Best Laptops in India 2023 : ఈ మార్చిలో రూ. 50వేల లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.. మీకు నచ్చిన బ్రాండ్ కొనేసుకోండి..!
Best Laptops in India 2023 : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. మీకు నచ్చిన బ్రాండ్‌లో అద్భుతమైన ఫీచర్లతో బెస్ట్ ల్యాప్‌టాప్‌లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Best Laptops in India 2023 _ Best Laptops Under 50K in India, you can buy in March 2023
Best Laptops in India 2023 : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. మీకు నచ్చిన బ్రాండ్‌లో అద్భుతమైన ఫీచర్లతో బెస్ట్ ల్యాప్‌టాప్‌లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి మార్కెట్‌లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో ఏయే బ్రాండ్ ల్యాప్‌టాప్ కొంటే బెటర్ అని చెప్పడం కష్టమే మరి. గత రెండు ఏళ్లలో OEM మోడళ్లు.. అదిరే ఫీచర్లతో కొన్ని ముఖ్యమైన PCలను ప్రారంభించాయి. మీ బడ్జెట్ రూ. 50వేల లోపులో ఉంటే.. ఆఫీసు వర్క్, లైట్ గేమింగ్ లేదా సినిమాలు చూడటానికి తగినంత ఆప్షన్లతో సరికొత్త మోడల్స్ ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లలో మీకోసం ఐదు బెస్ట్ ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ ల్యాప్‌టాప్ ఎంచుకుని కొనేసుకోండి. ఏయే బ్రాండ్ల ల్యాప్‌టాప్ ఉన్నాయో ఓసారి లుక్కేయండి..
RealmeBook (Slim) :
ఈ జాబితాలో రియల్‌మిబుక్ (Slim) ల్యాప్‌టాప్ అత్యంత శక్తివంతమైన ల్యాప్‌టాప్ కాకపోవచ్చు. కానీ, ఈ ల్యాప్‌టాప్ (Apple MacBooks) మాదిరిగానే మినిమలిస్ట్‌గా కనిపిస్తుంది. ల్యాప్‌టాప్ బరువు కేవలం 1.3 కిలోలు మాత్రమే ఉండగా.. చాలా స్లిమ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ల్యాప్‌టాప్ 14-అంగుళాల LCD 2K డిస్‌ప్లేతో గ్రేట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది. రియల్‌మిబుక్ (స్లిమ్) 11వ-జెన్ కోర్ i3, 8GB RAM, 256GB స్టోరేజీతో పాటు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. భారత మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 46,999 నుంచి అందుబాటులో ఉంది.

Best Laptops in India 2023 _ Best Laptops Under 50K in India
Asus Vivobook 15 :
మీకు టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ కావాలా? అయితే, (Asus Vivobook 15 (Touch) ల్యాప్‌టాప్ బెస్ట్ ఆప్షన్. ఈ ల్యాప్‌టాప్ డిజైన్ ఎక్కువగా ప్లాస్టిక్‌తో ఉన్నప్పటికీ చాలా ట్రెండీగా కనిపిస్తుంది. అలాగే, పోర్ట్ ఆప్షన్ కూడా బాగుంది. 15.6-అంగుళాల డిస్ప్లే 180 డిగ్రీల వరకు బెండ్ అయి ఉంటుంది. 8GB LPDDR4 RAMతో Intel కోర్ i3 (1220P), 512GB PCle 4.0 SSD స్టోరేజీతో పాటు Iris Xe GPU వంటి ఇతర ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో ప్రస్తుత ధర రూ. 44,990గా ఉంది.

Best Laptops in India 2023 _ Best Laptops Under 50K in India
Infinix InBook X2 Plus :
ఇన్‌ఫినిక్స్ (Infinix) కంపెనీ ల్యాప్‌టాప్ మార్కెట్‌లో చాలా పాపులర్ బ్రాండ్ కాకపోవచ్చు, కానీ, ఇన్‌ఫినిక్స్ అందించే ప్రొడక్టుల్లో చాలావరకూ అద్భుతంగా ఉంటాయనే చెప్పాలి. క్రియేటర్ల కోసం ఈ కంపెనీ కొన్ని మంచి నోట్‌బుక్స్ అందిస్తోంది. (Infinix InBook X2 Plus) ఫీచర్లను అందిస్తోంది. 16GB RAM, 512GB SSD, Windows 11తో వస్తుంది. ఇన్‌ఫినిక్స్ InBook X2 Plus కూడా 100 శాతం sRGB కలర్ గ్యామట్‌తో 15.6-అంగుళాల IPS ఫుల్-HD డిస్‌ప్లేను కలిగి ఉంది. భారత మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 47,990 నుంచి అందుబాటులో ఉంది.

Best Laptops in India 2023 _ Best Laptops Under 50K in India
HP 15s :
హెచ్‌పీ కంపెనీ అందించే ల్యాప్‌టాప్ మోడళ్లలో HP 15s ల్యాప్‌టాప్ ఒకటి. AMD పవర్‌ఫుల్ CPUలను ఉత్పత్తి చేస్తోంది. మీకు మంచి ల్యాప్‌టాప్ కావాలంటే Ryzen 5 (5500U)తో కూడిన HP 15s మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఆసక్తిగల వినియోగదారులు మోడరేట్ గేమ్‌లను కూడా ప్లే చేయవచ్చు. అదనంగా, నంబర్‌ప్యాడ్‌తో ఫుల్ సైజ్ కీబోర్డ్ కూడా ఉంది. HP 15s మోడల్ 15.6-అంగుళాల యాంటీ-గ్లేర్ ఫుల్-HD డిస్‌ప్లేతో పాటు AMD రేడియన్ గ్రాఫిక్‌లను కలిగి ఉంది. (Amazon Alexa) వాయిస్ అసిస్టెంట్‌కి కూడా సపోర్ట్ ఇస్తుంది. HP ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయడం వల్ల మరొక అద్భుతమైన ప్రయోజనం కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ కొన్న తర్వాత సర్వీసు సపోర్టు కూడా అందిస్తుంది. భారత మార్కెట్లో ధర రూ. 46,017 నుంచి ఉంటుంది.

Best Laptops in India 2023 _ Best Laptops Under 50K in India
Lenovo ThinkBook 15 :
హెచ్‌పీ ల్యాప్‌టాప్ (HP 15s) మోడల్ మాదిరిగానే లెనోవో (Lenovo ThinkBook 15) ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల డిస్ప్లేతో Ryzen 5 (5500U) CPU, 8GB RAM, 512GB SSD స్టోరేజీతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ కూడా ఇదే విధమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అందుకే ఈ ల్యాప్‌టాప్ అంత డిమాండ్ ఉంది.

Best Laptops in India 2023 _ Best Laptops Under 50K in India
అయితే, Lenovo ThinkBook 15 డ్యూయల్-టోన్ ఎండ్, అత్యాధునిక ఫీచర్లతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. HP ల్యాప్‌టాప్ మాదిరిగానే Levono కొనుగోలు చేసిన తర్వాత సర్వీసు సపోర్టు కూడా అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 45,990 నుంచి అందుబాటులో ఉంది.
Read Also : Moto G73 5G Launch : రూ. 20వేల లోపు ధరకే కొత్త మోటో F73 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?