబిన్ లోపల చూస్తే.. హోండా సిటీ పెట్రోల్ డ్యూయల్-టోన్ లైట్ బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్, సిటీ e:HEV హైబ్రిడ్ డ్యూయల్-టోన్ ఐవరీ, బ్లాక్ ఫినిషింగ్ ఉన్నాయి. హోండా సిటీ కారులో ఇప్పటికే హోండా వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ డోర్ ఇన్నర్ హ్యాండిల్, ఫ్రంట్ డోర్ పాకెట్స్ యాంబియంట్ లైటింగ్ వంటి మరిన్ని బెల్స్, విజిల్‌లను యాడ్ చేసింది. సిటీ e:HEV హైబ్రిడ్‌లో కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ అసిస్టెంట్ సైడ్ గార్నిష్ ఫినిషింగ్, AC వెంట్‌లపై పియానో ​​బ్లాక్ సరౌండ్ ఫినిషింగ్, స్టీరింగ్ వీల్‌పై పియానో ​​బ్లాక్ గార్నిష్ ఉన్నాయి.

Read Also : New Honda Motorcycle : హీరో స్ప్లెండర్‌కు పోటీగా.. న్యూ హోండా 100CC మోటార్‌సైకిల్ వచ్చేస్తోంది.. మార్చి 15నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

హోండా సిటీలో మరో కొత్త ఫీచర్ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్ కూడా చేర్చింది. అద్భుతమైన కలర్లతో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉందని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ చేయొచ్చు. అంతేకాదు.. 2023 హోండా సిటీ వెనుక కెమెరా కూడా అప్‌గ్రేడ్ చేసింది.

Honda City 2023 Launch _ Honda City 2023 launched in India, price

Honda City 2023 Launch _ Honda City 2023 launched in India

సరసమైన ధరలో హోండా సిటీ 2023 ADAS కారు :
2023 సిటీ పెట్రోల్ ఇప్పుడు హోండా సెన్సింగ్‌తో వస్తుంది. కంపెనీ అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కలిగి ఉంది. ఇంతకుముందు సిటీ e:HEV హైబ్రిడ్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. కొత్తగా స్పెషల్ ఫీచర్ లో-స్పీడ్ ఫాలో ఇన్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సిటీ e:HEV హైబ్రిడ్‌ కూడా అందిస్తోంది. తక్కువ వేగంతో లేదా అధిక ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెహికల్ వెనుకు వాహనానికి మధ్య దూరాన్ని ముందుగానే అలర్ట్ చేసేందుకు సాయపడుతుంది. 2023 హోండా సిటీలో హోండా సెన్సింగ్ ద్వారా అందించే ఫీచర్లు ఇలా ఉన్నాయి.

Honda City 2023 Launch _ Honda City 2023 launched in India, price

Honda City 2023 Launch _ Honda City 2023 launched in India, price

* ఘర్షణ తగ్గించే బ్రేకింగ్ సిస్టమ్ (CMBS)
* తక్కువ-స్పీడ్ ఫాలోతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (సిటీ e:HEV)
* రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టమ్
* లేన్ కీప్ అసిస్ట్ సిస్టమ్
* లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ (New)
* ఆటో హై-బీమ్

హోండా సిటీ 2023లో కొత్త వేరియంట్‌లు ఇవే :
భారత్‌లో SUV మోడల్ కార్లు ప్రస్తుతం మార్కెట్‌ను శాసిస్తున్నాయనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, హోండా సిటీ కారు డ్రీమ్ కారుగా చెప్పవచ్చు. కంపెనీ ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లతో సిటీ ఫేస్‌లిఫ్ట్ రేంజ్ మరింత సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. సిటీ పెట్రోల్ కొత్త ఎంట్రీ-లెవల్ SV వేరియంట్‌ను అందిస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న V, VX, ZX లకు అదనంగా ఉంటుంది. సిటీ e:HEV హైబ్రిడ్ ఇప్పుడు పూర్తిగా ZX వేరియంట్‌తో పాటు కొత్త ఎంట్రీ-లెవల్ V వేరియంట్‌ను కలిగి ఉంది.

Honda City 2023 Launch _ Honda City 2023 launched in India, price

Honda City 2023 Launch _ Honda City 2023 launched in India, price

హోండా సిటీ 2023: ఇంజన్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఇవే :
2023 సిటీలో డీజిల్ ఇంజన్ లేదు. 1.5-లీటర్ VTEC DOHC పెట్రోల్ ఇంజన్‌తో వచ్చింది. 121PS గరిష్ట శక్తి,145Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్‌ను 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ CVTతో రన్ చేయొచ్చు. సిటీ e:HEV హైబ్రిడ్ 1.5-లీటర్ అట్కిన్సన్-సైకిల్ DOHC i-VTEC పెట్రోల్ ఇంజన్‌కు ఇంటిగ్రేట్ అయిన ఆటో-ఛార్జింగ్, రెండు-మోటార్ e-CVT సిస్టమ్‌తో వస్తుంది. e:HEV ఎలక్ట్రిక్-హైబ్రిడ్ సిస్టమ్ 3 డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. EV డ్రైవ్, హైబ్రిడ్ డ్రైవ్, ఇంజిన్ డ్రైవ్‌తో వచ్చింది. లిథియం-అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు తగ్గింపు సమయంలో రీబూట్ మోడ్‌ను కూడా ఉపయోగిస్తుంది. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ 126PS గరిష్ట శక్తిని 253Nm గరిష్ట మోటార్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా సిటీ 2023 మైలేజ్ ఎంతంటే? :
హోండా సిటీ 2023 మైలేజ్ పెట్రోల్ మాన్యువల్ 17.8kmpl, పెట్రోల్ CVTకి 18.4kmpl, e:HEV హైబ్రిడ్ 27.13kmpl వరకు అందిస్తుంది.

Honda City 2023 Launch _ Honda City 2023 launched in India, price

Honda City 2023 Launch _ Honda City 2023 launched in India

హోండా సిటీ 2023 ఒక్కో వేరియంట్ ధర ఎంతంటే? (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) :
* సిటీ పెట్రోల్ MT SV – రూ. 11.49 లక్షలు
* సిటీ పెట్రోల్ MT V – రూ. 12.37 లక్షలు
* సిటీ పెట్రోల్ CVT V – రూ. 13.62 లక్షలు
* సిటీ పెట్రోల్ MT VX – రూ. 13.49 లక్షలు
* సిటీ పెట్రోల్ CVT VX – రూ. 14.74 లక్షలు
* సిటీ పెట్రోల్ MT ZX – రూ. 14.72 లక్షలు
* సిటీ పెట్రోల్ CVT ZX – రూ. 15.97 లక్షలు
* సిటీ e:HEV హైబ్రిడ్ e-CVT V – రూ 18.89 లక్షలు
* సిటీ e:HEV హైబ్రిడ్ e-CVT ZX – రూ. 20.39 లక్షలు

Read Also : Best Laptops in India 2023 : ఈ మార్చిలో రూ. 50వేల లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ కొనేసుకోండి..!